Honda Amaze New Generation Model: హోండా కొత్త కాంపాక్ట్ సెడాన్ అమేజ్ కొత్త తరం మోడల్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త హోండా అమేజ్ వచ్చే నెల ప్రారంభంలో డిసెంబర్ 4వ తేదీన విడుదల కానుంది. హోండా కంపెనీ కొత్త కారు లోపలి భాగాన్ని కూడా టీజర్‌లో చూపించారు. కొత్త అమేజ్‌లో అనేక కొత్త ఫీచర్‌లను హోండా చేర్చే అవకాశం ఉంది.


హోండా అమేజ్ కొత్త తరం మోడల్‌లో ఏం ఉంది?
హోండా అమేజ్ మూడవ తరం మోడల్ ఇండియన్ మార్కెట్లో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. కొత్త హోండా అమేజ్ ఫొటోలను కొత్త టీజర్‌లో షేర్ చేశారు. ఈ చిత్రాల్లో హోండా కొత్త అమేజ్ లుక్ చూడటానికి హోండా సిటీ లాగా ఉంది. ఈ కారు ఫ్రంట్ ఎండ్ బోర్డ్ లాగా ఉంటుంది. దానిపై హెడ్‌లైట్‌లతో కలుపుతూ ఒక పెద్ద క్రోమ్ స్ట్రిప్ ఉంటుంది. దీని బంపర్ డిజైన్‌లో కూడా డిఫరెంట్ కట్స్ చేశారు. దీని ముందు డిజైన్ గురించి మాత్రమే మాట్లాడినట్లయితే ఈ కారు హోండా ఎలివేట్ లాగా కనిపిస్తుంది.


ఈ కొత్త కారు వెనుక డిజైన్ హోండా సిటీని పోలి ఉంటుంది. ఈ కారులో బంపర్ డిజైన్‌తో పాటు వెడల్పాటి టెయిల్ ల్యాంప్‌లను అమర్చారు. హోండా తీసుకురానున్న ఈ కొత్త మోడల్ థాయ్‌లాండ్‌లోని హోండా ఆర్ అండ్ డీ ఆసియా పసిఫిక్ సెంటర్‌లో తయారు అయింది.



Also Read: మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?


కొత్త హోండా అమేజ్ ఇంటీరియర్ ఎలా ఉంది?
హోండా సిటీ మాదిరిగానే అమేజ్ కూడా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందవచ్చు. ఈ కారు కొత్త డ్యాష్‌బోర్డ్ ప్యాటర్న్‌తో రావచ్చు. హోండా అమేజ్ ఇంటీరియర్ ఫొటోలను చూస్తుంటే కారులో టచ్‌స్క్రీన్‌ను రీపొజిషన్ చేసినట్లు తెలిసింది. దీంతో పాటు ఈ కారు విభిన్న డిజైన్ ఉన్న స్టీరింగ్ వీల్‌తో రావచ్చు. ఈ కారులో స్టోరేజ్ స్పేస్ కూడా మెరుగ్గా వస్తుందని చెప్పవచ్చు.


హోండా అమేజ్ పవర్ ఎలా ఉంది?
కొత్త హోండా అమేజ్‌లో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను అమర్చవచ్చు. ఈ ఇంజన్‌తో సీవీటీ ట్రాన్స్‌మిషన్ అందుబాటులో ఉంటుంది. ప్రామాణిక మోడల్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో రావచ్చు. కొత్త ఇంజన్‌తో ఈ కారు మునుపటి కంటే మెరుగైన మైలేజీని ఇవ్వగలదు. కొత్త హోండా అమేజ్ భారత మార్కెట్లో విడుదల చేయనున్న కొత్త మారుతి డిజైర్‌కు గట్టి పోటీని ఇవ్వగలదు.


2024 అక్టోబర్‌లో హోండా కార్ల కంపెనీ మంచి సేల్స్‌ను నమోదు చేసింది. ఏకంగా 5,546 యూనిట్ల కార్లను హోండా విక్రయించింది. ఇందులో హోండా సిటీ, హోండా అమేజ్, హోండా ఎలివేట్ వంటి కార్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు కొత్త హోండా అమేజ్ వస్తే కంపెనీ సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే హోండా అమేజ్ ఇప్పటికే సక్సెస్ ఫుల్ మోడల్ కాబట్టి దీని అప్‌డేటెడ్ వెర్షన్ కోసం కొత్త కారు కొనాలనుకునే వారు వెయిట్ చేస్తున్నారు.



Also Read: రూ.లక్ష లోపు ధరలో బెస్ట్ మైలేజీ ఇచ్చే బైక్స్ ఇవే - ఆల్ టైమ్ బెస్ట్ బైక్స్ ఇవే!