Most shared engines in indian cars: మన కార్ల మార్కెట్లో, ఇంజిన్ల అభివృద్ధి ఒక ఖరీదైన పని. ఒక ఇంజిన్‌ను పూర్తిగా కొత్తగా రూపకల్పన చేయడానికి కంపెనీలు ఏళ్ల సమయాన్ని, వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తాయి. అందుకే ఒకే బ్రాండ్‌లోని పలు మోడళ్లలో ఒకే ఇంజిన్‌ను ఉపయోగించడం సాధారణం. అంతేకాదు, రెండు కంపెనీలు ఒక ఒప్పందానికి వచ్చి, ఒకే ఇంజిన్‌ను వాటి మోడళ్లలో వినియోగించుకోవడం (పంచుకోవడం) కూడా కొన్నిసార్లు జరుగుతోంది. ₹30 లక్షల లోపు మాస్‌ మార్కెట్ కార్లలో ఎక్కువగా పంచుకున్న ఇంజిన్ల జాబితాను ఇప్పుడు ఒకసారి చూద్దాం.

Continues below advertisement

1. Maruti Suzuki K15C - అత్యధికంగా షేర్‌ చేసిన ఇంజిన్‌లలో ఒకటి

Brezza, Grand Vitara, Victoris, Ertiga, XL6, Toyota Hyryder, Toyota Rumion - మొత్తం 7 మోడళ్లు ఈ ఇంజిన్‌పై నడుస్తాయి.

Continues below advertisement

1,462cc నేచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్‌ ఇది. పెట్రోల్‌ & CNG రెండింటిలో అందుబాటులో ఉంటుంది.పెట్రోల్‌ వేరియంట్‌: 103hp, 139NmCNG వేరియంట్‌: 88hp, 122Nmమైలేజ్ విషయంలో Victoris ముందు ఉంటుంది.5-స్పీడ్ MT, 6-స్పీడ్ AT, కొన్ని మోడళ్లలో AWD కూడా లభ్యం.

2. Maruti Suzuki K12N - చిన్న కార్లలో అత్యంత ప్రజాదరణ

Wagon R, Baleno, Fronx, Eeco, Toyota Glanza, Taisor - మొత్తం 6 మోడళ్లు ఈ 1.2L ఇంజిన్ వాడుతున్నాయి.

పెట్రోల్‌: 91hp, 114NmCNG: 71hp, 106Nmమైలేజ్‌ 24.43kpl వరకు.5-స్పీడ్ MT, 5-స్పీడ్ AMT ఆప్షన్లు ఉన్నాయి.

3. Fiat 2.0 Multijet - SUV సెగ్మెంట్‌లో రాజు

MG Hector, Hector Plus, Tata Harrier, Safari, Jeep Compass - 6 మోడళ్ల హార్ట్ ఇదే.

170hp, 350Nm పవర్‌ ఇచ్చే ఈ 2.0L టర్బో డీజిల్‌ భారత SUV సెగ్మెంట్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఇంజిన్.6MT, 6AT, 9AT గేర్‌బాక్స్‌లు లభ్యం.Compass‌లో AWD కూడా లభిస్తుంది.

4. Hyundai - Kia 1.5L T-GDI - టర్బో పెట్రోల్‌ లైనప్‌లో స్టార్

Hyundai Verna, Creta, Alcazar, Kia Seltos, Carens Clavis - మొత్తం 5 మోడళ్లు.

160hp, 253Nm ఇచ్చే ఈ ఇంజిన్ స్పోర్టీ పెర్ఫార్మెన్స్‌కు ప్రసిద్ధి.6MT, IVT, 7DCT ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

5. Hyundai - Kia 1.5L Smartstream NA

Verna, Creta, Kia Seltos, Carens Clavis - 4 మోడళ్లు.

115hp, 144Nm ఇచ్చే స్మూత్‌ & రిలయబుల్ ఇంజిన్‌.MT, IVT ట్రాన్స్‌మిషన్‌లు లభ్యం.

6. Hyundai - Kia U2 CRDI 1.5L డీజిల్‌

Creta, Alcazar, Seltos, Sonet - 4 మోడళ్లు.

116hp, 250Nm.డీజిల్‌ ప్రేమికులకు ఈ ఇంజిన్ ఇంకా బలమైన ఎంపిక.

7. Mahindra 2.2L mHawk - బలమైన డీజిల్ ఇంజిన్

Scorpio N, Scorpio Classic, Thar, Thar Roxx - 4 మోడళ్లు.

అత్యధికంగా 172hp, 400Nm వరకు పవర్‌.RWD, 4WD రెండు లభ్యం.

8. Volkswagen - Skoda TSI Engines (1.0 & 1.5)

Slavia, Virtus, Kushaq, Taigun - 4 మోడళ్లు.

1.0 TSI: 115hp, 178Nm1.5 TSI: 150hp, 250Nm

స్మూత్ పెర్ఫార్మెన్స్ & క్విక్ రెస్పాన్స్ వీటి ప్రత్యేకత.

9. Mahindra 2.0L mStallion

Thar, Roxx, Scorpio N - 3 మోడళ్లు.

150 - 200hp వరకు భారీ పవర్‌.ఆఫ్‌-రోడింగ్ అభిమానులకు ఫేవరెట్‌ ఇంజిన్‌లలో ఒకటి.

10. Maruti Suzuki K10C - చిన్న కార్లకు సరిగ్గా సరిపోయే ఇంజిన్

Wagon R, S-Presso, Celerio - 3 మోడళ్లు.

998cc ఇంజిన్‌ 69hp వరకు పవర్‌.మెత్తని డ్రైవింగ్‌, అత్యుత్తమ మైలేజ్‌ ప్రత్యేకత.

11. Maruti Suzuki Z12E 

Swift & Dzire - 2 మోడళ్లు.

82hp, 112Nm ఇచ్చే ఈ ఇంజిన్‌ పెట్రోల్‌ వేరియంట్‌లో మంచి పనితీరు అందిస్తుంది.AMT కూడా లభ్యం.

12. Toyota 1.5L TNGA Hybrid

Grand Vitara Hybrid, Hyryder Hybrid - 2 మోడళ్లు.

అద్భుతమైన మైలేజ్‌, సైలెంట్ డ్రైవ్.

13. Toyota 2.0L TNGA Hybrid

Invicto, Innova Hycross - 2 మోడళ్లు.

189hp పవర్‌, 22.16kpl వరకు మైలేజ్‌.

14. Maruti 1.0L K-Series Turbo

Fronx, Taisor - 2 మోడళ్లు.

100hp, 148Nm పెట్రోల్‌ టర్బో ఇంజిన్.ఫన్-టు-డ్రైవ్ పెర్ఫార్మెన్స్‌.

ఈ ఇంజిన్‌ల షేరింగ్‌ కారణంగా కంపెనీలకు చాలా ఖర్చు మిగులుతుంది. దీనివల్ల ప్రజలకు అందుబాటు ధరలోనే మంచి మైలేజ్‌, పవర్‌ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.