Hyundai Venue 2025 India: భారత మార్కెట్‌లో Hyundai Venue కి ఉన్న క్రేజ్‌ ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పుడు ఆ SUV మరోసారి కొత్త అవతారంలో, 2025 Hyundai Venue రూపంలో వస్తోంది. హ్యుందాయ్‌ ఈసారి కేవలం ఫీచర్లలోనే కాదు, కలర్‌ ఆప్షన్‌లతో కూడా పెద్ద మార్పు తీసుకొచ్చింది.

Continues below advertisement

హ్యుందాయ్‌ వెన్యూ వేరియంట్‌ల వారీగా రంగుల వివరాలు

కొత్త వెన్యూ 8 వేరియంట్‌లలో లభిస్తుంది, అవి - HX 2, HX 4, HX 5, HX 6, HX 6T, HX 7, HX 8, HX 10.

Continues below advertisement

వీటిలో 6 మోనోటోన్‌ షేడ్స్‌:

Hazel Blue (కొత్తది), Mystic Sapphire (కొత్తది), Dragon Red, Abyss Black, Atlas White, Titan Grey.

మరో 2 డ్యుయల్‌-టోన్‌ ఆప్షన్‌లు:

Hazel Blue + Abyss Black Roof & Atlas White + Abyss Black Roof‌.

HX 6 వేరియంట్‌ నుంచి డ్యూయల్‌-టోన్‌ ఆప్షన్‌ అందుబాటులో ఉంటుంది.

లోయర్‌-స్పెక్‌ HX 2, HX 4లో మాత్రం కొన్ని రంగులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. పూర్తి కలర్‌ ఆప్షన్‌లు కావాలంటే HX 5 లేదా అంతకంటే పై వేరియంట్‌ తీసుకోవాలి.

మరింత హైటెక్‌ రేంజ్‌ ఫీచర్లు

2025 వెన్యూ ఇంటీరియర్‌లో డబుల్‌ ట్రీట్‌ ఉంది. డ్యూయల్‌ 12.3-ఇంచ్‌ డిజిటల్‌ డిస్‌ప్లేలు ఇస్తున్నారు. వీటిలో ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్‌ కోసం, మరొకటి ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ కోసం.

దీంతో పాటు:

వెంటిలేటెడ్‌ ఫ్రంట్‌ సీట్లు

360-డిగ్రీ కెమెరా

లెవల్‌-2 ADAS సిస్టమ్‌

సింగిల్‌-పేన్‌ సన్‌రూఫ్‌

వైట్‌ అంబియెంట్‌ లైట్‌

ఆటో క్లైమేట్‌ కంట్రోల్‌

4-వే పవర్‌ డ్రైవర్‌ సీట్‌

వైర్‌లెస్‌ చార్జర్‌

8-స్పీకర్‌ బోస్‌ సౌండ్‌ సిస్టమ్‌

సేఫ్టీ సైడ్‌లో.... 6 ఎయిర్‌బ్యాగ్స్‌, ISOFIX మౌంట్స్‌, పార్కింగ్‌ సెన్సర్లు, లెవల్‌-2 ADAS అన్నీ అందుబాటులో ఉంటాయి.

ఇంజిన్‌ ఎంపికలు

కొత్త వెన్యూ పెట్రోల్‌ & డీజిల్‌ ఇంజిన్‌లతో వస్తోంది.

1.2-లీటర్‌ నేచురల్‌ ఆస్పిరేటెడ్‌ పెట్రోల్‌

1.0-లీటర్‌ టర్బో పెట్రోల్‌

1.5-లీటర్‌ డీజిల్‌

ఇందులో ముఖ్యంగా Kia Sonet‌లోని డీజిల్-AT కాంబినేషన్‌ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది.

ధరలు & లాంచ్‌ వివరాలు

హ్యుందాయ్‌ డీలర్‌షిప్‌లలో ఈ కారు బుకింగ్స్‌ ఇప్పటికే ₹25,000 అడ్వాన్స్‌తో ప్రారంభమయ్యాయి.

లాంచ్‌ తేదీ: నవంబర్‌ 4, 2025.

ప్రారంభ ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ. 8 లక్షల నుంచి ఉండొచ్చని అంచనా. లాంచ్‌ తేదీన వాస్తవ ధర తెలుస్తుంది.

కొత్త వెన్యూకు పోటీ SUVలు

కొత్త వెన్యూ ఇప్పుడు Mahindra XUV 3XO, Tata Nexon, Kia Sonet, Maruti Brezza, Renault Kiger, Skoda Kylaq, Nissan Magnite, Toyota Taisor, Maruti Fronx మోడళ్లతో గట్టి పోటీని ఎదుర్కోనుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.