Cheapest Affordable Electric Bikes India: ఇండియాలో, ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌ మార్కెట్‌లో ఎక్కువ హవా కుటుంబ స్కూటర్లు, పెర్ఫార్మెన్స్‌ స్కూటర్లదే. ఓలా, ఏథర్‌, TVS, బజాజ్‌… ఇవన్నీ ఒకే సెగ్మెంట్‌లో ఆధిపత్యం కోసం పోటీ పడుతుంటాయి. కానీ ఈ రద్దీకి దూరంగా, తక్కువ ధరలో ఎక్కువ ఉపయోగపడే యుటిలిటీ EVలపై మోటోవోల్ట్‌ కంపెనీ దృష్టిని కేంద్రీకరించింది.

Continues below advertisement

మోటోవోల్ట్‌ ఫౌండర్‌ & CEO తుషార్‌ చౌధరి చెప్పిన మాటలు సారాంశంగా చూస్తే — “పోటీ గట్టి ఉన్న చోట ఎందుకు పోవాలి? పెద్ద అవకాశాలు ఉన్నప్పటికీ అందరూ మర్చిపోయిన రంగంలోనే మేం అడుగుపెట్టాం.”

లైసెన్స్‌ అవసరం లేని Motovolt URBN  e-Bike

Continues below advertisement

Motovolt ఇటీవల మార్కెట్‌లోకి తీసుకొచ్చిన URBN ఈ-బైక్‌ ప్రత్యేకత ఏమిటంటే... దీనిని నడపడానికి లైసెన్స్‌ అవసరం లేదు, రిజిస్ట్రేషన్‌ కూడా అవసరం లేదు. కేవలం ₹49,999 ధరతో వచ్చిన ఈ ఈ-బైక్‌ కోసం కంపెనీ కేవలం ₹999తో బుకింగ్స్‌ తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా 100కి పైగా రిటైల్‌ పాయింట్లలో ఈ బండి అందుబాటులో ఉంది.

పసుపు, నీలం, ఎరుపు, నారింజ - ఈ నాలుగు రంగుల్లో URBN లభిస్తుంది. పెడల్‌ అసిస్ట్‌ సెన్సర్‌, విభిన్న రైడ్‌ మోడ్‌లు, ఇగ్నిషన్‌ కీ స్విచ్‌, హ్యాండిల్‌ లాక్‌.. ఇవన్నీ యుటిలిటీతో పాటు సేఫ్టీని కూడా అందిస్తున్నాయి.

సైజు పరంగా 1,700 mm పొడవు, 645 mm వెడల్పు, 1,010 mm ఎత్తు కలిగిన Motovolt URBN బరువు 40 కిలోలు మాత్రమే. కానీ 120 కిలోల లోడ్‌ మోయగలదు. గరిష్ట వేగం 25 kmph, దీనిని కూడా 10 సెకన్లలో చేరడం దీని ప్రత్యేకత.

36V BLDC మోటార్‌, 20-అంగుళాల వీల్స్‌, 35-40 Nm టార్క్‌ ఔట్‌పుట్‌ నగర రైడింగ్‌కు పర్ఫెక్ట్‌గా గా సరిపోతాయి. 4 గంటల్లో ఫుల్‌ ఛార్జ్‌ అయ్యే లిథియం అయాన్‌ బ్యాటరీతో ఈ బండి నుంచి 120 km వరకు రేంజ్‌ పొందవచ్చు.

టీవీఎస్‌ XL తరహాలో Motovolt M7

Motovolt M7 స్కూటర్‌ కంపెనీ వ్యూహంలో పెద్ద పాత్ర పోషిస్తోంది. కుటుంబ స్కూటర్‌గా కాకుండా “మల్టీ-యుటిలిటీ EV”గా దీన్ని డిజైన్‌ చేశారు. ఏకంగా 200 కిలోల బరువు మోయగల ఈ ఈ-స్కూటర్‌, 166 km వరకు రేంజ్‌ ఇస్తుంది. ఇది ఒక రకంగా “SUV స్పూర్తితో రూపొందించిన EV స్కూటర్‌.”

కంపెనీ ప్రస్తుతం 17 అంగుళాల వీల్‌ సైజ్‌తో TVS XL తరహా కొత్త వేరియెంట్‌ కూడా తీసుకురావడానికి సిద్ధమవుతోంది.

ఎలక్ట్రిక్‌ సైకిళ్లు కూడా...

₹25,000–₹30,000 లలో అందుబాటులో ఉండే మోటోవోల్ట్‌ ఈ-సైకిళ్లు రోజువారీ ప్రయాణికులకు, B2B డెలివరీ రైడర్లకు చవకైన పరిష్కారం. కొత్త రేంజ్‌ మోడళ్లతో 125–130 km వరకు రేంజ్‌ ఇవ్వడం ఈ సెగ్మెంట్‌లో మంచి ఆకర్షణ.

బ్యాటరీ స్వాపింగ్‌ – గిగ్‌ వర్కర్ల కోసం కీలకం

క్విక్‌-కామర్స్‌ పెరుగుతోన్న ఈ కాలంలో, ఇంట్లో ఛార్జింగ్‌ అసాధ్యమయ్యే పరిస్థితుల్లో, బ్యాటరీ స్వాపింగ్‌ మాత్రమే తగిన పరిష్కారమని మోటోవోల్ట్‌ చెబుతోంది. యుమా, ఇండోఫాస్ట్‌ వంటి నెట్‌వర్క్‌లతో కలిసి, తన బిజినెస్‌ పెంచుకుంటోంది.

తయారీ & విస్తరణ

కోల్‌కతాలోని ప్లాంట్‌ సంవత్సరానికి 30,000 యూనిట్లు తయారు చేస్తోంది. త్వరలో దక్షిణ భారతదేశం లేదా ఉత్తర భారతదేశంలో మరో ప్లాంట్‌ ఏర్పాటు చేసి వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 1 లక్ష యూనిట్లకు పెంచేందుకు లక్ష్యం పెట్టుకుంది. అలాగే రిటైల్‌ అవుట్‌లెట్లను 100 నుంచి 200కి పెంచాలన్నది కంపెనీ ప్రణాళిక. ఇది వాస్తవ రూపం దాలిస్తే, మోటోవోల్ట్‌ ఈ-బైక్స్‌, ఈ-సైకిల్స్‌ మరింత వేగంగా అందుబాటులోకి వస్తాయి.