Next Gen Kia Seltos Launch: కొత్త తరం కియా సెల్టోస్ కోసం ఎదురుచూపులు పెరుగుతున్నాయి. డిసెంబర్ 10న ఫుల్ రివీల్‌కు ముందు, కియా విడుదల చేసిన టీజర్లు భారత ఆటోమొబైల్ మార్కెట్లో పెద్ద హైలైట్ అయ్యాయి. ఈసారి సెల్టోస్ పూర్తిగా కొత్త డిజైన్‌తో రాబోతోందని టీజర్లు చెప్పేస్తున్నాయి.
కొత్త గ్రిల్ డిజైన్ – మరింత వెడల్పు, మరింత ప్రీమియంమొదటి టీజర్ చూస్తే.... కొత్త సెల్టోస్ ముందు భాగాన్ని పూర్తిగా రీడిజైన్ చేసినట్లు స్పష్టంగా అర్ధమవుతుంది. ‘టైగర్ ఫేస్’ గ్రిల్‌ను మరింత వెడల్పుగా చేసి, క్రోమ్ హైలైట్స్‌తో కొత్త షార్ప్ LED DRLsను జత చేశారు. ప్రధాన హెడ్‌ల్యాంప్స్ గ్రిల్ ఎడ్జ్‌లలోనే ఉండటం ఈ SUVకి ఒక కొత్త ఐడెంటిటీని ఇస్తోంది. వాటితో పాటు, కింద భాగంలో ఇచ్చిన సిల్వర్ స్కిడ్ ప్లేట్ కారు ముందు లుక్‌ను మరింత అట్రాక్టివ్‌గా మార్చింది.
పానోరమిక్ సన్‌రూఫ్ & LED వెల్కమ్ యానిమేషన్‌టీజర్‌లో మరో ఆసక్తికరమైన ఫీచర్ - LED వెల్‌కమ్ యానిమేషన్. కారు దగ్గరకు వచ్చేటప్పుడు DRLs & హెడ్‌ల్యాంప్స్ ఎనిమేటెడ్ వెల్‌కమ్ లుక్ ఇస్తాయి. మరోవైపు, టీజర్ కెమెరా పైకి వెళ్తూ చూపించిన ఈ కారు పానోరమిక్ సన్‌రూఫ్, కొత్త సెల్టోస్‌లో వచ్చే అప్‌గ్రేడ్ లగ్జరీని సూచిస్తోంది.
రిట్రాక్టబుల్ డోర్ హ్యాండిల్స్ – ప్రీమియం SUV లెవల్ ఫీచర్‌సైడ్ ప్రొఫైల్ టీజర్ అయితే ఇంకా ఆసక్తికరం. మొత్తం SUVకి బ్లాక్‌డ్-ఔట్ పిల్లర్స్, కొత్త అలాయ్ వీల్స్, శాటిన్ క్రోమ్ స్ట్రిప్స్, బ్లాక్ రూఫ్ రైల్స్ తోపాటు రిట్రాక్టబుల్ డోర్ హ్యాండిల్స్ ఇచ్చారు. ఇది సాధారణంగా ప్రీమియం SUVsలో కనిపించే ఫీచర్.
క్యారెన్స్ క్లావిస్ స్టైల్‌లో రియర్ LED లైట్ బార్‌వెనుక భాగంలో ఉన్న కొత్త LED లైట్ బార్, Kia Carens Clavis ను గుర్తు చేసేలా ఉంది. గంటల ఆకారపు విండో లైన్, రూఫ్ స్పోయిలర్, మస్క్యులర్‌గా కనిపించే రియర్ స్కిడ్ ప్లేట్ – మొత్తం కలిసి SUVకు మరింత స్ట్రాంగ్ విజువల్ ప్రెజెన్స్ ఇస్తాయి.
భారత లాంచ్ – 2026 మొదటి అర్ధభాగంకొత్త సెల్టోస్‌ను డిసెంబర్ 10న కొరియాలో రివీల్ చేయనున్నారు. ఇండియా లాంచ్ మాత్రం 2026 తొలి అర్ధభాగంలో ఉండే అవకాశం ఉంది.
భారత మార్కెట్లో, కొత్త సెల్టోస్ SUV పోటీ పడబోయే మోడళ్ల జాబితా పెద్దదే:
- Hyundai Creta
- Tata Sierra
- Maruti Victoris
- Maruti Grand Vitara
- Toyota Hyryder
- Honda Elevate
- VW Taigun
- Skoda Kushaq
- MG Astor
- రాబోయే Renault Duster, Nissan Tekton
న్యూ జెన్ Kia Seltos టీజర్లు చూసిన తర్వాత ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది - ఈ మోడల్ కేవలం ఫేస్‌లిఫ్ట్ కాదు, పూర్తిగా కొత్త దృక్పథంతో రూపొందించిన SUV. డిజైన్, ఫీచర్లు, ప్రీమియమ్ టచ్ అన్నీ చూసిన తర్వాత సెల్టోస్ మరోసారి తన సెగ్మెంట్‌లో బెస్ట్‌సెల్లర్‌గా నిలిచే అవకాశాలు చాలా ఉన్నాయి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.