ప్రస్తుతం ఆటోమేటిక్ కార్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. మీరు సిటీలో నడపడానికి చవకైన, సౌకర్యవంతమైన ఆటోమేటిక్ కారు కోసం చూస్తున్నట్లయితే Renault Triber మీకు మంచి ఛాయిస్ కావచ్చు. ఇది ప్రస్తుతం భారతదేశంలో అత్యంత చవకైన ఆటోమేటిక్ MPV గా భావిస్తారు. ఇది మధ్యతరగతి కుటుంబాలకు అద్భుతమైన ఎంపికగా మారి విక్రయాలలో దూసుకెళ్తోంది. ముఖ్యంగా సిటీ ట్రాఫిక్‌లో సిగ్నిల్స్ సమస్య అధికంగా ఉంటుంది. కనుక దీని ఆటోమేటిక్ గేర్‌బాక్స్ డ్రైవింగ్ చేసేవారికి చాలా సహాయకరంగా ఉంటుంది. కనుక అతి తక్కువ ధరకు లభిస్తున్న ఆటోమేటిక్ కారు రెనాల్ట్ ట్రైబర్ పూర్తి వివరాలు తెలుసుకున్నాక కొనాలా, వద్దా డిసైడ్ చేసుకోవడం మంచిది.
Renault Triber ధర ఎంత?
Renault Triber ప్రారంభ ధర దాదాపు 5.76 లక్షల రూపాయలు. ఇది బడ్జెట్ విభాగంలో అత్యంత చవకైన 7 సీటర్‌గా మార్చుతుంది. అదే సమయంలో దీని ఆటోమేటిక్ AMT వేరియంట్ సుమారు 8.39 లక్షలకు ప్రారంభమవుతుంది. ఈ ధర వద్ద మీకు 7 సీట్లు, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ లభిస్తుంది. ఇది మారుతి ఎర్టిగా (Maruti Ertiga), కియా కారెన్స్ (Kia Carens) వంటి కార్ల కంటే చాలా చౌకగా ఉంచుతుంది. తక్కువ బడ్జెట్‌లో బిగ్ ఫ్యామిలీ కారు కోరుకునే వారికి ఇది ఒక మంచి ఎంపిక అవుతుంది.
ఇంజిన్, పనితీరు.. మైలేజ్
Renault Triber లో 1.0 లీటర్, 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉన్నాయి. ఇది సుమారు 72 PS శక్తిని, 96 Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ ఇంజిన్ స్మూత్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. నగరంలో రోజువారీ డ్రైవింగ్‌కు పూర్తిగా సరిపోతుంది. ఇందులో మాన్యువల్ వేరియంట్, AMT ఆటోమేటిక్ రెండు ఎంపికలు ఉన్నాయి. మైలేజ్ విషయానికి వస్తే, Triber సుమారు 17 నుంచి 20 KMPL వరకు మైలేజ్ ఇస్తుంది. ఇది ఈ విభాగంలోని 7 సీటర్ కార్లలో బెస్ట్ అనిపించుకుంటోంది.
ఫీచర్లు, భద్రత.. పోటీదారులు ఎవరున్నారు
Renault Triber లో 8 అంగుళాల టచ్‌స్క్రీన్, Android Auto తో పాటు Apple CarPlay, రియర్ AC వెంట్స్, క్రూయిజ్ కంట్రోల్ సహా పార్కింగ్ సెన్సార్లు వంటి అవసరమైన ఫీచర్లు ఉన్నాయి. భద్రత విషయానికి వస్తే ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, EBD వంటి ఫీచర్లు అందించారు. ఇది మారుతి ఎర్టిగా (Maruti Ertiga), Kia Carens, మహీంద్రా బలెనో నియో (Mahindra Bolero Neo), Maruti Eeco తో పోటీపడుతుంది. అయితే ధర పరంగా రెనాల్ట్ Triber ముందంజలో ఉంది. Renault Triber తక్కువ బడ్జెట్‌లో 7 సీటర్ ఆటోమేటిక్ కారును కోరుకునే వారికి బెస్ట్ కారు అని చెప్పవచ్చు.