2025 Rajdoot 350 Mileage Price Features Details: మోటార్ సైకిల్ ప్రేమికులు పండగ చేసుకోవచ్చు. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న యమహా రాజ్‌దూత్ సరికొత్త స్టామినాతో, రాయల్ లుక్స్‌లో లాంచ్ కాబోతోంది. 1983లో భారత మార్కెట్లో మొదటిసారిగా టైర్ పెట్టింది ఈ 2-స్ట్రోక్ బైక్. కొన్నేళ్ల పాటు భారతీయ రోడ్లపై సింహంలా తిరిగింది. అయితే.. తీవ్రమైన పోటీ, అధిక ధరలు, కొత్త ఉద్గార నిబంధనల కారణంగా రాజ్‌దూత్ బైక్ ఉత్పత్తి 1989లో ఆగిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు, ఉద్గార నిబంధనలకు అనుగుణంగా 2025 Rajdoot 350 మోడల్ తిరిగి రాబోతోంది & సింహంలా గర్జించేందుకు సిద్ధమైంది. అంటే.. లయన్ రిటర్న్స్ అన్నమాట.
కొత్త రాజ్‌దూట్ 350 (New Rajdoot 350) 1980s & 90sలో లెజెండ్‌గా ఉన్న ఈ ఐకానిక్ బైక్... రెట్రో వైబ్స్‌ను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో మిళితం చేస్తూ, మోడర్న్ ట్విస్ట్‌తో తిరిగి వస్తోంది. రాజ్‌దూత్ 350 2025, తన పవర్ & స్టైల్‌తో రైడర్‌లను థ్రిల్ చేయగలదని సమాచారం. పునర్జన్మ ఎత్తిన ఈ క్లాసిక్ మోడల్ ధర, ప్రత్యేకతలు, డిజైన్ గురించి తెలుసుకోవడానికి చాలా సమాచారం ఉంది.
లాంచింగ్ ఎప్పుడు?నివేదికల ప్రకారం, ఈ వింటేజ్ మోడల్ మోటార్ సైకిల్ రూపం మార్చి, వచ్చే ఏడాది మార్చిలో కొత్త అవతార్‌లో విడుదల చేయనున్నారు. అయితే, ఈ వాహనం లాంచింగ్‌కు సంబంధించి కంపెనీ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే, కొత్త ఎడిషన్‌లో ఎలాంటి అప్‌డేట్స్ ఉండవచ్చన్న విషయాలు లీక్ అవుతూనే ఉన్నాయి.
కొత్త రాజ్‌దూత్ 350 బైక్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండవచ్చు?కొత్త రాజ్‌దూత్ 350 మోడల్‌ను అందుబాటు ధరలో ఉండేలా డిజైన్ చేశారు & అదే సమయంలో మునుపటి ఎడిషన్ కంటే ఎక్కువ ఫీచర్లను యాడ్ చేశారు. 2025 Rajdoot 350 ఎడిషన్‌లో ముందు & వెనుక చక్రాలకు డిస్క్ బ్రేక్‌లు ఉండవచ్చు, తద్వారా అప్‌డేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్‌ను అనుసంధానిస్తున్నారు. రైడర్ సేఫ్టీ కోసం డ్యూయల్-ఛానల్ ABS ఫీచర్ యాడ్ చేయవచ్చు. ఎత్తుపల్లాల్లో ఎలాంటి ఇబ్బంది లేని రైడింగ్ అనుభవం కోసం టెలిస్కోపిక్ & మోనోషాక్ సస్పెన్షన్ ఏర్పాటు చేయవచ్చని రిపోర్ట్స్‌ను బట్టి తెలుస్తోంది.
యూత్‌ను ఆకర్షించడానికి సొగసైన డిజైన్‌పై దృష్టి పెట్టారు. ఇంకా... డిజిటల్ స్పీడోమీటర్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డిజిటల్ ఓడోమీటర్ & డిజిటల్ ట్రిప్ మీటర్ వంటి అడ్వాన్స్‌డ్ అప్‌గ్రేడ్స్ కూడా ఉంటాయి. రాత్రివేళల్లోనూ రోడ్డును క్లియర్‌గా చూపించడానికి LED హెడ్‌లైట్లు, ప్రమాదాల నివారణకు LED ఇండికేటర్లు, రైడర్‌ను ఇబ్బంది పెట్టని ట్యూబ్‌లెస్ టైర్లు & మొబైల్ ఫోన్ ఛార్జింగ్ కోసం USB ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు యాడ్ చేయవచ్చు.
ఇంజిన్ పవర్ పాత ఎడిషన్‌లో 347cc 2-స్ట్రోక్ ఎయిర్-కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ ఉంది. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కలిగిన ఈ వాహనం కేవలం 4 సెకన్లలోనే గంటకు 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. ఇప్పుడున్న సమాచారం ప్రకారం, యమహా పాత ఎడిషన్‌లోని అదే ఇంజిన్‌ను ఉపయోగిస్తూనే దానిని BS6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా 4-స్ట్రోక్‌కు అప్‌గ్రేడ్ చేశారు. ఇది లీటరుకు 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుందని సమాచారం.
ధర అప్‌గ్రేడ్‌లు, డిజైన్‌లో మార్పులు & మెరుగైన ఇంజిన్ కారణంగా కొత్త రాజ్‌దూత్ 350 మోడల్ మోటార్‌సైకిల్ ధర రూ. 1.7 లక్షలు - రూ. 1.8 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.
పోటీరాజ్‌దూత్ 350 భారతీయ మార్కెట్లోకి విడుదలైతే రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, జావా 42, యెస్టీ రోడ్‌స్టర్ & హోండా CB350 వంటి వాటికి గట్టి పోటీ ఇవ్వగలదు. రాయల్ ఎన్‌ఫీల్డ్ మెటియోర్ 350, TVS రోనిన్ కూడా రాజ్‌దూత్ 350 సెగ్మెంట్‌లోనే ఉన్నాయి.