14 inch wheel scooters India: సాధారణంగా స్కూటర్లలో 12 ఇంచుల వీల్స్‌ ఎక్కువగా కనిపిస్తాయి. అయితే 14 ఇంచుల పెద్ద వీల్స్‌ ఉండటం వల్ల రోడ్డుపై ఎక్కువ స్థిరత్వం, మెరుగైన బ్యాలెన్స్‌, గుంతలు ఉన్న రోడ్లపై రైడర్‌కు బెటర్‌ కంట్రోల్‌ లభిస్తుంది. బైక్‌ల మాదిరిగా పూర్తి స్థాయి స్థిరత్వం కాకపోయినా, రోజువారీ ప్రయాణానికి ఇది మంచి మధ్య స్థాయి పరిష్కారం. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత చవకైన 14 ఇంచుల వీల్స్‌ స్కూటర్ల జాబితా ఇదే.

1) Hero Xoom 125 - రూ. 80,494 నుంచి    

2024 చివరలో లాంచ్‌ అయిన ఈ స్కూటర్‌ ప్రస్తుతం భారతదేశంలో 14 ఇంచుల వీల్స్‌తో లభించే అత్యంత చవకైన మోడల్‌. 124.6cc ఎయిర్‌ కూల్డ్‌ ఇంజిన్‌తో ఇది పని చేస్తుంది. పెద్ద వీల్స్‌ వల్ల మెరుగైన స్టెబిలిటీ, కంట్రోల్‌ లభిస్తాయి. 125cc సెగ్మెంట్‌లో ఇది ప్రత్యేక గుర్తింపు పొందుతోంది.

2) Aprilia SR 125 / Aprilia SR 175 - రూ. 1.08 లక్షల నుంచి      

2016లో SR 150తో ప్రారంభమైన ఈ సిరీస్‌ ఇప్పటికీ 14 ఇంచుల వీల్స్‌ సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. స్పోర్టీ డిజైన్‌, షార్ప్‌ హ్యాండ్లింగ్‌ వీటి ప్రత్యేకత. రైడ్‌ కొంచెం గట్టిగా అనిపించినా, నడిపే వ్యక్తికి మలుపుల్లో మంచి కంట్రోల్‌ ఇస్తుంది.

3) Hero Xoom 160 - రూ.1.38 లక్షలు    

హీరో బ్రాండ్‌ నుంచి వచ్చిన & 150cc కంటే పై స్థాయిలో ఉన్న మ్యాక్సీ-స్కూటర్‌ ఇది. లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్‌, భారీ డిజైన్‌తో కనిపిస్తుంది. అయితే... 14 ఇంచుల వీల్స్‌ ఉన్నప్పటికీ, స్పోర్టీ డిజైన్‌ కారణంగా, మలుపుల్లో అంత నమ్మకం కలిగించే హ్యాండ్లింగ్‌ ఇవ్వదు.

4) Yamaha Aerox 155 - రూ.1.40 లక్షల నుంచి     

155cc శక్తివంతమైన ఇంజిన్‌తో వచ్చిన ఈ మ్యాక్సీ-స్కూటర్‌ స్పోర్టీ లవర్స్‌కు నచ్చుతుంది. 14 ఇంచుల వీల్స్‌ కారణంగా హ్యాండ్లింగ్‌ మెరుగ్గా ఉంటుంది. అయితే రైడ్‌ కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది.

5) River Indie - రూ.1.46 లక్షలు     

ఎలక్ట్రిక్‌ సెగ్మెంట్‌లో 14 ఇంచుల వీల్స్‌తో వచ్చే అరుదైన స్కూటర్‌ ఇది. యుటిలిటీ డిజైన్‌, పెద్ద బాడీతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. పెద్ద వీల్స్‌ వల్ల స్ట్రైట్‌ లైన్‌ స్టెబిలిటీ మెరుగ్గా ఉంటుంది.

గౌరవ ప్రస్తావన - TVS Orbiter       

ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లో ముందు 14 ఇంచుల వీల్‌, వెనుక 12 ఇంచుల వీల్‌ ఉంది. ముందు వైపు పెద్ద వీల్‌ కారణంగా మంచి స్థిరత్వం లభిస్తుంది.

రోజువారీ ప్రయాణంలో గుంతలు, స్పీడ్‌ బ్రేకర్లు, ఎగుడుదిగుడు రోడ్లు ఎదురైనప్పుడు 14 ఇంచుల వీల్స్‌ ఉన్న స్కూటర్లు మెరుగైన బ్యాలెన్స్‌, స్టెబిలిటీ ఇస్తాయి. రూ. 80,000 నుంచే ఈ ఫీచర్‌ లభించడం గమనించదగ్గ విషయం. మీ బడ్జెట్‌, అవసరాన్ని బట్టి పై మోడళ్లలో సరైన దానిని ఎంచుకోవచ్చు.      

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.