New Honda Amaze 3rd Generation: హోండా భారతదేశంలో తను త్వరలో లాంచ్ చేయనున్న అమేజ్ కాంపాక్ట్ సెడాన్ వివరాలను రెండు స్కెచ్‌లతో వెల్లడించింది. అలాగే దీని ఇంటీరియర్‌ను కూడా రివీల్ చేసింది. కొత్త తరం హోండా అమేజ్ డిజైన్ ఈ సారి హోండా సిటీకి దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఫ్రంట్ ఎండ్‌లో పెద్ద క్రోమ్ స్ట్రిప్‌తో కూడిన బోర్డ్ ఫేస్‌ను ఉంది. ఇది హెడ్‌ల్యాంప్‌లను బంపర్ డిజైన్‌లో ఉన్న విభిన్న కట్‌లతో కలుపుతుంది. ఫ్రంట్ ఎండ్ పరంగా కూడా ఈ కారు హోండా ఎలివేట్‌కు కాస్త వరకు సమానంగా ఉంటుంది.


బ్యాక్ స్టైలింగ్ అదుర్స్...
వెనుక స్టైలింగ్ అయితే బంపర్ డిజైన్‌తో పాటు వెడల్పాటి టెయిల్ ల్యాంప్‌ల పరంగా హోండా సిటీని పోలి ఉంటుంది. ఇండియాలో ఒక సర్వే చేసి ఇన్‌పుట్‌లను తీసుకుని అందరికీ నచ్చే విధంగా కొత్త 3వ తరం అమేజ్‌ను థాయ్‌లాండ్‌లోని హోండా ఆర్ అండ్ డీ ఆసియా పసిఫిక్ సెంటర్‌లో రూపొందించినట్లు హోండా తెలిపింది.



Also Read: రూ.లక్ష లోపు ధరలో బెస్ట్ మైలేజీ ఇచ్చే బైక్స్ ఇవే - ఆల్ టైమ్ బెస్ట్ బైక్స్ ఇవే!


ఇంటీరియర్ కూడా సూపర్
హోండా సిటీలో కనిపించే విధంగా ఇంటీరియర్ అదే పార్ట్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో మరిన్నింటిని వెల్లడిస్తుంది. ఇప్పుడు కొత్త ప్యాటర్న్ డ్యాష్‌బోర్డ్ కూడా అందుబాటులో ఉంది. టచ్‌స్క్రీన్ స్థానం మార్చారు. విభిన్నమైన స్టీరింగ్ వీల్ డిజైన్‌తో మొత్తం రూపాన్ని కూడా మార్చింది. ఫొటోల్లో కనిపించే విధంగా పెద్ద స్టోరేజ్ కూడా ఉన్నాయి.


ఇంజిన్ ఎలా ఉంది?
కొత్త అమేజ్‌లో సీవీటీతో కూడిన 1.2 లీటర్ పెట్రోల్, స్టాండర్డ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఉంటుందని భావిస్తున్నారు. అయితే కొత్త తరం అమేజ్‌తో మరింత ఇంటీరియర్ స్పేస్‌తో పాటు ఎక్కువ మైలేజీని కూడా మనం ఆశించవచ్చు. దీంతో హోండా సిటీ, హోండా అమేజ్ రెండూ దాదాపు ఒకేలా ఉన్నాయని అనుకోవచ్చు. కొత్త అమేజ్ భారతదేశంలోని మారుతి డిజైర్ వంటి కార్లతో పోటీపడుతుంది.



Also Read: మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?