2025 MG Hector Facelift: భారతీయ లగ్జరీ SUV సెగ్మెంట్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న MG హెక్టర్ ఇప్పుడు కొత్త ఫేస్‌లిఫ్ట్ అవతార్‌లో అందుబాటులోకి వచ్చింది. తాజాగా లాంచ్ అయిన ఈ కొత్త MG హెక్టర్ ధరలు కేవలం రూ.11.99 లక్షల నుంచి ప్రారంభమవుతాయి, హైయ్యర్ వేరియంట్‌కు రూ.19.49 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ కొత్త హెక్టర్, తన పాత మోడల్‌తో పోలిస్తే కనీసం రూ.1.55 లక్షల వరకు తక్కువకే వస్తోంది. మరి కొత్త మోడల్‌లో ఏం మారింది? ఏం అలాగే కొనసాగింది?.
కొత్త MG హెక్టర్ vs పాత మోడల్: ఎక్స్‌టీరియర్ మార్పులు
కొత్త MG హెక్టర్‌ను ఒక్కసారి చూస్తే పెద్దగా మారినట్టు అనిపించకపోయినా, కాస్త గమనిస్తే ఫ్రంట్ గ్రిల్ డిజైన్‌లో స్పష్టమైన తేడా కనిపిస్తుంది. పాత మోడల్‌లో ఉన్న డైమండ్ ప్యాటర్న్ స్థానంలో ఇప్పుడు హెక్సాగనల్ క్రోమ్ ఎలిమెంట్స్‌తో కొత్త గ్రిల్ ఇచ్చారు. ఇది SUVకి మరింత ప్రీమియం లుక్ ఇస్తోంది.
స్లిమ్ LED DRLs, ట్విన్-పాడ్ LED హెడ్‌ల్యాంప్స్ మాత్రం పాత మోడల్ నుంచే కొనసాగిస్తున్నారు. బంపర్ డిజైన్ కూడా దాదాపు అదేలా ఉన్నా, ఎయిర్ డ్యామ్ చుట్టూ క్రోమ్ సరౌండ్స్‌తో చిన్న మార్పు చేశారు.
సైడ్ ప్రొఫైల్‌లో పెద్ద మార్పులేమీ లేవు. అయితే, 18-ఇంచ్ అలాయ్ వీల్స్‌కు కొత్త డిజైన్ ఇచ్చారు. వీల్ ఆర్చ్‌లు, డోర్ కింద భాగాల్లో బ్లాక్ క్లాడింగ్ అలాగే కొనసాగుతోంది. ఈసారి రెండు కొత్త కలర్ ఆప్షన్లు కూడా వచ్చాయి – సెలాడాన్ బ్లూ, పెర్ల్ వైట్. వీటితో కలిపి మొత్తం ఐదు ఎక్స్‌టీరియర్ కలర్స్ లభిస్తాయి.
వెనుక భాగంలో కనెక్టెడ్ LED టెయిల్‌ల్యాంప్స్, స్పాయిలర్ అలాగే ఉన్నాయి. అయితే రియర్ బంపర్‌పై క్రోమ్ బార్‌తో స్వల్ప రీడిజైన్ చేశారు.
ఇంటీరియర్‌లో కొత్తగా ఏం వచ్చింది?
ఇంటీరియర్ విషయంలో MG పెద్దగా ప్రయోగాలు చేయలేదు. అయితే, వాడుకలో ఉపయోగపడే చిన్న అప్‌డేట్స్ ఇచ్చింది. 14-ఇంచ్ పోర్ట్రెయిట్ టచ్‌స్క్రీన్ పాత మోడల్ నుంచే కొనసాగుతున్నా... AC, ఆడియో కోసం స్వైప్ జెస్చర్స్ ఇచ్చారు. పాత మోడల్‌లో ఇవి లేవు.
ఇంటీరియర్ థీమ్‌ల విషయానికి వస్తే...
5-సీటర్ హెక్టర్‌కు గ్రే & బ్లాక్ థీమ్
హెక్టర్ ప్లస్‌కు టాన్ & బ్లాక్ థీమ్
లెదరెట్ సీట్స్, లెదరెట్ స్టీరింగ్ వీల్, సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ కూడా అలాగే కొనసాగుతున్నాయి.
ఫీచర్లు, సేఫ్టీ – మార్పులేమీ లేవు
ఫీచర్ల విషయంలో కొత్త హెక్టర్ పాత మోడల్‌లానే ప్యాక్ అయి ఉంది. ఇందులో...
7-ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే
పానోరమిక్ సన్‌రూఫ్
వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్
వెంటిలేటెడ్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు
ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
రెండో, మూడో వరుసకి ప్రత్యేక వెంట్స్
కూల్డ్ గ్లౌవ్‌బాక్స్
సేఫ్టీ విషయంలో కూడా MG రాజీ పడలేదు. 6 ఎయిర్‌బ్యాగ్స్ స్టాండర్డ్, 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటర్, ISOFIX మౌంట్స్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేక్స్, లెవల్-2 ADAS ఉన్నాయి.
ఇంజిన్ ఆప్షన్లు
ప్రస్తుతం కొత్త MG హెక్టర్ 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తోనే అందుబాటులో ఉంది. ఇది 143hp పవర్, 250Nm టార్క్ ఇస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్, CVT ఆప్షన్లు ఉంటాయి. పాత మోడల్‌లో ఉన్న డీజిల్ ఇంజిన్‌ను MG 2026లో మళ్లీ తీసుకురానుంది.
ధరల్లో అసలు షాక్
కొత్త హెక్టర్‌లో అసలు హైలైట్ ఇదే. 5-సీటర్ వెర్షన్ కనీసం రూ.1.55 లక్షలు, హెక్టర్ ప్లస్ రూ.1.63 లక్షలు వరకు చౌకగా మారాయి. మొత్తం మీద చూస్తే, ఫేస్‌లిఫ్ట్‌తో హెక్టర్ రూ.2.18 లక్షల వరకు తక్కువలో అందుబాటులోకి వచ్చింది.
ముగింపు
పూర్తిగా కొత్తదనం కాకపోయినా, ధర తగ్గింపు, స్టైలింగ్ టచ్‌లు, ఫీచర్ల అప్‌డేట్స్‌తో కొత్త MG హెక్టర్ ఇప్పుడు మరింత 'వాల్యూ ఫర్ మనీ'గా మారింది. లగ్జరీ SUV కోసం చూస్తున్నవారికి ఇది మరోసారి బలమైన ఆప్షన్‌గా నిలుస్తోంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.