Most expensive number plate India 2025: లగ్జరీ కారుకు ఓనర్‌ కావాలనేది చాలా మంది కల. దేశంలోని పెద్ద సెలబ్రిటీలు & వ్యాపారవేత్తలు ఖరీదైన కార్లు కొని, అప్పుడప్పుడు వార్తల్లోకి వస్తుంటారు. అయితే, కారు మాత్రమే కాదు, ఆ కారుకు బిగించే రిజిస్ట్రేషన్ నంబర్ (VIP నంబర్ ప్లేట్) కూడా ప్రతిష్టను పెంచుతుంది. మహేంద్ర సింగ్ ధోని, షారుఖ్ ఖాన్, ముఖేష్ అంబానీ వంటి ప్రముఖుల కార్లకు ఉండే ప్రత్యేక నంబర్ ప్లేట్ల గురించి మీరు తరచుగా వింటూనే ఉంటారు. అయితే, ఈ స్టార్లకు దేశంలో అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్ లేదని మీకు తెలుసా?. ఈ కీర్తి కిరీటం, కేరళకు చెందిన టెక్ కంపెనీ CEO వేణు గోపాలకృష్ణన్‌కు దక్కింది.

వీఐపీ నంబర్ ప్లేట్‌ కోసం రూ. 47 లక్షల ఖర్చులిట్మస్7 కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (CEO) వేణు గోపాలకృష్ణన్‌కు లగ్జరీ కార్లంటే ఇష్టం. ఇటీవల, తన కార్ల కలెక్షన్‌లో కొత్త లగ్జరీ SUV ని జోడించారు. ఆయన దాదాపు రూ. 4.2 కోట్ల విలువైన మెర్సిడెస్-బెంజ్ G63 AMG కారును కొనుగోలు చేశారు. అయితే, ఆ కారు కంటే ఆ కారు నంబర్ ప్లేటే ఇప్పుడు వైరల్‌ న్యూస్‌ అయి కూర్చుంది. వేణు గోపాలకృష్ణన్‌ కొత్త మెర్సిడెస్-బెంజ్ కారు రిజిస్ట్రేషన్ నంబర్ KL 07 DG 0007. ఈ ప్రత్యేకమైన నంబర్ కోసం లిట్మస్7 CEO రూ. 47 లక్షలు చెల్లించారు. ఇది ఇప్పటివరకు దేశంలోనే అత్యంత ఖరీదైన వెహికల్‌ నంబర్ ప్లేట్‌గా మారింది. 

మెర్సిడెస్-బెంజ్ G63 AMGతన SUV ని చాలా ప్రత్యేకంగా చూపడానికి వేణు గోపాలకృష్ణన్ శాటిన్ మిలిటరీ గ్రీన్ కలర్‌ను ఎంచుకున్నారు, ఇది కారుకు ఒక రాయల్ & పవర్‌ఫుల్ లుక్‌ ఇస్తుంది. ఈ కారుకు గ్లాస్ బ్లాక్ అల్లాయ్ వీల్స్ & ప్రీమియం లెదర్ ఫినిష్డ్ ఇంటీరియర్‌ ఉన్నాయి. వెనుక సీటు ప్రయాణీకుల కోసం డ్యూయల్ స్క్రీన్ సీట్ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్యాకేజీని కూడా ఏర్పాటు చేశాడు. ఈ కారులో 4.0-లీటర్ ట్విన్-టర్బోచార్జ్‌డ్‌ V8 ఇంజిన్ ఉంది, ఇది 585 bhp పవర్ & 850 Nm పీక్‌ టార్క్ ఇస్తుంది. ఇది 9-స్పీడ్ DCT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఈ ట్రాన్స్‌మిషన్‌.. కారు వేగాన్ని, మృదువైన డ్రైవింగ్‌ రెండింటినీ ఇది అద్భుతంగా బ్యాలెన్స్‌ చేస్తుంది.

 ఆసక్తికరమైన విషయం ఏంటంటే?భారతదేశంలో VIP నంబర్ ప్లేట్లకు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. మనసుకు నచ్చిన & సెంటిమెంట్‌ నంబర్‌ కోసం వేలు, లక్షలు ఖర్చు పెట్టడానికి వాహన యజమానులు వెనుకాడడం లేదు. రూ. 47 లక్షలు పోసి వేణు గోపాలకృష్ణన్ కొన్న KL 07 DG 0007 నంబర్ ప్లేట్ దేశ చరిత్రలోనే ఇప్పటి వరకు అత్యంత ఖరీదైన VIP నంబర్‌. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కార్‌ నంబర్‌ ప్లేట్‌లోనే కాదు, ఆయన కంపెనీ పేరులో, VIP నంబర్‌ కోసం చెల్లించిన ధరలో కూడా '7' అంకె ఉంది.