Brahmamudi Serial Today Episode: అప్పు ఒంటరిగా బాధపడుతుంటే రుద్రాణి చూస్తుంది. వెంటనే వెళ్లి ధాన్యలక్ష్మీని తీసుకొచ్చి అప్పును చూపిస్తుంది.
రుద్రాణి: కావ్య, రాజ్ ల గొడవల కారణంగా నీ కోడలు బాధపడుతుంది. నువ్వు ఇలాగే చూస్తూ ఉంటే రాజ్ అన్నట్టు అబార్షన్ కావ్యకు కాదు నీ కోడలికి అవుతుంది.. చూస్కో మరి జాగ్రత్తగా ఉండాలి కదా
అని రెచ్చగొట్టి వెల్లిపోతుంది రుద్రాణి. వెంటనే ధాన్యలక్ష్మీ, కళ్యాణ్ దగ్గరకు వెళ్తుంది.
ధాన్యం: ఒరేయ్ కళ్యాణ్ నువ్వు అప్పు కాసేపు సరదాగా ఎక్కడికైనా వెళ్లొచ్చు కదా
కళ్యాణ్: ఇప్పుడా తర్వాత వెళ్తాం లే అమ్మ
ధాన్యం: ఇప్పుడే వెళ్లండి.. నేను వద్దని చెప్పినప్పుడు వెళ్లే వాళ్లు కదా..? ఇప్పుడు నేను చెప్తుంటే వెళ్లడం లేదేంటి..?
కళ్యాణ్: సరే లే అమ్మా వెళ్తాము
ధాన్యం: ఇంకో విషయం తనను ఎప్పుడూ అలా డల్లుగా ఉండొద్దని చెప్పు.. పుట్టే పిల్లలు కూడా అలాగే డల్లుగా ఉంటారు.
కళ్యాణ్: సరే అమ్మా
అని కళ్యాణ్, అప్పు దగ్గరకు వెళ్లి..
కల్యాణ్: పొట్టి మనం కాస్త అలా బయటకు వెళ్దామా..?
అప్పు: నాకు ఇప్పుడు మూడ్ లేదు కూచి
కల్యాణ్: మన కోసం కాదు పొట్టి అమ్మ కోసం అమ్మ నిన్ను గమనిస్తుంది. అందుకే రిలాక్సేషన్ కోసం బయటకు తీసుకెళ్లమని మరీ మరీ చెప్పింది. వెళ్లకపోతే హర్ట్ అవుతుంది. పొట్టి ఫ్లీజ్ వెళ్దాం పద
అప్పు: సరే వెళ్దాం పద
అంటూ కళ్యాణ్‌తో వెళ్తుంది. రాజ్ బయట గేటు దగ్గర నిలబడి ఆలోచిస్తుంటే కావ్య వెళ్లి నాటకం ఆడుతుంది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరగుతుంది. ఇంతలో బయటకు వెళ్లడానికి వచ్చిన అప్పు వాళ్ల గొడవ చూసి భాదగా లోపలికి వెల్లిపోతుంది. లోపలికి వస్తున్న అప్పును చూసిన ధాన్యం దగ్గరకు వెళ్తుంది.
ధాన్యం: అప్పు ఇందాకే కదా బయటకు వెళ్తున్నానని చెప్పావు.. మరి ఇంతలోనే వచ్చేశావు.. వెల్లడం లేదా..?
అప్పు: వెళ్దామనే అనుకున్నాను అత్తయ్యా కానీ వెళ్లలేకపోయాను నన్ను క్షమించండి అత్తయ్యా
అని లోపలికి వెళ్తుంది.
ధాన్యం: అసలు ఏమైంది దీనికి
రుద్రాణి: అప్పు బయటకు వెళ్లకపోవడానికి కారణం ఆ కావ్యే..
దాన్యం: ఏం మాట్లాడుతున్నావు రుద్రాణి
రద్రాణి: అవును ధాన్యలక్ష్మీ నీ కోడలు ఆనందాలను సంతోషాలను దూరం చేస్తుంది ఆ కావ్యే.. పాపం అప్పు హ్యాపీగా ఉండాలనే ప్రయత్నిస్తుంది. కానీ ఏం లాభం.. ప్రతిక్షణం ఇంట్లో గొడవలు జరుగుతుంటే ఎవరైనా ఎలా హ్యాపీగా ఉండగలరు చెప్పు. ఇందాక నీ మాట మీద గౌరవంతో తన బిడ్డ మీద ప్రేమతో హాయిగా కాసేపు బయటకు వెళ్లడానికి బయలుదేరారు. బయట ఫోన్‌లో విడాకుల గురించి మాట్లాడుతూ కావ్య కనిపించింది. అందుకే మళ్లీ ఇంట్లోకి వచ్చేసింది. పాపం కావ్య కారణంగా నీ కోడలు అప్పు చాలా నలిగిపోతుంది ధాన్యలక్ష్మీ. ఇప్పటికైనా కళ్లు తెరువు దాన్యలక్ష్మీ ఏదో ఒక ప్రాబ్లం రాకముందే అలర్ట్ అవ్వు. లేకపోతే ఆ తర్వాత నువ్వే బాధపడాల్సి వస్తుంది.
అంటూ రుద్రాణి తన మాటలతో ధాన్యలక్ష్మీని రెచ్చగొట్టి వెల్లిపోతుంది. తర్వాత రాజ్, కావ్యను హాస్పిటల్‌కు వెళ్దామని అడిగితే నిజం చెప్పే వరకు రానంటుంది. కావాలంటే విడాకులు తీసుకుంటానని బెదిరిస్తుంది. దీంతో రాజ్ నేను కూడా విడాకులు ఇస్తానని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. అప్పు కళ్లు తిరిగి పడిపోతుంది. దీంతో ధాన్యలక్ష్మీ కావ్యను తిడుతుంది. ఇంతలో డాక్టర్ వచ్చి అప్పును చెక్ చేసి జాగ్రత్తలు చెప్పి వెళ్లిపోతుంది. తర్వాత రాజ్, కళ్యాణ్‌కు సారీ చెప్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!