MG Windsor EV Price, Down Payment, Loan and EMI Details: ఎంజీ విండ్సర్‌ EV డిజైన్ స్లీక్‌ LED ఫ్రంట్ లైటింగ్ కాంబోను అందిస్తుంది, ఇది ఫ్యూచరిస్టిక్‌ లుక్స్‌కు ప్రత్యేకంగా సరిపోతుంది. ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ఈ ఎలక్ట్రిక్‌ కారుకు అదనపు ఆకర్షణ. పెనోరమిక్ గ్లాస్ రూఫ్ ఇంటీరియర్‌ను ప్రకాశవంతంగా మార్చి ఎయిర్-ఫ్రేష్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది. ఐకానిక్ 18-అలాయ్ వీల్స్ ఈ కారుకు మరో లెవెల్‌ స్టేట్‌మెంట్‌గా నిలుస్తాయి, వాహనం బాహ్య రూపాన్ని ఆకర్షణీయంగా మార్చాయి. మన దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్‌ కారు ఇదే. గత 10 నెలలుగా, ఎలక్ట్రిక్‌ కార్ల సేల్స్‌లో టాప్‌ పొజిషన్‌లో ఉంది. అందుబాటు ధర & ఆధునిక లక్షణాలు ఉన్న ఈ కారు, ప్రీమియం EV విభాగంలో బడ్జెట్-ఫ్రెండ్లీ ఆఫర్‌ కోసం చూస్తున్న కస్టమర్లకు ఇదొక ప్రత్యేక అవకాశం. 

తెలుగు నగరాల్లో MG విండ్సర్ EV ఆన్-రోడ్ ధరMG Windsor EV బేస్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధరను కంపెనీ రూ. 14 లక్షలుగా నిర్ణయించింది. హైదరాబాద్‌లో దీని ఆన్-రోడ్ ధర దాదాపు రూ.14.94 లక్షలు. ఇందులో, కారు రిజిస్ట్రేషన్‌ కోసం దాదాపు రూ. 8,000, బీమా కోసం దాదాపు రూ. 88,000, ఇతర అవసరమైన ఖర్చులు దాదాపు రూ. 15,000 ఉన్నాయి. ఇవన్నీ కలుపుకుని, హైదరాబాద్‌లో ఈ కారుకు ఓనర్‌ కావడానికి ఒక కస్టమర్ దాదాపు రూ. 15.10 లక్షలు (MG Windsor EV on-road price, Hyderabad) ఖర్చు చేయాలి. విజయవాడలో MG Windsor EV ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 15.05 లక్షలు (MG Windsor EV on-road price, Vijayawada). 

2 లక్షల డౌన్ పేమెంట్ చేస్తే EMI ఎంత కట్టాలి?మీరు, హైదరాబాద్‌లో MG Windsor EV బేస్ వేరియంట్ కొనడానికి రూ. 2 లక్షలు డౌన్ పేమెంట్ చేస్తే, మీ క్రెడిట్‌ స్కోర్‌ బాగుంటే, మిగిలిన రూ. 13.10 లక్షలను కార్‌ లోన్‌ రూపంలో బ్యాంక్ అందిస్తుంది. మీరు ఈ కారు రుణాన్ని 7 సంవత్సరాల (84 నెలలు) కాలానికి 9% వడ్డీ రేటుతో పొందారని అనుకుందాం. ఈ లెక్కలను బట్టి, మీరు ప్రతి నెలా దాదాపు రూ. 21,075 EMI చెల్లించాలి.

6 సంవత్సరాల్లో లోన్‌ క్లియర్‌ చేయాలనుకుంటే నెలకు రూ.  23,612 EMI కట్టాలి.

5 సంవత్సరాల్లో లోన్‌ క్లియర్‌ చేయాలనుకుంటే నెలకు రూ. 27,191 EMI కట్టాలి.

4 సంవత్సరాల్లో లోన్‌ క్లియర్‌ చేయాలనుకుంటే నెలకు రూ. 32,597 EMI కట్టాలి.

మొత్తం ఖర్చు ఎంత అవుతుంది?7 సంవత్సరాల EMI ప్లాన్‌ ఎంచుకుని నెలకు రూ. 21,075 EMI చొప్పు చెల్లిస్తే, ఏడేళ్లలో (84 నెలలు), అసలు కాకుండా, దాదాపు రూ. 4.60 లక్షల వడ్డీ చెల్లిస్తారు. కారు ఆన్-రోడ్ ధరకు ఈ వడ్డీని కూడా కలిపితే, ఈ కారు మొత్తం ఖర్చు మీకు దాదాపు రూ. 19.70 లక్షలు అవుతుంది.

MG విండ్సర్ EV డ్రైవింగ్‌ రేంజ్‌38-kWh బ్యాటరీ ప్యాక్‌తో, MG విండ్సర్ EV 331 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ప్రో వేరియంట్‌లో 52.9 kWh బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది, ఇది 449 కిలోమీటర్ల ARAI-సర్టిఫైడ్ రేంజ్‌ ఇస్తుంది.

MG విండ్సర్ EV కి ప్రత్యామ్నాయ కార్లుభారత మార్కెట్లో, MG విండ్సర్ EV కి ప్రత్యామ్నాయ ఎలక్ట్రిక్‌ కార్లు కూడా ఉన్నాయి. Tata Curvv EV, Mahindra BE6 & Hyundai Creta EV వాటిలో ప్రధానమైనవి. స్టైలిష్ డిజైన్, బలమైన రేంజ్‌ & అందుబాటు EMI ఆప్షన్స్‌ MG విండ్సర్ EV కి పాపులారిటీ పెంచాయి.