Michelin Tyres Review India 2025: ముంబై రోడ్లు ఏ డ్రైవర్‌కైనా ఒక పరీక్ష. ఎక్కడో ఒక్కచోట పూడుకుపోయిన గుంత, ఇంకోచోట అకస్మాత్తుగా వచ్చే గ్రావెల్‌, మూడు లేన్లను ఒకేసారి దాటే టాక్సీ లేదా ఆటో - ఇవన్నీ ముంబై డ్రైవింగ్‌లో ప్రతి రోజు చూసే సన్నివేశాలే. ఇలాంటి పరిస్థితుల్లో కారులోని ఫీచర్లు మాత్రమే కాకుండా, దానికి వేసే టయర్లు కూడా అత్యంత ముఖ్యమైనవి. రోడ్డుతో నేరుగా టచ్‌లో ఉండేది కారు టయర్లు మాత్రమే. Michelin Primacy 4 & Pilot Sport 4 SUV టయర్లు రియల్‌ ఇండియన్‌ కండిషన్స్‌లో ఎలా పని చేశాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

Continues below advertisement


Primacy 4: సిటీ డ్రైవ్స్‌కి పర్ఫెక్ట్‌


లగ్జరీ సెడాన్‌కు బిగించిన Michelin Primacy 4 టయర్లు ముంబై గందరగోళాన్ని సైలెంట్‌గా, సాఫ్ట్‌గా మేనేజ్‌ చేశాయి. డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు స్టీరింగ్‌ చాలా లైట్‌గా అనిపిస్తుంది. క్యాబిన్‌లో వైబ్రేషన్స్‌, రోడ్‌ నాయిస్‌ గణనీయంగా తగ్గాయి. గుంతలు, రఫ్‌ ప్యాచులు, హార్డ్‌ బ్రేకింగ్‌... ఏది వచ్చినా టయర్లు శబ్దం చేయకుండా పర్ఫెక్ట్‌గా వర్క్‌ చేశాయి. Primacy 4‌లో ఉన్న నెక్ట్స్‌ జెనరేషన్‌ రబ్బర్‌ కంపౌండ్‌ తడి & పొడి రోడ్లపై అద్భుతమైన బ్రేకింగ్‌ ఇచ్చింది. వరుణుడు ఎంత భారీ వర్షం కురిపించినా, హిడెన్‌ గ్రూవ్స్‌ టెక్నాలజీ వల్ల వాటర్‌ ఎవాక్యుయేషన్‌ అద్భుతంగా జరిగింది. ముఖ్యంగా టయర్లు కొత్తగా ఉన్నప్పుడు, వెయ్యి కిలోమీటర్లు పరుగెత్తిన తర్వాత కూడా వాటి పనితీరు సమానంగా ఉండటం Primacy 4 పెద్ద ప్లస్‌.


శబ్దం తగ్గించడంలో Silent Rib Technology కీలక పాత్ర పోషించింది. గ్రూవ్స్‌ మధ్య గాలి కదలిక వల్ల వచ్చే నాయిస్‌ను ఇవి చాలా వరకు నియంత్రించాయి. అందుకే నగరం ఎంత హడావిడిగా ఉన్నా, కారు లోపల మాత్రం ప్రశాంతంగా ఉంది.


Pilot Sport 4 SUV: నగరంలో కంఫర్ట్‌, హైవేల్లో కంట్రోల్‌, ఘాట్స్‌లో గ్రిప్‌


వారాంతంలో, చాలా మంది నగరాన్ని విడిచి బయటకు వెళ్ళాలనుకుంటారు. టెస్ట్‌ ట్రైవ్‌లో, ఎక్స్‌పర్ట్‌లు ముంబై-మహాబలేశ్వర్‌ రోడ్‌ ఎక్కారు. హైవేలు, ఘాట్‌ రోడ్లు, గ్రావెల్‌, బురద.. ఎన్నో రకాల రోడ్ల సెటప్‌ అక్కడ ఎదురైంది. SUVకి Pilot Sport 4 SUV టయర్లు వేసి ఆ రూట్‌లో డ్రైవ్‌ చేసినప్పుడు... ఇవి కేవలం ప్రీమియం టయర్లే కాదు, "ఆల్‌రౌండ్‌ పెర్ఫార్మర్లు" అని స్పష్టమైంది. 


ఈ టయర్ల హైవేపై స్టెబిలిటీ అద్భుతం. స్టీరింగ్‌ చాలా స్టాండర్డ్‌గా స్పందించింది. క్యాబిన్‌ నాయిస్‌ తగ్గిపోవడం హైవే డ్రైవ్‌ను మరింత ఆహ్లాదకరంగా మారింది. ఘాట్‌ రోడ్లలోకి ప్రవేశించిన తర్వాత టయర్ల అసలు శక్తి తెలిసింది. డ్యూయల్‌ స్పోర్ట్‌ ట్రెడ్‌ డిజైన్‌ వల్ల, పొడిగా ఉన్న ప్రాంతాల్లో ఠక్కున గ్రిప్‌ లభిస్తుంది. అదే సమయంలో, లోతైన లాంగిట్యూడినల్‌ గ్రూవ్స్‌ వర్షపు నీటిని సమర్ధవంతంగా బయటకు పంపాయి.


ఈ ట్రిప్‌ చివరిలో వచ్చిన లూజ్‌ గ్రావెల్‌, మట్టి రోడ్లపై కూడా టయర్లు ఎంతో కంఫర్ట్‌గా, కన్ఫిడెంట్‌గా నడిపించాయి. రీఇన్‌ఫోర్స్డ్‌ సైడ్‌వాల్స్‌‌ వాహన బరువును సరైన రీతిలో మేనేజ్‌ చేశాయి. ఈ పనితీరుతో, మంచి రోడ్లపైనే కాకుండా, ఎలాంటి రోడ్డుపై ఎలా స్పందించాలో అలా స్పందించగల సామర్థ్యాన్ని Pilot Sport 4 SUV టయర్లు చూపించాయి.



ఇండియన్‌ రోడ్లకు సరిపోయే టయర్లు


Primacy 4 టయర్లు నగర ప్రయాణాల్లో కంఫర్ట్‌, సైలెన్స్‌, సేఫ్టీని అందిస్తే... Pilot Sport 4 SUV టయర్లు హైవేలు, ఘాట్స్‌, ఆఫ్‌రోడ్‌ ప్యాచెస్‌లో అద్భుతమైన కంట్రోల్‌ను ఇచ్చాయి. ఇవి రేస్‌ట్రాక్‌ కోసం డిజైన్‌ చేసినవి కావు. వాస్తవ ప్రపంచంలో, మన రోడ్లపై నిజమైన పనితీరు ఇవ్వడానికి రూపొందించినవి.


డ్రైవింగ్‌లో రోడ్డుపై ఎలాంటి సర్‌ప్రైజ్‌ ఎదురైనా, సరైన టయర్లు ఉంటే డ్రైవ్‌ ఎప్పుడూ సేఫ్‌, స్మూత్‌, కంఫర్ట్‌గానే ఉంటుంది.


ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.