Hyundai Venue Vs Kia Sonnet: భారత్ రహదారులపై నేడు కంపాక్ట్ ఎస్‌యూవీల హవా నడుస్తోంది. మధ్యతగతి కుటుంబాలకు ఇటు బడ్జెట్‌లో ఉంటూనే, అటు ప్రీమియం ఫీచర్లను అందించే కార్ల కోసం వెతుకులాట నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఈ రేసులో అగ్రస్థానంలో ఉన్న రెండు అద్భుతమైన మోడళ్లు హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్. ఈ రెండు కార్లు దాదాపు ఒకే రకమైన ఇంజిన్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ వినియోగదారుడి అవసరాలను ట్టి వీటి ఎంపిక మారుతుంటుంది.
ధరల, వేరియంట్లలో తేడా
బడ్జెట్ అనేది ప్రతి కారు కొనుగోలుదారుని మొదటి ప్రాధాన్యత వనరుల ప్రకారం, హ్యుందాయ్ వెన్యూ(HX 2 పెట్రోల్ 1.2L) ప్రారంభ ధర సుమారు 8 లక్షలు గా ఉంది. మరోవైపు కియా సోనెట్ (HTE పెట్రోల్ 1.2L) మరింత సరసమైన ధరకే అందుబాటులో ఉంది. దీని ధర 7.32 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. సుమారు 68వేల వ్యత్యాసం ఈ రెండు మోడళ్ల మధ్య కనిపిస్తోది. ఇది బడ్జెట్ వినియోగదారులకు సోనెట్ వైపు మొగ్గు చూపేలా చేస్తుంది.
ఇంజిన్ పని తీరు, మైలేజీ
ఈ రెండు కార్లలో 1197cc, 4 సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్ ఉపయోగించారు. రెండు కార్లూ 82bhp@6000 rpm శక్తిని ఉత్పత్తి చేస్తాయి. వెన్యూ 114. 7Nm టార్క్‌ను ఇంస్తుండగా, సోనెట్ స్వల్పంగా ఎక్కువగా 115Nm టార్గ్‌ను అందిస్తుంది. హ్యుందాయ్ వెన్యూ లీటర్‌కు 18.5 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. వినియోగదారుల ఫీడ్ బ్యాక్ ప్రకారం ఇది సుమారు 17 కిలోమీటర్ల ఇస్తుంది. కియో సోనెట్ విషయంలో వినియోగదారులు దాని ఫ్యూయల్ ఎకనామీకి 5/5 రేటింగ్ ఇచ్చారు.
భద్రతలో తోపు ఎవరు
నేటి కాలంలో కారు కొనేవారు భద్రతకు పెద్దపీట వేస్తున్నవారు. ఇక్కడే హ్యుందాయ్ వెన్యూ పైచేయి సాధిస్తోంది. వెన్యూ భారత్ ఎన్‌క్యాప్‌ల 5 స్టార్ రేటింగ్ సాధించి అత్యంత సురక్షితమైన కారుగా నిలిచింది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, రోల్ ఓవర్ సెన్సార్, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ అన్‌లాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కియా సోనెట్‌లో కడా ఆరు ఎయిర్ బ్యాక్‌లు ప్రామాణికంగా వస్తాయి. అయితే దీనికి ఇంకా అధికారిక ఎన్‌క్యాప్ రేటింగ్ పరీక్షలు నిర్వహించలేదు.
ఇంటీరియల్ , కంఫర్ట్
కారు లోపల సౌకర్యాల విషయంలో రెండు బ్రాండ్లు తమదైన శైలిని చూపిస్తున్నాయి. ప్రయాణాల్లో లగేజీ పెట్టుకోవడానికి కియా సోనెట్ 385 లీటర్ల స్థలాన్ని అందిస్తోంది. ఇది వెన్యూ కంటే కొంచెం ఎక్కువ. వెన్యూలో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. సోనెట్ లెదరెట్ సీట్లతో ప్రీమియం లుక్‌తో ఇస్తుండగా వెన్యూ ఫ్యాబ్రిక్ అప్హోల్స్టరీని ఉపయోగిస్తుంది.
