Tata Sierra 2025 Review: టాటా మోటార్స్ నుంచి వచ్చిన కొత్త Sierra 2025, ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనూ హీట్ పెంచింది. రెండు దశాబ్దాల తర్వాత తిరిగి వచ్చిన ఈ కారు, ఈసారి పూర్తి ఆధునిక లైఫ్‌స్టైల్ SUVగా రూపుదిద్దుకుంది. బాక్సీ డిజైన్‌తో ఒరిజినల్ Sierra (పాత సియెరా) కి గౌరవం ఇచ్చేలా కనిపించే ఈ కొత్త మోడల్, ఫ్యామిలీ యూజ్‌కి ఎంత ప్రాక్టికల్‌గా ఉంటుంది?. ఇదే విషయాన్ని చాలా సింపుల్‌గా, కుటుంబాలు చూసే కోణంలో తెలుసుకుందాం.
టెక్-లోడెడ్ ఇంటీరియర్ - ఫ్యామిలీలకు నచ్చే సెటప్
కొత్త Sierra లో 3-స్క్రీన్ లేఅవుట్ ప్రధాన ఆకర్షణ. డ్రైవర్‌కు డిజిటల్ క్లస్టర్, మధ్యలో రెండు పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌లు (మొత్తం 3 స్క్రీన్‌లు) ఇచ్చారు. కంటెంట్ షేర్ చేసే ఫీచర్ ఉండటం వల్ల ముందు వైపు ప్రయాణికులకు కూడా ఎక్కువ ఉపయోగకరం.
Curvvలో చూసిన నాలుగు-స్పోక్ స్టీరింగ్ వీల్ ఇక్కడ కూడా ఉంది. మధ్యలో వెలిగే Tata లోగో, టచ్ సెన్సిటివ్ కంట్రోల్స్ ఈ కారు లుక్ & ఫీల్‌ను మరింత ప్రీమియంగా మారుస్తాయి. క్యాబిన్‌కు బ్లాక్-గ్రే థీమ్, సీట్లకు డ్యూయల్ టోన్ గ్రే/బేజ్ ఫినిష్ ఇవ్వడం వల్ల ఇంటీరియర్ చాలా క్లీన్‌గా, మెచ్యూర్‌గా కనిపిస్తుంది.
రియర్ సీట్ - కుటుంబాలు ఎక్కువగా చూసేది ఇదే
సియెరా రివీల్ ఈవెంట్‌లో అందరూ గమనించింది ఒకే విషయం - కారు లోపలి స్పేస్. ముందు సీటు పొడవైన వ్యక్తి కోసం సెట్ చేశారు, అయినప్పటికీ రియర్ లెగ్‌రూమ్ కూడా బాగానే ఉంది.
సీటు బేస్ వెడల్పుగా ఉంంది
సెంటర్ టన్నెల్ చిన్నగా ఉండటం వల్ల మూడో వ్యక్తి కూడా కంఫర్ట్‌గా కూర్చోవచ్చు
బ్యాక్ రెస్ట్ రిక్లైన్ అవుతుంది
రియర్ ఆర్మ్‌రెస్ట్ + కప్ హోల్డర్లు
65W ఫాస్ట్ ఛార్జింగ్ USB
రియర్ విండోలకి రిట్రాక్టబుల్ సన్ బ్లైండ్స్
ఈ పాయింట్లన్నీ చూసినప్పుడు, ఇది క్లియర్‌గా కుటుంబాలకు అనుకూలంగా డిజైన్ చేసిన SUV అని తెలుస్తుంది.
కంఫర్ట్ ఫీచర్లు - ఫ్యామిలీ యూజ్‌లో పెద్ద ప్లస్
కొత్త సియెరాలో చాలా ప్రాక్టికల్ ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ వంటి వేడి ఎక్కువగా ఉండే వాతావరణంలో ఇవి ఉపయోగకరమైనవి.
పనోరామిక్ సన్‌రూఫ్ C-పిల్లర్ వరకు పొడవుగా ఉంటుంది, క్యాబిన్ మొత్తం ఎక్కువ వెలుగుతో, విశాలంగా కనిపిస్తుంది
JBL ఆడియో + సబ్‌వూఫర్ (ప్రీమియం వేరియంట్లలో)
పవర్డ్ & వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు
డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్
వైర్‌లెస్ ఛార్జింగ్
360° కెమెరా - పార్కింగ్ సమయంలో చాలా హెల్ప్ అవుతుంది
రియర్ సన్‌షేడ్స్
సాఫ్ట్ టచ్ ప్యానెల్స్ & పెద్ద స్టోరేజ్ స్పేస్
ఫ్యామిలీ యూజ్‌కి అత్యంత ముఖ్యమైనవైన సౌలభ్యం, ఎర్గోనామిక్స్, హెల్పింగ్ ఫీచర్లు - ఈ మూటిండిపైనా కొత్త Sierra లో స్పష్టంగా ఫోకస్ చేశారు.
సేఫ్టీ - ఫ్యామిలీలకు అన్నింటికంటే ఎక్కువ ఇంపార్టెంట్
కొత్త Sierra Level-2 ADAS సూట్‌తో వచ్చింది.
లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఫార్వర్డ్ కొల్లిజన్ వార్నింగ్ లాంటి ఫీచర్లు దీని లోభాగం.
ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 3-పాయింట్ సీట్ బెల్ట్స్, అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్స్ - ప్రతి సీటుకూ ఇచ్చారు, ఇది చాలా మంచి విషయం.
ఒక ఫ్యామిలీ కార్ అంటే ఎలా ఉండాలి?
- రియర్ స్పేస్ బాగుండాలి
- రైడ్ కంఫర్ట్ మంచిగా ఉండాలి
- ఫీచర్లు ఉపయోగకరంగా ఉండాలి
- సేఫ్టీ పక్కాగా ఉండాలి
Sierra ఈ నాలుగు బాక్సులన్నీ టిక్ చేస్తోంది. Curvvలో ఉన్న రూఫ్‌లైన్ సమస్య ఇక్కడ లేదు. రియర్ హెడ్‌రూమ్, బూట్ స్పేస్ మరింత ప్రాక్టికల్‌గా ఉండేలా డిజైన్ చేశారు. అఫీషియల్ లాంచ్ తర్వాత ధర, హైవే రైడ్ క్వాలిటీ, రియల్ ఫ్యూయల్ ఎఫిషెన్సీ తెలుస్తాయి. అప్పుడు ఇంకా క్లియర్ పిక్చర్ వస్తుంది. ప్రస్తుతం చూసినంత వరకు, కొత్త Sierra ఫ్యామిలీ యూజ్ కోసం చాల బలమైన ఆప్షన్‌గా కనిపిస్తోంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.