మనదేశంలో కొత్త రేంజ్ రోవర్ డెలివరీలు ప్రారంభం అయ్యాయి. మోస్ట్ అవైటెడ్ లగ్జరీ కార్లలో 2022 రేంజ్ రోవర్ కూడా ముందంజలో ఉంది. ఎంఎల్ఏ ఫ్లెక్స్ బాడీ ఆర్కిటెక్చర్‌పై ఈ కారును కంపెనీ రూపొందించింది. ఇది స్టాండర్డ్, లాంగ్ వీల్ బేస్ ఆప్షన్లను అందించనుంది. దీంతో నాలుగు, ఐదు, ఏడు సీటర్ల కాన్పిగరేషన్లలో ఈ కారును కొనుగోలు చేయవచ్చు.
3.0 లీటర్ల డీజిల్, 3.0 లీటర్ల పెట్రోల్, 4.4 లీటర్ల పెట్రోల్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఐదో తరం రేంజ్ రోవర్లో కొత్త ఫీచర్లు, కొత్త డిజైన్, కొత్త ఇంటీరియర్‌ను అందించారు. ఈ కారులో 13.1 అంగుళాల కర్వ్డ్, ఫ్లోటింగ్ స్క్రీన్‌ను అందించారు. దీంతోపాటు 13.7 అంగుళాల ఇంటరాక్టివ్ డ్రైవర్ డిస్ప్లే కూడా ఉంది.
పవర్ అసిస్ట్ డోర్స్, 35 స్పీకర్ల ఆడియో సిస్టం, వెనకవైపు యాక్జిల్ స్టీరింగ్, టెర్రెయిన్ రెస్పాన్స్ 2 సిస్టం, ఇండిపెండెంట్ ఎయిర్ సస్పెన్షన్ వంటి హైలెట్స్ అందించారు. ఎస్ఈ, హెచ్ఎస్ఈ, ఆటో బయోగ్రఫీ, ఫస్ట్ ఎడిషన్ వేరియంట్లు ఈ కారులో ఉన్నాయి. వీటిలో ఫస్ట్ ఎడిషన్ మోడల్స్ ధర రూ.2.38 కోట్లు కాగా, ఆటో బయోగ్రఫీ మోడల్ ధర రూ.3.3 కోట్ల నుంచి ప్రారంభం కానుంది.
ఈ కొత్త రేంజ్ రోవర్ మోస్ట్ పాపులర్ ఎస్‌యూవీల్లో ఒకటి. ఇందులో సూపర్ లగ్జరీ స్పేస్ అందించారు. రోల్స్ రాయిస్, బెంట్లేల సరసన చేరడానికి రేంజ్ రోవర్‌కు ఇదే చక్కటి అవకాశం. దీని ఎక్స్టర్నల్ డిజైన్ ఒరిజినల్ రేంజ్ రోవర్ తరహాలోనే ఉంది. అయితే దీని షట్లైన్స్ను కంపెనీ తీసేసింది.
రేంజ్ రోవర్ స్పోర్ట్ కూడా ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. ఇది ఒక పెద్ద లగ్జరీ ఎస్యూవీ. ఈ కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్‌లో ఎయిర్ సస్పెన్షన్‌తో పాటు 48 వోల్ట్ ఎలక్ట్రానిక్ యాక్టివ్ రోల్ కంట్రోల్ సిస్టం అందించనున్నారు. ఆల్ వీల్ స్టీరింగ్ ద్వారా టర్నింగ్ సైకిల్ తగ్గనుంది. ఎయిట్ స్పీడ్ జెడ్ఎఫ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, ఇంటెలిజెంట్ ఆల్ వీల్ డ్రైవ్ స్టాండర్డ్‌గా ఉన్నాయి.
ఈ కారులో సాఫ్ట్ క్లోజ్ డోర్స్‌ను అందించారు. 22 వే అడ్జస్టబుల్, హీటెడ్, వెంటిలేటెడ్ ఎలక్ట్రిక్ మెమరీ ఫ్రంట్ సీట్లు, క్యాబిన్ ఎయిర్ ప్యూరిఫికేషన్, 29 స్పీకర్లున్న మెరీడియన్ ఆడియో సిస్టం, ఫ్లోటింగ్ 13.1 ఇంచ్ కర్వ్డ్ టచ్ స్క్రీన్, 13.7 అంగుళాల డ్రైవర్ డిస్ప్లే, అలెక్సా ఫంక్షన్ ఉన్న పివి ప్రో ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టం, కనెక్టెడ్ కార్ టెక్, 3డీ సరౌండ్ కెమెరా, ముందువైపు, వెనకవైపు పార్కింగ్ సెన్సార్లు కూడా ఇందులో ఉన్నాయి.
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పైరీ అయిందా.. ఆన్లైన్లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?