Bike Or Scooter Mileage Improvement Tips: బైక్ కొనడం ఒకసారి అయితే, దానిని శ్రద్ధగా నిర్వహించడం ఒక జీవితకాల బాధ్యత. చాలామంది బైక్ ఓనర్లు వాహనం కొనుగోలు తర్వాత దాని మెయింటెనెన్స్ పట్ల అలసత్వం చూపుతారు. కానీ, నెలకు ఒకసారి కొన్ని ముఖ్యమైన చెకింగ్స్ చేయడం వల్ల మీ బైక్ పనితీరు మెరుగవుతుంది, మైలేజ్ పెరుగుతుంది, అనవసర ఖర్చులు కూడా తగ్గుతాయి. అంటే, మీరు మీ బైక్‌పై నెలకు కనీసం ఒకసారి శ్రద్ధ పెడితే మీ డబ్బు ఆదా అవుతుంది.
1. ఇంజిన్ ఆయిల్ చెక్ చేయండిఇది బైక్ లేదా స్కూటర్ మెయింటెనెన్స్‌లో అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. ప్రతి నెలా ఓసారి ఆయిల్ స్థాయి సరిగానే ఉందా, దాని రంగు మార్చిపోయిందా, లెవెల్ తగ్గిందా అని పరిశీలించాలి. అవసరమైతే ఆయిల్ మార్చాలి. వాడిన ఆయిల్ వలన ఇంజిన్ పనితీరు తగ్గిపోతుంది, మైలేజ్ కూడా పడిపోతుంది.
2. టైర్ ప్రెషర్ చెక్ చేయడం మర్చిపోకండితగిన టైర్ ప్రెషర్ లేకపోతే మైలేజ్ తగ్గుతుంది. అంతే కాదు, టైర్లు త్వరగా అరిగిపోతాయి, జారిపోతాయి. ప్రతీ నెలా కనీసం ఒకసారి, వీలైతే వారానికి ఒకసారి, పక్కా గేజ్‌తో రెండు టైర్ల ప్రెషర్ చెక్ చేయడం అలవాటు చేసుకోండి.
3. బ్రేకులు, కేబుల్స్ పనితీరు చూడండిబ్రేక్‌లు సరిగానే పని చేస్తున్నాయా? బ్రేక్ లైన్లలో ఏవైనా పగుళ్లు, తెగిన గుర్తులు ఉన్నాయా? బ్రేక్ లైన్‌లన్నీ స్మూత్‌గా పని చేస్తున్నాయా అన్నది పరిశీలించండి. అలాగే క్లచ్, యాక్సిలరేటర్ కేబుల్స్ జామ్ అయ్యాయేమో కూడా చూసుకోవాలి.
4. చైన్ క్లీనింగ్ & ల్యూబ్రికేషన్‌బైక్ చైన్‌కి సరైన ల్యూబ్రికేషన్ లేకపోతే సౌండ్ వస్తుంది, మైలేజ్ పడిపోతుంది. నెలకోసారి చైన్‌ను క్లీన్ చేసి, ప్రత్యేకమైన చైన్ ల్యూబ్ స్ప్రే వాడటం మంచిది. ఇది, రైడింగ్ సమయంలో మీ బైక్ తేలికగా, స్మూత్‌గా పరుగెత్తేలా చేస్తుంది.
5. బ్యాటరీ స్థితి పర్యవేక్షణముఖ్యంగా ఎలక్ట్రిక్ స్టార్టింగ్ ఉన్న బైక్‌లలో బ్యాటరీ తక్కువ వోల్టేజ్‌తో ఉంటుంది. నెలకోసారి వర్క్‌షాప్‌నకు తీసుకువెళ్లి లేదా మీరే బ్యాటరీ వోల్టేజ్ చెక్ చేయండి. లీకేజీ ఉందా? టెర్మినల్స్ తుప్పు పట్టాయా అన్నది చూసుకోవాలి.
6. లైటింగ్, హార్న్, సెల్ఫ్ స్టార్టర్‌హెడ్‌ల్యాంప్స్, టెయిల్‌ల్యాంప్స్, ఇండికేటర్లు సరిగ్గా పనిచేస్తున్నాయో, లేదో చూసుకోండి. హార్న్ వాల్యూమ్ తగ్గితే అది కూడా బ్యాటరీ లేదా కనెక్షన్ సమస్య కావచ్చు. ఈ చిన్న విషయాల్ని నిర్లక్ష్యం చేస్తే రోడ్డుపైకి వచ్చిన తర్వాత భారీ మూల్యం చెల్లించాల్సి రావచ్చు.
7. వాషింగ్ & శుభ్రతనెలకోసారి బైక్‌ను శుభ్రంగా కడగడం వల్ల తుప్పు ఏర్పడే అవకాశాలు తగ్గుతాయి. ముఖ్యంగా అండర్‌క్యారేజ్, చైన్ ప్రాంతాల్లో గట్టిగా తుడవాలి. శుభ్రంగా ఉండే బైక్ ఇతరుల దృష్టిని ఆకర్షించడమే కాదు, దీర్ఘకాలికంగా ధన నష్టం నుంచి కాపాడుతుంది.
నెలవారీ నిర్వహణ అనేది కాస్త ఖర్చుతో కూడుకున్న పని. కానీ దీన్ని మనం సాధారణంగా చేసే మొబైల్ రీచార్జ్‌లా భావిస్తే, దీర్ఘకాలంగా మీ బండి మైలేజ్, ఇంజిన్ ఆరోగ్యం, భద్రత సహా ఆల్-రౌండ్ బెనిఫిట్‌లా మారుతుంది. పైగా, చిన్న జాగ్రత్తల వల్ల పెద్ద నష్టాలు తగ్గుతాయి, మీ డబ్బు పెద్ద మొత్తంలో ఖర్చు కాకుండా ఉంటుంది.