New Hyundai Venue Diesel Mileage, Price Comparison: దేశంలో కాంపాక్ట్‌ SUV మార్కెట్‌ వేగంగా పెరుగుతోంది. ప్రతి కంపెనీ తనదైన స్టైల్‌లో కొత్త SUVలు తెస్తుండగా, Hyundai Venue కూడా... రెండో తరం డీజెల్‌ వెర్షన్‌తో మళ్లీ రంగంలోకి దిగింది. సెకండ్‌-జెన్‌ వెన్యూను నవంబర్‌ 4, 2025న లాంచ్‌ చేసింది. అయితే... Kia Sonet, Tata Nexon, Mahindra XUV 3XO, Maruti Suzuki Brezza, Skoda Kylaq లాంటి పాతుకుపోయిన ప్రత్యర్థుల మధ్య Venue ఎంత బలంగా నిలుస్తుందో తెలుసుకుందాం.

Continues below advertisement

కొత్త వెన్యూ ఇంజిన్‌ పవర్‌, పనితీరుకొత్త Venue డీజిల్‌ వెర్షన్‌లో 1.5 లీటర్‌ టర్బో డీజిల్‌ ఇంజిన్‌ అందించారు. ఇది 114 bhp శక్తి, 250 Nm టార్క్‌ ఇస్తుంది. ఇదే ఇంజిన్‌ Kia Sonet, Syros లో కూడా వాడుతున్నారు. అంటే పవర్‌ అవుట్‌పుట్‌ పరంగా ఇవన్నీ దగ్గరగా ఉంటాయి. కానీ Tata Nexon డీజిల్‌ 260 Nm టార్క్‌తో మరికాస్త బలంగా నిలుస్తుంది. అంతేకాదు.. Mahindra XUV 3XO డీజిల్‌ 300 Nm టార్క్‌ ఇస్తూ మరింత శక్తిమంతమైన SUVగా నిలుస్తోంది. Venueలో కొత్తగా వచ్చిన 6-స్పీడ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ మాత్రం మంచి ఫీచర్‌. Venue లో దీనిని మొదటిసారి ప్రవేశపెట్టారు.

Continues below advertisement

మైలేజ్‌ పోలికమైలేజ్‌ వైపు చూసుకుంటే, Venue డీజిల్‌ ARAI ప్రకారం 24.2 kmpl (మాన్యువల్‌) & 19.1 kmpl (ఆటోమేటిక్‌) ఇస్తుంది. Kia Sonet కంటే కాస్తా ఎక్కువ మైలేజ్‌ ఇస్తుంది, కానీ Nexon డీజిల్‌ మాత్రం అన్ని కాంపాక్ట్‌ SUVల్లో టాప్‌ మైలేజ్‌ SUVగా నిలుస్తోంది. Mahindra XUV 3XO (AMT) వేరియంట్‌ కూడా సగటున బాగానే ఇస్తోంది. మొత్తంగా చూస్తే Venue మైలేజ్‌ బాగుంది కానీ Tata Nexon ‌ను మించలేకపోయింది.

కొత్త హ్యుందాయ్ వెన్యూ డీజిల్ మైలేజ్ vs ప్రత్యర్థులు

 
హ్యుందాయ్ వెన్యూ కియా సోనెట్ కియా సైరోస్‌ మహీంద్రా XUV 3XO టాటా నెక్సాన్
6-గేర్‌ MT 20.99 kmpl - 20.75 kmpl 20.6 kmpl 23.23 kmpl
6-గేర్‌ AMT N/A N/A N/A 21.2kpl 24.08kpl
6-గేర్‌ AT
 
17.9 kmpl 18.6 kmpl 17.65 kmpl N/A N/A

ధరల పోలికకొత్త Hyundai Venue డీజిల్‌ ధరలు ₹9.70 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) నుంచి మొదలై ₹12.51 లక్షల వరకు ఉన్నాయి. Kia Sonet తో పోలిస్తే సుమారు ₹1.50 లక్షల వరకు ఎక్కువ. Syros తో పోలిస్తే దాదాపు ₹3.6 లక్షల వ్యత్యాసం ఉంది. కానీ ఫీచర్ల పరంగా Venue అప్‌గ్రేడ్‌ ఫీల్‌ ఇస్తుంది. Tata Nexon డీజిల్‌ MT వెర్షన్‌ కంటే Venue కాస్త తక్కువ ధరలో ఉంది, అయితే ఆటోమేటిక్‌ వేరియంట్లలో Venue ధర కాస్త ఎక్కువే.

కొత్త హ్యుందాయ్ వెన్యూ డీజిల్ ధరలు vs ప్రత్యర్థులు

 
హ్యుందాయ్ వెన్యూ కియా సోనెట్ కియా సైరోస్‌ మహీంద్రా XUV 3XO టాటా నెక్సాన్
MT ధరలు రూ. 9.70-12.51 లక్షలు రూ. 8.98-11.25 లక్షలు రూ. 10.14-12.80 లక్షలు రూ. 8.95-13.43 లక్షలు రూ. 10.00-14.90 లక్షలు
AMT ధరలు N/A N/A N/A రూ. 10.71-13.17 లక్షలు రూ. 11.70-15.60 లక్షలు
AT ధరలు రూ. 11.58-15.51 లక్షలు రూ. 12.03-14.00 లక్షలు రూ. 15.22-15.94 లక్షలు N/A N/A

ఫీచర్లలో కొత్తదనంరెండో తరం Venue కొత్త Global K1 ప్లాట్‌ఫామ్‌ మీద తయారైంది. మరింత సేఫ్‌గా, రోడ్‌ గ్రిప్‌ బలంగా ఉండేలా దీనిని రూపొందించారు. కొత్త ఇన్ఫోటైన్‌మెంట్‌, డిజిటల్‌ క్లస్టర్‌, బ్లూలింక్‌, వెంట్‌లేటెడ్‌ సీట్లు వంటి ఫీచర్లు కూడా యూత్‌ని ఆకట్టుకునేలా ఉన్నాయి.

మొత్తం మీద Hyundai Venue డీజిల్‌ స్టైలిష్‌గా, ఫీచర్లతో నిండిన SUV. పనితీరు, సేఫ్టీ పరంగా బాగుంది. అయితే మీరు మైలేజ్‌కి ప్రాధాన్యం ఇస్తే Nexon మంచి ఆప్షన్‌. ఆటోమేటిక్‌ సౌకర్యం కావాలంటే Venue లేదా Sonet తీసుకోవచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.