MS Dhoni Spotted Driving Citroen Basalt Dark Edition: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, ఇటీవల, జార్ఖండ్ రాజధాని రాంచీలో "సిట్రోయెన్ బసాల్ట్ డార్క్ ఎడిషన్" SUV నడుపుతూ కనిపించాడు. అద్భుతమైన కార్లు, బైక్ కలెక్షన్ చేసే మిస్టర్ కూల్, ఈసారి స్టైలిష్ & ప్రీమియం SUVలో కనిపించాడు. ధోని గరాజ్ ఇప్పటికే మెర్సిడెస్ బెంజ్ G63 AMG, నిస్సాన్ జోంగా, & జీప్ గ్రాండ్ చెరోకీ SRT వంటి లగ్జరీ కార్లతో నిండిపోయింది. సిట్రోయెన్ బసాల్ట్ డార్క్ ఎడిషన్ అతని లేటెస్ట్ కారు.
సిట్రోయెన్ బసాల్ట్ డార్క్ ఎడిషన్ ఎలా ఉంటుంది?భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో సిట్రోయెన్ బసాల్ట్ డార్క్ ఎడిషన్ 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది, ఈ విభాగంలో అత్యంత సురక్షితమైన SUVలలో ఒకటిగా నిలిచింది. ఈ SUVలో 6 ఎయిర్‌బ్యాగులు, EBD, ABS, ట్రాక్షన్ కంట్రోల్ & టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి కీలక సేఫ్టీ ఫీచర్లు లక్షణాలు ఉన్నాయి. హైవేలపైనే కాకుండా నగర రోడ్లపై కూడా సురక్షితంగా డ్రైవ్ చేయడానికి ఈ ఫీచర్లు తోడ్పడతాయి. కాబట్టి, ఫ్యామిలీకి ఇది ఒక సురక్షితమైన కారు.
ఇంటీరియర్స్ & టెక్నాలజీసిట్రోయెన్ బసాల్ట్ డార్క్ ఎడిషన్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే & ఆండ్రాయిడ్ ఆటోకు సపోర్ట్ చేసే 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలిగి ఉంది. ఇంకా.. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ & వైర్‌లెస్ ఛార్జర్ వంటి ఫీచర్లు ఈ ఫోర్‌వీలలో హై-క్లాస్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి. సన్‌రూఫ్ & రియర్ విండో షేడ్స్ వంటి కొన్ని ప్రీమియం ఫీచర్లు దీనికి లేకపోయినా, ఇప్పటికే ఉన్న స్మార్ట్ ఇంటీరియర్ కారణంగా ఈ కారు మోడర్న్ ఫీలింగ్ ఇస్తుంది.
డార్క్ ఎడిషన్ డిజైన్సిట్రోయెన్ బసాల్ట్ డార్క్ ఎడిషన్ బోల్డ్ & స్పోర్టీ డిజైన్ మొదటి చూపులోనే ఆకట్టుకుంటుంది. దీనికి పెర్లా నెరా బ్లాక్ పెయింట్ ఫినిషింగ్, డార్క్ క్రోమ్ యాక్సెంట్స్, బ్లాక్ సైడ్ మోల్డింగ్స్ & గ్లాస్ బ్లాక్ డోర్ హ్యాండిల్స్, బంపర్ ఉన్నాయి. వీటి కారణంగా ఈ కారు సాధారణ SUVల కంటే భిన్నంగా కనిపిస్తుంది & ఒక ప్రత్యేకమైన గుర్తింపును సృష్టిస్తుంది. బహుశా, MS ధోని దీనిని తన కార్ కలెక్షన్‌లో చేర్చడానికి ఇదే కారణం కావచ్చు.
ఇంజిన్ & పనితీరుసిట్రోయెన్ బసాల్ట్ డార్క్ ఎడిషన్ 1.2-లీటర్ ఇన్‌లైన్ 3-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇంజిన్ పనితీరు ట్రాన్స్‌మిషన్ వేరియంట్‌ను బట్టి మారుతుంది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో, ఈ ఇంజిన్ 110 bhp పవర్‌ను & 190 Nm టార్క్‌ను ఇస్తుంతి. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అదే పవర్ 205 Nm టార్క్‌ను చేరుకుంటుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఈ SUV సిటీ డ్రైవింగ్‌కు సరిగ్గా సూటవుతుంది & హైవే మీద స్మూత్ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.
ధరసిట్రోయెన్ బసాల్ట్ డార్క్ ఎడిషన్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 12.30 లక్షలు. ప్రస్తుతం చాలా ప్రీమియం SUVతో పోలిస్తే ఈ రేటు తక్కువగానే అనిపిస్తుంది. కారు డిజైన్, భద్రత & సాంకేతికతను పరిగణనలోకి తీసుకుంటే, ఈ ధర డబ్బుకు తగిన విలువను అందించగలదు.