New Yezdi Scrambler Set to Launch News: ఇండియ‌న్ మోటార్ సైకిల్ రంగంలో క్లాసిక్ లెజెండ్స్ (Classic Legends) తన హవాను కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే ఏప్రిల్ 23, 2026న సరికొత్త యెజ్డీ స్క్రాంబ్లర్ (Yezdi Scrambler) బైక్‌ను మార్కెట్లో విడుదల చేయడానికి సర్వం సిద్ధం చేసింది. 2022 ప్రారంభంలో లాంచ్ అయిన తర్వాత ఈ బైక్‌కు జరుగుతున్న మొట్టమొదటి భారీ మార్పు ఇదే కావడం విశేషం. యెజ్డీ లైనప్‌లోని ఇతర మోడళ్లు ఇప్పటికే పలుమార్లు అప్‌డేట్ అయినప్పటికీ, స్క్రాంబ్లర్ మాత్రం ఇప్పటివరకు ఎటువంటి మార్పులు లేకుండానే కొనసాగుతోంది. ఇప్పుడు రాబోతున్న కొత్త వెర్షన్ ద్వారా కస్టమర్లకు మరింత మెరుగైన రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించాలని కంపెనీ భావిస్తోంది.

Continues below advertisement

Continues below advertisement

టెస్ట్ మ్యూల్స్ - ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్..ఇప్పటికే ఈ కొత్త బైక్‌కు సంబంధించిన టెస్టింగ్ మోడళ్లు పలుచోట్ల రోడ్లపై కనిపించాయి. దీనిని బట్టి చూస్తే బైక్ వెనుక భాగంలో సస్పెన్షన్ సెటప్‌ను పూర్తిగా మార్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న మోడల్ కంటే ఎక్కువ ట్రావెల్ ఇచ్చేలా దీనిని రూపొందించారు. దీనివల్ల గతుకుల రోడ్లపై ప్రయాణం చాలా సులభంగా ఉంటుంది. ఇవే కాకుండా లుక్స్ పరంగా కొన్ని కాస్మెటిక్ మార్పులు ఉండబోతున్నాయి. యువతను ఆకట్టుకోవడానికి సరికొత్త రంగుల్లో (Fresh Colors) ఈ బైక్ కస్టమర్ల ముందుకు రానుంది.

ఇంజిన్ సామర్థ్యం - టెక్నికల్ డీటెయిల్స్..మెకానికల్ విషయానికి వస్తే, యెజ్డీ స్క్రాంబ్లర్ తన పాత ఆల్ఫా 2 (Alpha 2) 334 సీసీ ఇంజిన్‌నే కొనసాగించే అవకాశం ఉంది. సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ టెక్నాలజీతో వచ్చే ఈ ఇంజిన్ 6-స్పీడ్ గేర్ బాక్స్‌తో జత చేయ బడింది. పవర్ డెలివరీలో స్వల్ప మార్పులు చేసినా, కోర్ ఇంజిన్ మాత్రం అదే ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. యెజ్డీ అడ్వెంచర్ ఇప్పటికే 2025 మధ్యలో అప్‌డేట్ అవ్వగా, తాజాగా రోడ్‌స్టర్ రెడ్ వోల్ఫ్ ఎడిషన్‌ను కూడా కంపెనీ లాంచ్ చేసింది.

650 సీసీ బిగ్ స్క్రాంబ్లర్ వస్తోందా?టూవీలర్ మార్కెట్లో వినిపిస్తున్న మరో ఆసక్తికరమైన వార్త ఏమిటంటే.. బీఎస్ఏ (BSA) బ్రాండ్ నుండి పెద్ద కెపాసిటీ కలిగిన స్క్రాంబ్లర్ రాబోతోంది. ఇది బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 లో వాడే 650 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో గోల్డ్ స్టార్ స్క్రాంబ్లర్ వెర్షన్ అందుబాటులో ఉంది. భారత్‌లో కూడా దీనిని ప్రవేశపెడితే రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి దిగ్గజాలకు గట్టి పోటీ ఎదురవుతుంది. క్లాసిక్ లెజెండ్స్ తన పోర్ట్‌ఫోలియోను నిరంతరం అప్‌డేట్ చేస్తూ వస్తోంది. ఏప్రిల్ 23న జరగబోయే ఈ లాంచ్ ఈవెంట్ ద్వారా స్క్రాంబ్లర్ ధర, పూర్తి ఫీచర్ల వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.