మారుతి తన కొత్త బలెనో కారును మార్కెట్లో లాంచ్ చేసింది. దీని ధర రూ.6.35 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఇందులో ఏఎంటీ వెర్షన్ ధర రూ.7.69 లక్షలుగా ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బెస్ట్ సెల్లింగ్ మారుతి కార్లలో బలెనో కూడా ఒకటి. ఈ కొత్త బలెనోలో ఎన్నో మార్పులు చేశారు.
ఇందులో ముందువైపు హెడ్‌ల్యాంప్స్ పెద్దగా ఉండనున్నాయి. గ్రిల్ కూడా పెద్దగా ఉండనుంది. ఈ గ్రిల్‌కు సిల్వర్ ఫినిషింగ్ అందించారు. కిందవైపు బంపర్ కూడా అందించారు. అలాగే బోనెట్ కూడా కొంచెం మారింది. హెడ్‌ల్యాంప్స్‌కు కొత్త తరహా ఎల్ఈడీ డీఆర్ఎల్ డిజైన్‌ను అందించారు.
అలాగే కారు వెనకవైపు పెద్ద టెయిల్ ల్యాంప్స్ అందించారు. రిఫ్లెక్టర్‌ను కూడా వెనకవైపు బంపర్ పైభాగంలో అందించారు. అలోయ్ వీల్స్‌ను కూడా అప్‌డేట్ చేశారు. ఇంటీరియర్‌లో కూడా పలు మార్పులు చేశారు. దీని లుక్ కూడా పూర్తిగా మారిపోనుంది.
కొత్త లుక్ ఉన్న స్టీరింగ్ వీల్, పెద్ద టచ్ స్క్రీన్, ప్రీమియం అప్‌హోల్స్ట్రీ కూడా ఇందులో ఉన్నాయి. బ్లూ కలర్ వేరియంట్లో సిల్వర్ హైలెట్స్/బ్లాక్ థీమ్‌ను అందించారు. ఇందులో 9 అంగుళాల టచ్ స్క్రీన్ అందించారు. కొత్త స్మార్ట్ ఫ్లే ప్రో+ ఇన్‌ఫోటెయిన్‌మెంట్ సిస్టం కూడా ఇందులో ఉంది
హెచ్‌డీ డిస్‌ప్లే, వాయిస్ అసిస్టెంట్, 360 డిగ్రీల కెమెరా, అర్కమిస్ ఆడియో సిస్టం, అలెక్సా వాయిస్ ఇంటిగ్రేషన్‌లను ఇందులో అందించారు. హెడ్స్ అప్ డిస్‌ప్లేను ఇందులో అందించారు. ఇందులో హెడ్స్ అప్ డిస్‌ప్లే కూడా ఉంది. ఈ విభాగంలో ఈ ఫీచర్‌ను అందించడం ఇదే మొదటిసారి. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. ఏఎంటీ ఆటోమేటిక్ ప్లస్‌తో పాటు 5-స్పీడ్ మాన్యువల్ కూడా ఇందులో ఉంది.