Upcoming Electric SUVs : 2026 రెండో త్రైమాసికంలో భారత ఆటోమొబైల్ రంగం అనూహ్యమైన మార్పులకు సాక్ష్యంగా నిలుస్తోంది. మొదటి మూడు నెలల్లో ఇప్పటికే పలు దిగ్గజ కంపెనీలు తమ సరికొత్త, అప్‌డేటెడ్ వెర్షన్‌లను మార్కెట్‌లోకి విడుదల చేశాయి. ఏప్రిల్ నెలలో రద్దీగా సాగిన లాంచ్‌ల పరంపర తర్వాత, ఇప్పుడు మే నెలలో మరిన్ని వినూత్నమైన వాహనాలను అందించడానికి కార్ల తయారీ సంస్థలు సిద్ధమయ్యాయి.
టయోటా ఇబెల్లా
టయోటా నుంచి వస్తున్న తొలి ఈవీ ఎస్యూవీ. మారుతి సుజుకి తన ఎలక్ట్రిక్ ప్రయాణాన్ని ప్రారంభించిన తర్వాత, ఇప్పుడు టయోటా కూడా భారత్ మార్కెట్‌లో తన మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఈ వాహనానికి టయోటా ఇబెల్లా అని పేరు పెట్టారు. వాస్తవానికి ఇది మారుతి సుజుకి eవిటారా రీబ్యాడ్జ్ వెర్షన్ అయినప్పటికీ, టయోటా దీనికి ప్రత్యేకమైన బాహ్య రూపకల్పనను అందించింది. ఇది ఎస్‌యూవీకి ఒక విశిష్టమైన రూపాన్ని స్వభావాన్ని ఇస్తుంది.
Also Read:హైవేలపై క్యూలకు స్వస్తి! భారత్‌లోనే తొలి బారియర్ లెస్ టోల్ ప్లాజా ప్రారంభం!
టయోటా ఇబెల్లా వినియోగదారులకు అత్యున్నత స్థాయి సౌకర్యాలను అందించనుంది. ఇందులో 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.1 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 10-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా ఇందులో ఫిక్స్‌డ్ పనోరమిక్ గ్లాస్ రూప్, 10 స్పీకర్ల జేబీఎల్ ఆడియో సిస్టమ్ వంటి ప్రీమియం సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి.
ఇబెల్లా రెండు రకాల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌లతో వస్తుంది. మొదటిది 49kWh బ్యాటరీ. ఇది 144 పీఎస్ శక్తిని, 189 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని రేంజ్ సుమారు 440 కిలోమీటర్లుగా ఉంటుంది. రెండోది 61kWh బ్యాటరీ 174 పీఎస్ శక్తిని, 189Nm టార్క్‌ను అందిస్తుంది. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 543 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఈ వాహనం వచ్చే నెలలలో మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది.
Also Read:భారత్‌లో అత్యంత తక్కువ ధరలో లభించే టాప్ 5 టర్బో పెట్రోల్ ఎస్‌యూవీలు! లో బడ్జెట్‌లో పవర్‌ఫుల్ కార్లు!
హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్
హోండా సంస్థ తన అత్యంత ప్రజాదరణ పొందిన సిటీ సెడాన్‌కు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించిన స్పై షాట్లు ఇప్పటికే బ్రెజిల్‌లో బయటపడ్డాయి. కొత్త వెర్షన్‌లో ఫ్రంట్ గ్రిల్, హెడ్ ల్యాంప్‌లు, బంపర్, అల్లాయ్ వీల్స్, టెయిల్ ల్యాంప్‌లలో కీలక మార్పులు ఉంటాయి.
Also Read:మైలేజ్ ఇచ్చే బెస్ట్ మిడ్ సైజ్ ఎస్‌యూవీలు ఇవే! లీటర్ కు 28 కిమీ ఇచ్చే హైబ్రిడ్ కార్ల లిస్ట్
ఈ ఫేస్‌లిఫ్ మోడల్‌లో లెవల్ 2 అడాస్ , సీట్ వెంటిలేషన్, ఎలక్ట్రిక్ సిటీ అడ్జస్ట్‌మెంట్లు, సన్‌రూఫ్ వంటి పీచర్లు తోడువుతాయి. ఇంజిన్ పరంగా ఇందులో మునుపటి 1.5లీటర్ల నేచచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5 లీటర్ల స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్లే కొనసాగుతాయి. పెట్రోల్ ఇంజిన్ మాన్యువల్, సీవీటీ గేర్ బాక్స్‌లతో రాగా, హైబ్రిడ్ మోడల్ ఇసీవీటీ గేర్‌బాక్స్‌తో వస్తుంది. దీనిని మే 22న విడుదల చేసే అవకాశం ఉంది.
హోండా ZR-V
హోండా నుంచి మే 22నే రానున్న మరో కీలక ఉత్పత్తి ZR-V. ఇది మిడ్‌సైజ్ ఏస్‌యూవీ విభాగంలో అంతర్జాతీయంగా సీఆర్‌వీ కింద స్థానాన్ని కలిగి ఉంది. భారత్‌లో దీనిని సీబీయూ రూపంలో దిగుమతి చేయడం వల్ల దీని ధర కొంత ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది.
ZR-V కేవలం హైబ్రిడ్ వెహికల్‌గా మాత్రమే అందుబాటులోకి రానుంది. ఇందులో 2.0 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ అట్కిన్స్‌న్- సైకిల్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. దీనికి e-CVT గేర్ బాక్స్ జత చేస్తారు. ఫీచర్లపరంగా గూగుల్ అసిస్టెంట్, 9- అంగుళాల టచ్‌స్క్రీన్, హోండా సెన్సింగ్, 12-స్పీకర్ల బోస్ ప్రీమియం ఆడియో సిస్టమ్, మల్టీ- జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటివి ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి.
టాటా సియెరా ఈవీ
టాటా మోటార్స్ తన ఐకానికి సియెరాను ఎలక్ట్రిక్ రూపంలో 2026 రెండో త్రైమాసికంలో లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. టెస్టింగ్ సమయంలో కనిపించిన వివరాల ప్రకారం, ఈ ఈవీ వెర్షన్‌లో ప్రత్యేకమైన బంపర్, క్లోజ్డ్ గ్రిల్, ఈవీ స్పెసిఫిక్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి.
సియెరా ఈవీలో హారియర్ ఈవీ తరహాలోనే 65kWH, 75 kWh బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగిచనున్నారు. ఇది RWD, AWD కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. లోపలి భాగంగా ట్రిపుల్ డిస్‌ప్లే సెటప్, ఈవీ స్పెసిఫిక్ యూజర్ ఇంటర్‌ఫేస్ వంటి అత్యాధునిక అంశాలు ఉంటాయి.
ఎంజీ మెజస్టర్
ఎంజీ మోటార్స్ గతంలోనే ఆవిష్కరించిన మెజస్టర్ ఎస్‌యూవీ మే నెలలో ధరల ప్రకటనో లాంచ్ కానుంది.ఇది డీ+సెగ్మెంట్ ఎస్‌యూవీగా వస్తుంది. ఆఫ్ రోడింగ్ ప్రియుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు.
మెజస్టర్‌లో మూడు డిఫరెన్షియల్ లాక్స్ సెలెక్టబుల్‌్ స్పీడ్స్‌్తో కూడిన క్రాల్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీనికి 2.0 లీటర్ ట్విన్- టర్బో చార్జ్డ్ డీజిల్ ఇంజిన్ శక్తినిస్తుంది. ఇది 213hp పవర్, 479Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషనతో వస్తుంది..
మే 2026 నెల భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వానాలు, ప్రీమియం ఎస్‌యూవీల ఆధిపత్యాన్ని సూచిస్తోంది. వినియోగదారులకు ఇప్పుడు సెడాన్ల నుంచి భారీ ఆఫ్ రోడర్ల వరకు విభిన్న ఎంపికలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ కొత్త లాంచ్‌లు కేవలం సాంకేతికతనే కాకుండా, పర్యావరణహితమైన ప్రయాణాన్ని ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తున్నాయి.
