Pawan Kalyan powerful speech: అమరావతి రీ స్టార్ట్ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు. అమరావతి రైతులు గత ఐదేళ్లుగా పోరాడారు .. వారందరికీ అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని మేము మాటిచ్చామన్నారు. అమరావతి కోసం రైతులు 34 వేల ఎకరాల భూములు ఇచ్చారని గుర్తుచేశారు. గత ఐదేళ్లుగా రాజధాని ప్రాంత రైతులు నలిగిపోయారని.వారిపై ఎన్నో దాడులు చేశారనిఅన్నారు. రాజధాని రైతుల పోరాటం మరువలేనిదని స్పష్టం చేశారు. అమరావతి రైతులు ధర్మ యుద్ధంలో గెలిచారు..గత ప్రభుత్వం అమరావతి భవిష్యత్‌ను తుడిచిపెట్టేసిందని విమర్శించారు. అమరావతి రైతులు పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నారని.. మహిళా రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారన్నారు.  


అమరావతి రైతులకు పవన్ కల్యాణ్ భరోసా                 


అమరావతి ఆంధ్రుల రాజధాని గా అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటుందని హామీ ఇస్తున్నానని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. చంద్రబాబు సైబరాబాద్ సిటీని ఎలా రూపకల్పన చేశారో అలాంటి అనుభవంతో దక్షతతో అమరావతిని కూడా అద్భుతమైన నగరాన్ని నిర్మిస్తారని తాను ఆకాంక్షిస్తున్నానని పవన్ కల్యాణ్ అన్నారు. ఉగ్రవాదుల దాడుల కారణంగా  దేశభద్రతకు సంబంధించి ఆయన అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితుల్లో కూడా  ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి సభకు వచ్చారని పవన్ కల్యాణ్ అన్నారు. ధర్మయుద్ధంలో చివరకు గెలుపు అమరావతి రైతులదేనని పవన్ కల్యాణ్ అన్నారు. అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని మాట ఇస్తున్నట్లు సభలో పవన్ కల్యాణ్ ప్రకటించారు.      


ప్రజలే మోదీ కుటుంబం                       


కశ్మీర్ లో ఉగ్రదాడి జరిగి ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని.. పాకిస్తాన్ కు సరైన గుణపాఠం చెప్పబోతున్నారని అన్నారు.  ప్రధాని నరేంద్ర మోడీకి  కుటుంబం లేదని..దేశ ప్రజలే ఆయనకు కుటుంబం అన్నారు.   140 కోట్ల మంది తన కుటుంబమే అనుకుని పరిపాలన చేస్తున్నారని అన్నారు. అమరావతి రైతులు కేవలం రాజధానికి కాదని..రాష్ట్ర భవిష్యత్ కోసం భూములు ఇచ్చారని అన్నారు.


ప్రత్యేకంగా పిలిచి మాట్లాడిన మోదీ       


ప్రసంగం తర్వాత పవన్ కల్యాణ్ ను ప్రధాని మోదీ ప్రత్యేకంగా పిలిచారు. ఓ జోక్ చేశారు.  దాంతో అందరూ నవ్వారు. మోదీ పవన్ కల్యాణ్ వైపు ప్రశంసా పూర్వకంగా చూశారు.             





పెహల్గాం ఉగ్రవాది దాడి తర్వాత దేశం మొత్తం యుద్ధం వైపు వెళ్తోందని.. గుండెల్లో ఎంతో బరువున్నా ప్రధాని అమరావతి వచ్చారన్నారు. ఉగ్రవాద బాధితుల ఆవేదనను నేను ప్రత్యక్షంగా చూశాను..ఉగ్రవాదంపై ప్రధాని కఠినమైన వైఖరి అనుసరిస్తారన్నారు. కనకదుర్గమ్మ ఆశీస్సులతో ప్రధానికి శక్తిని ఇవ్వాలని పవన్ ఆకాంక్షించారు.