New Maruti Dzire: మారుతి సుజుకి భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటైన డిజైర్‌కు సంబంధించిన కొత్త తరం మోడల్‌ను తీసుకురానుంది. ఈ కారు నవంబర్ 11వ తేదీన భారతదేశంలో లాంచ్ కానుంది. మారుతి లాంచ్ చేయనున్న ఈ కొత్త కారు ఫోటో సోషల్ మీడియాలో లీక్ అయింది. ఈ కారు కొత్త లుక్, స్టైల్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ కొత్త తరం డిజైర్ మోడల్ పాత కారుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ కారు కొత్త డిజైన్‌తో భారతదేశంలోకి రాబోతోంది.
మారుతి డిజైర్ డిజైన్
మారుతి డిజైర్ లీక్ అయిన ఫోటోను చూస్తుంటే ఈ కారు మునుపటి కంటే ఎక్కువ ప్రీమియం కావచ్చని స్పష్టమవుతుంది. ఈ కారు స్లిమ్ హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంటుంది. వీటిని క్రోమ్ లైన్‌తో కనెక్ట్ చేయవచ్చు. ఈ మారుతి కారు మునుపటి మోడల్ కంటే పెద్ద గ్రిల్ కలిగి ఉంటుంది. మారుతి డిజైర్ పొడవు మునుపటిలాగా నాలుగు మీటర్ల పరిధిలో ఉంటుంది. కారు వెనుక భాగంలో పెద్ద క్రోమ్ లైన్‌ను కూడా ఇన్‌స్టాల్ చేయవచ్చు. ఇది టెయిల్ ల్యాంప్‌లతో అనుసంధానం అయి ఉంటుంది.
Also Read: ఆకాశాన్నంటే ధర - అయినా అవుట్ ఆఫ్ స్టాక్ - మార్కెట్లో ఈ కియా కారుకు సూపర్ డిమాండ్!
డిజైర్ ఇంటీరియర్
కొత్త మారుతి డిజైర్ లోపలి భాగం స్విఫ్ట్‌ని పోలి ఉంటుంది. కానీ ఆటోమేకర్ ఈ కొత్త కారును వేరే కలర్ స్కీమ్‌తో అందించవచ్చు. ఈ కారులో కనిపించే టచ్‌స్క్రీన్ స్విఫ్ట్ మాదిరిగానే ఉంటుంది. కానీ ఈ కారులో ఉన్న అతిపెద్ద ఫీచర్ సన్‌రూఫ్. ఇది ప్రస్తుత డిజైర్‌లో లేదు. ఇంకా ఇండియన్ మార్కెట్లో ఉన్న ఏ కాంపాక్ట్ సెడాన్‌లో కూడా సన్‌రూఫ్ ఫీచర్ అందుబాటులో లేదు. ఈ కారు అన్ని ఫీచర్ల గురించి ఖచ్చితమైన సమాచారం డిజైర్ లాంచ్ సమయంలో మాత్రమే అందుబాటులోకి రానుంది.
మారుతి డిజైర్ పవర్
మారుతి డిజైర్ ఈ కొత్త తరం మోడల్ పవర్‌ట్రెయిన్‌ను మార్చవచ్చు. కొత్త స్విఫ్ట్ మాదిరిగానే ఈ కారులో జెడ్ సిరీస్ 3 సిలిండర్ ఇంజన్ ఉండవచ్చు. ఈ ఇంజన్‌తో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికను కూడా అందించవచ్చని తెలుస్తోంది. దాని స్టాండర్డ్ మోడల్‌లో 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఉండే అవకాశం ఉంది. మారుతి తీసుకురానున్న ఈ కొత్త మోడల్ కంపెనీ అమ్మకాలను గణనీయంగా పెంచుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కారు పెర్ఫార్మెన్స్ ఎలా ఉండనుందో బుకింగ్స్ ఓపెన్ అవ్వడంతోనే తెలుస్తందని అనుకోవచ్చు.
Also Read: వెయిటింగ్ పీరియడ్ తక్కువగా ఉన్న బెస్ట్ కార్లు - అసలు లేకపోయినా ఆశ్చర్యం అక్కర్లేదు!