New Bajaj Pulsar 150 Price And Features Telugu: థ్రిల్లింగ్‌ బైక్‌ కోసం ఎదురుచూస్తున్నవాళ్లకు గుడ్‌న్యూస్‌. కొత్త పల్సర్‌ 150 త్వరలో మార్కెట్లోకి రాబోతోంది. అయితే.. లాంచ్‌కు ముందే ఈ యూత్‌ఫుల్‌ బైక్‌ ఫోటోలు లీక్‌ అయ్యాయి. ఒక డీలర్‌షిప్‌ వద్ద కనిపించిన బైక్‌, దాదాపు డెలివెరీకి సిద్ధమైన రూపంలో ఉంది. దీంతో కొత్త పల్సర్‌ 150లో వచ్చిన మార్పులన్నీ ఇప్పుడు బయటకు వచ్చాయి.

Continues below advertisement

బజాజ్‌, ప్రస్తుతం వరుసగా కొత్త బైక్‌లను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. కొత్త పల్సర్‌ 125 ఇప్పటికే డీలర్‌షిప్‌ వద్ద కనిపించింది. అప్‌డేటెడ్‌ పల్సర్‌ N160 ని ఆగస్టు 12న విడుదల చేయనున్నారు. ఇదే సమయంలో కొత్త పల్సర్‌ 150 కూడా మార్కెట్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

కీలక మార్పులుకొత్త పల్సర్‌ 150లో బజాజ్‌ భారీ మార్పులు చేసింది. ముఖ్యంగా ఇంజిన్‌ & ఛాసిస్‌లో కీలకమైన అప్‌డేట్లు వచ్చాయి. కొత్త బైక్‌ను పూర్తిగా కొత్త ప్లాట్‌ఫామ్‌పై రూపొందించారు. సింగిల్‌ డౌన్‌ట్యూబ్‌ ఫ్రేమ్‌ను ఉపయోగించారు. ఇదే తరహా ఫ్రేమ్‌ కొత్త పల్సర్‌ 125లోనూ కనిపించింది.

Continues below advertisement

ఇప్పటివరకు పల్సర్‌ క్లాసిక్‌ మోడళ్లలో కొనసాగిన పాత నిర్మాణాన్ని కొత్త ఫ్రేమ్‌ రీప్లేస్‌ చేయనుంది. సస్పెన్షన్‌ విషయంలోనూ మార్పులు ఉన్నాయి. ముందు భాగంలో టెలిస్కోపిక్‌ ఫోర్క్‌ ఉంటుంది. వెనుక భాగంలో ప్రీలోడ్‌ అడ్జస్టబుల్‌ మోనోషాక్‌ను అమర్చారు.

ఇది కూడా చదవండి: కొత్త ఎలక్ట్రిక్‌ బైకులు తీసుకురాబోతున్న హీరో - డైలీ యూజ్‌ కోసం, అడ్వెంచర్ల కోసం కూడా!

ప్రస్తుతం ఉన్న పల్సర్‌ 150లో వెనుక భాగంలో ట్విన్‌ షాక్‌ సస్పెన్షన్‌ ఉంది. దీంతో కొత్త మోనోషాక్‌ సెటప్‌ కీలకమైన అప్‌గ్రేడ్‌గా చెప్పొచ్చు. రైడింగ్‌ కంఫర్ట్‌ & హ్యాండ్లింగ్‌లో ఇది మెరుగుదల తీసుకురావచ్చని భావిస్తున్నారు.

ఇంజిన్‌లోనూ మార్పులుఇంజిన్‌లోనూ బజాజ్‌ పెద్ద మార్పే చేసింది. ప్రస్తుత పల్సర్‌ 150లో ఎయిర్‌ కూల్డ్‌ ఇంజిన్‌ ఉంది. కొత్త మోడల్‌లో ఎయిర్‌ కూలింగ్‌తో పాటు ఆయిల్‌ కూలింగ్‌ వ్యవస్థను తీసుకొచ్చింది. దీంతో ఇంజిన్‌ ఉష్ణోగ్రతను మరింత సమర్థంగా నియంత్రించవచ్చు.

ఇంజిన్‌ పనితీరు కూడా మెరుగుపడే అవకాశం ఉంది. అయితే కొత్త పల్సర్‌ 150 పవర్‌ & టార్క్‌ వివరాలను బజాజ్‌ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ప్రస్తుతం ఉన్న పల్సర్‌ 150లో 149.5cc, సింగిల్‌ సిలిండర్‌ ఎయిర్‌ కూల్డ్‌ ఇంజిన్‌ ఉంది. ఇది 14hp శక్తిని & 13.3Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఇది కూడా చదవండి: BMW F 450 GS బైక్‌ రియల్‌ వరల్డ్‌ టెస్ట్.. 100km వేగం కేవలం 5.72 సెకన్లలో!

లుక్స్‌డిజైన్‌ విషయంలోనూ కొత్త పల్సర్‌ 150కు మార్పులు చేశారు. కొత్త పల్సర్‌ 125 నుంచి కొన్ని డిజైన్‌ అంశాలను తీసుకున్నారు. ముందు భాగంలో కొత్త హెడ్‌లైట్‌ కౌల్‌ కనిపిస్తోంది. మస్క్యులర్‌ ఫ్యూయల్‌ ట్యాంక్‌ డిజైన్‌ను కొనసాగించారు. ట్యాంక్‌కు ఇరువైపులా ఎక్స్‌టెన్షన్లు ఉన్నాయి.

వెనుక భాగాన్ని మరింత స్లీక్‌గా రూపొందించారు. పల్సర్‌ సిరీస్‌కు ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన ట్విన్‌ LED టెయిల్‌లైట్లు కొనసాగుతున్నాయి. కొత్త కలర్‌ LCD ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ను కూడా ఈ బైక్‌లో అందించే అవకాశం ఉంది.

ఆగస్టు 12న బజాజ్‌ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనుంది. ఇందులో.. అప్‌డేటెడ్‌ పల్సర్‌ N160 లాంచ్‌ కానుంది. కొత్త పల్సర్‌ 125 & పల్సర్‌ 150 కూడా అదే కార్యక్రమంలో విడుదలవుతాయా, లేదా అనే విషయంపై క్లారిటీ లేదు. అయితే, పల్సర్‌ 150 ఇప్పటికే డీలర్‌షిప్‌లకు చేరడంతో, లాంచ్‌ సమయం దగ్గరలోనే ఉన్నట్లు తెలుస్తోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.