2025 Hyundai Venue Launch Date Price Features: హ్యుందాయ్, త్వరలోనే, తన కొత్త Venue Facelift 2025 వెర్షన్‌ను మన మార్కెట్లోకి తీసుకురాబోతోంది. స్టైల్‌, టెక్నాలజీ & సేఫ్టీ పరిపూర్ణ కలయికను కోరుకునే వారి కోసం ఈ SUV వస్తోంది. రిపోర్ట్స్‌ ప్రకారం, కొత్త వెన్యూ మరో నెల రోజుల్లో, అంటే, 04 నవంబర్ 2025న లాంచ్‌ అవుతుంది. ఇటీవలి టెస్టింగ్‌ టైమ్‌లో చాలా కొత్త డిజైన్ ఎలిమెంట్స్‌ & ఫీచర్స్‌ లీక్‌ అయ్యాయి. దీనిని బట్టి, కొత్త కారు ప్రస్తుత మోడల్‌ కంటే  మరింత ప్రీమియంగా మారింది.

లుక్ ఎలా ఉంటుంది?కొత్త హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్ డిజైన్ ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా & మస్క్యులర్‌గా కనిపిస్తుంది. దీనికి స్ల్పిట్ హెడ్‌ల్యాంప్ సెటప్, నిలువుగా కనిపించే ప్రొజెక్టర్ యూనిట్లు & కొత్త C-ఆకారపు LED DRLs ఉన్నాయి, ఇవి దీనికి క్రెటా వంటి ప్రీమియం SUV లుక్స్‌ ఇస్తాయి. దీర్ఘచతురస్రాకార నమూనాలో కొత్త గ్రిల్‌ & క్రోమ్ యాక్సెంట్స్‌ యాడ్‌ చేశారు, ఇవి ఈ కారును చాలా సొగసుగా చూపిస్తాయి. రియర్‌ ప్రొఫైల్‌లో, ఈ SUVకి కొత్త LED టెయిల్‌ల్యాంప్‌లు, స్పాయిలర్‌లో హై-మౌంటెడ్ స్టాప్ లైట్ & కొత్త బంపర్‌లు లభిస్తాయి. 3995 mm & 195 mm గ్రౌండ్ క్లియరెన్స్‌తో, వెన్యూను నగరంలో & గుంతల రోడ్లలోనూ సౌకర్యవంతంగా డ్రైవ్‌ చేయవచ్చు.

హైటెక్ ఇంటీరియర్ మార్పులుహ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్ 2025 ఇంటీరియర్‌లో చాలా అప్‌డేట్స్‌ వస్తాయి. ఇది ఇప్పుడు కర్వ్‌డ్‌ డ్యూయల్-డిస్‌ప్లే సెటప్‌తో వస్తోంది. ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్ & పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. ఈ కొత్త లేఅవుట్ SUV క్యాబిన్‌కు ప్రీమియం & ఆధునిక టచ్‌ ఆపాదిస్తాయి. పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్ & కొత్త AC వెంట్స్ వంటి ఫీచర్లు కూడా కనిపిస్తాయి. అదనంగా, రివైజ్డ్‌ సెంటర్ కన్సోల్ & కొత్త ఇంటీరియర్ కలర్ ఆప్షన్లు ఈ కారుకు క్లాసీ అప్పీల్‌ ఇస్తాయి. హ్యుందాయ్, కొత్త వెన్యూను సాంకేతికత & సౌకర్యం పరంగా పూర్తిగా అప్‌గ్రేడ్ చేసింది.

మొదటిసారి అందుబాటులో లెవల్ 2 ADASహ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్ 2025, అత్యంత సురక్షితమైన కారు అవుతుంది. మొదటిసారిగా, కంపెనీ లెవల్ 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) సూట్‌ను అందిస్తోంది. ఇందులో లేన్ కీపింగ్ అసిస్ట్, ఫ్రంట్ కొలిషన్ వార్నింగ్, డ్రైవర్ అటెన్షన్ మానిటరింగ్ సిస్టమ్ & ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఆరు ఎయిర్‌బ్యాగులు, ABS, EBD & రియర్ పార్కింగ్ సెన్సార్‌లను స్టాండర్డ్‌ సేఫ్టీ ఫీచర్లుగా వస్తాయి. ఈసారి హ్యుందాయ్ దృష్టి డ్రైవింగ్ భద్రత & అధునాతన సాంకేతికత రెండింటిపై ఉంది.

ఇంజిన్ & పనితీరుకొత్త హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్ 2025 కూడా, ప్రస్తుత మోడల్‌లోని అదే మూడు ఇంజిన్‌లతో (1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ & 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్) శక్తినిస్తుంది. ఈ ఇంజిన్‌ల పనితీరు & సున్నితత్వాన్ని మెరుగుపరచడానికి కంపెనీ వాటికి స్వల్ప మార్పులు చేసింది. దీని అర్థం SUV ఇప్పుడు మరింత రిఫైన్డ్‌ & ఫన్‌ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ అందిస్తుంది. మల్టీ ట్రాన్స్‌మిషన్ ఎంపికలను కూడా ఈ కారు అందిస్తుంది.

ధరనివేదికల ప్రకారం, కొత్త హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్ ధర ₹8 లక్షల నుంచి ₹15 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చు. బేస్ వేరియంట్ ఆన్‌-రోడ్‌ ధర ₹10 లక్షల లోపు ఉంటుందని అంచనా. ఇది టాటా నెక్సాన్, మారుతి సుజుకి ఫ్రాంక్స్ & కియా సోనెట్ వంటి SUV లకు బలమైన పోటీదారుగా నిలుస్తుంది.