New Car Launches October 2025: GST తగ్గింపులు & పండుగ సీజన్ డిమాండ్ కారణంగా కార్ల అమ్మకాలు హై-స్పీడ్‌తో పెరిగాయి. ఈ అవకాశాన్ని అందుకోవడానికి ఆటోమొబైల్‌ కంపెనీలు కస్టమర్ల కోసం కొత్త & అప్‌డేటెడ్‌ మోడళ్లను పరిచయం చేస్తున్నాయి. ఈ నెలలో (అక్టోబర్ 2025) కొన్ని పవర్‌ఫుల్‌ మోడళ్లు తెలుగు రాష్ట్రాల్లో రోడ్లపైకి వస్తాయి. వాటిలో Mahindra, Nissan, Skoda, Citroen & Mini  వంటి ప్రముఖ కంపెనీల వాహనాలు ఉన్నాయి.

అక్టోబర్ 2025 న్యూ లాంచ్‌లు:

Mahindra Bolero & Bolero Neo (2025 Update)మహీంద్రా బొలెరో, తెలుగు ప్రజలకు చాలా ఇష్టమైన కార్లలో ఒకటి & ఇప్పుడు దీని అప్‌డేటెడ్‌ వెర్షన్ రానుంది. కొత్త ఫ్రంట్ గ్రిల్, కొత్త ఎయిర్ డ్యామ్ & ఆకర్షణీయమైన అల్లాయ్ వీల్స్‌ను కొత్త మోడల్‌లో చూసే అవకాశం ఉంది. ఇంటీరియర్ కూడా అప్‌గ్రేడ్ చేశారు, నలుపు & గోధుమ రంగు థీమ్, ఫాబ్రిక్ సీటింగ్‌ & 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ యూనిట్ ఉన్నాయి. బొలెరో & బొలెరో నియో రెండూ బెటర్ ఫీచర్లతో వస్తాయి. కంపెనీ వీటి ఇంకా ధరను ప్రకటించలేదు, అతి త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

మహీంద్రా థార్ (3-డోర్ల వెర్షన్ 2025)బొలెరో తర్వాత, మహీంద్రా థార్ కొత్త 3-డోర్ల వెర్షన్ కూడా లాంచ్‌ అవుతుంది. ఈ SUV డ్యూయల్-టోన్ బంపర్లు, కొత్త గ్రిల్ & రివర్స్ కెమెరాను కలిగి ఉంటుంది. ఇంకా, కస్టమర్ సౌలభ్యం కోసం ఫ్రంట్ ఆర్మ్‌ రెస్ట్ & కప్ హోల్డర్‌లు యాడ్ అవుతాయి. ఈ నెల ప్రారంభంలో ధరలను ప్రకటిస్తారని భావిస్తున్నారు. ఈ కారును ప్రత్యేకంగా ఆఫ్-రోడ్ అడ్వెంచరిస్ట్‌ల కోసం రూపొందించారు.

Nissan C-SUV (కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ)నిస్సాన్ తన కొత్త C-SUVని అక్టోబర్ 7, 2025న ఇండియాలో లాంచ్‌ చేయనుంది. ఈ మోడల్‌ న్యూ-జెన్‌ రెనాల్ట్ డస్టర్ స్ఫూర్తితో రూపొందింది. Maruti Suzuki Grand Vitara, Kia Seltos, Hyundai Creta & Honda Elevate వంటి కార్లతో నేరుగా పోటీ పడనుంది. మెరుగైన ఇంజిన్ & ప్రీమియం ఫీచర్లతో ఈ కారు లాంచ్‌ అవుతుందని భావిస్తున్నారు.

Skoda Octavia RS (Limited Edition 2025)స్కోడా, తన పాపులర్‌ ఆక్టేవియా RS ను మళ్లీ భారతీయ మార్కెట్‌లోకి తీసుకువస్తోంది. ఈ పరిమిత ఎడిషన్ అక్టోబర్ 17, 2025న లాంచ్‌ అవుతుంది & 100 యూనిట్లు మాత్రమే అమ్మకానికి ఉంటాయి. ఇది 261 bhp & 370 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో శక్తినిస్తుంది. 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అనుసంధానమైన ఈ కారు పెర్ఫార్మెన్స్‌, యంగ్‌స్టర్స్‌కు థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది.

Citroen Aircross Xసిట్రోయెన్ కూడా, తన పాపులర్‌ SUV Aircross లో X వెర్షన్‌ను పరిచయం చేయనుంది. ఈ కొత్త మోడల్‌లో గ్రీన్ పెయింట్ ఆప్షన్, ఆల్-LED లైటింగ్ & వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి ఫీచర్లు ఉంటాయి. AI వాయిస్ అసిస్టెంట్ & 360 డిగ్రీల కెమెరా కూడా ఉంటాయి. స్పెసిఫికేషన్లు ప్రస్తుత మోడల్‌ తరహాలోనే ఉన్నప్పటికీ, ఫీచర్లు & డిజైన్ మరింత ఆధునికంగా ఉండవచ్చు.

Mini Countryman JCW All4మినీ ఇండియా, Countryman JCW All4 ను ఇండియాలోకి తీసుకువస్తోంది. ప్రి-బుకింగ్స్‌ ఇప్పటికే ప్రారంభమయ్యాయి & ధరలు అక్టోబర్ 14, 2025న ప్రకటిస్తారు. ఈ SUV 300 bhp & 400 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో పని చేస్తుంది. ఈ కారు కేవలం 5.4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని అందుకోగలదు.