MG Windsor EV Vs Tata Nexon EV: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ వేగంగా పెరుగుతోంది, నమ్మకమైన, చవకైన, ఫీచర్లతో మంచి కార్ల కోసం వెతుకుతున్న ఫ్యామిలీ సంఖ్య పెరుగుతోంది. అలాంటి వారికి ఈ సెగ్మెంట్‌లో MG Windsor EV, Tata Nexon EV రెండు మంచి ఆప్షన్‌గా చెప్పవచ్చు. అందుకే ఈ రెండింటి మధ్య మార్కెట్‌లో తీవ్ర పోటీ నెలకొంది. ఈ రెండు ఎలక్ట్రిక్ కార్ల మధ్య తేడా ఏమిటో, మీకు ఏది ఉత్తమంగా ఉంటుందో తెలుసుకుందాం.
బడ్జెట్‌లో ఏది మంచిది?
MG Windsor EV ధర 9.99 లక్షల రూపాయల నుంచి ప్రారంభమవుతుంది, కానీ ఇందులో బ్యాటరీ ఉండదు. దీనికి కంపెనీకి చెందిన 'బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్' (BaaS) మోడల్ వర్తిస్తుంది, ఇందులో కస్టమర్ కిలోమీటరుకు ఛార్జ్ చెల్లించాలి. బ్యాటరీతో MG Windsor EVని కొనుగోలు చేయాలంటే 13.50 లక్షల రూపాయల నుంచి 15.50 లక్షల రూపాయల మధ్య ధర చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు, Tata Nexon EV ధర 12.49 లక్షల రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. దాని టాప్ వేరియంట్ 17.19 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఇందులో బ్యాటరీ ఖర్చు ముందుగానే చేర్చి ఉంటారు. ఎటువంటి అదనపు సబ్‌స్క్రిప్షన్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో MG Windsor EV తక్కువ ధరలో అందుబాటులో ఉంది, కానీ Tata Nexon EVలో బ్యాటరీతోపాటు లభించడం అదనపు ప్రయోజనం.
ఎందులో ఎక్కువ లగ్జరీ ఉంది?
MG Windsor EVలో 15.6 అంగుళాల అతి పెద్ద టచ్‌స్క్రీన్, 8.8 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, 360 డిగ్రీ కెమెరా, పనోరమిక్ గ్లాస్ రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు , 135 డిగ్రీల వరకు వెనుకకు వంచగల వెనుక సీట్లు వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. అయితే Tata Nexon EVలో 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్, 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, సింగిల్ పేన్ సన్‌రూఫ్, వైర్‌లెస్ చార్జింగ్, 360 డిగ్రీ కెమెరా , టాప్ వేరియంట్‌లో ఫ్రంట్ స్టోరేజ్ (Frunk) వంటి సౌకర్యాలు ఉన్నాయి, ఇవి టెక్నాలజీ-ఫ్రెండ్లీ కస్టమర్లను ఆకర్షిస్తాయి. MG Windsor EV ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది Tata Nexon EV టెక్నాలజీ విషయంలో స్ట్రాంగ్‌గా ఉంది.
బ్యాటరీ, రేంజ్
MG Windsor EVలో 38 kWh బ్యాటరీ ఉంది, ఇది MIDC ప్రకారం 331 కిమీ రేంజ్ ఇస్తుంది. అయితే Tata Nexon EV రెండు బ్యాటరీ ఆప్షన్లలో వస్తుంది- 30 kWh బ్యాటరీ 275 కిమీ రేంజ్, 45 kWh బ్యాటరీ 489 కిమీ వరకు రేంజ్ ఇస్తుంది. దీని ఆధారంగా చూస్తే, దూర ప్రయాణాలకు Tata Nexon EV 45 kWh వేరియంట్ మంచి ఎంపిక.
ఎవరి ఛార్జింగ్ వేగం ఎంత ?
MG Windsor EVలో 136 PS పవర్, 200 Nm టార్క్ లభిస్తుంది, ఇది 0 నుంచి 100 కిమీ/గంట వేగాన్ని కేవలం 10.5 సెకన్లలో చేరుకుంటుంది. దీనిని 3.3 kW AC ఛార్జర్‌తో పూర్తిగా ఛార్జ్ చేయడానికి సుమారు 13.8 గంటలు పడుతుంది, అయితే 50 kW DC ఫాస్ట్ ఛార్జర్‌తో 20-80% ఛార్జింగ్ కేవలం 55 నిమిషాల్లో పూర్తవుతుంది. మరోవైపు, Tata Nexon EV (45 kWh వేరియంట్)లో 145 PS పవర్, 215 Nm టార్క్ లభిస్తుంది. ఈ కారు 0 నుంచి 100 కిమీ/గంట వేగాన్ని కేవలం 8.9 సెకన్లలో చేరుకుంటుంది. దీనిని 7.2 kW AC ఛార్జర్‌తో 4-6 గంటల్లో, 50 kW DC ఫాస్ట్ ఛార్జర్‌తో 20-80% ఛార్జింగ్ 56 నిమిషాల్లో పూర్తవుతుంది. ఈ విధంగా పనితీరు , ఛార్జింగ్ వేగం రెండింటిలోనూ Tata Nexon EV కొంత మెరుగ్గా ఉంది.