ప్రస్తుతం సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో పోటీ ఎక్కువగా ఉంది. కొత్త బ్రెజా, వెన్యూ కార్లు ఇటీవలే మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఇవి రెండూ కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ రెండిట్లో ఏది బెస్టో ఈ కథనంలో చూద్దాం...


కొత్త బ్రెజాలో 9 అంగుళాల ఇన్‌ఫోటెయిన్‌మెంట్ సిస్టంను అందించారు. వెన్యూలో 8 అంగుళాల టచ్ స్క్రీన్ అందించారు. కానీ కొత్త ఇన్‌ఫోటెయిన్‌మెంట్ సిస్టం ఇందులో ఉంది. వెన్యూలో కొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా కంపెనీ అందించింది.


బ్రెజాలో స్క్రీన్‌తో పాటు సెమీ డిజిటల్ డయల్స్ కూడా ఉన్నాయి. వీటిలో కారుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడవచ్చు. బ్రెజాలో హెడ్స్ అప్ డిస్‌ప్లే కూడా ఉంది. సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో ఈ ఫీచర్ ఉన్న మొదటి కారు ఇదే. డిస్‌ప్లేను కస్టమైజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. బ్రెజాలో 360 డిగ్రీ కెమెరా, మల్టీపుల్ వ్యూస్ ఉన్నాయి. వెన్యూలో ఇన్‌బిల్ట్ ఎయిర్ ప్యూరిఫయర్, పవర్డ్ డ్రైవర్ సీట్లు కూడా ఉన్నాయి.


ఈ రెండు ఎస్‌యూవీల్లోనూ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ ఉంది.వెన్యూలో 60కి పైగా ఫీచర్లు, బ్రెజాలో 40కి పైగా ఫీచర్లు ఉన్నాయి. అలెక్సా, స్మార్ట్ వాచ్ కనెక్టివిటీలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ రెండు ఎస్‌యూవీల్లో స్టీరింగ్ కంట్రోల్స్, సన్‌రూఫ్, వెనకవైపు ఏసీ వెంట్లు ఉన్నాయి. 


వెన్యూలో వెనకవైపు సీట్లకు 2 స్టెప్ రిక్లైన్ ఉంది. బ్రెజాలో ఈఎస్‌సీ, ఆరు ఎయిర్ బ్యాగ్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ రెండు కార్లలో ఏది బెస్ట్ అంటే చెప్పడం కొంచెం కష్టమే. కానీ వెన్యూ కంటే బ్రెజా కొంచెం ముందంజలో ఉంది.


Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!


Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!


Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?