Mahindra Ev Car Delivary Latest News:  నిల‌క‌డ‌లేని పెట్రో ధ‌ర‌లు, ఈ20 పెట్రోల్ వినియోగంతో ప్ర‌స్తుతం ఈవీ వాహ‌నాల‌పై చాలామంది దృష్టి నెల‌కొంది. ముఖ్యంగా ఈవీల‌కు పేరెన్నిక‌గ‌ల మ‌హీంద్రా వాహ‌నాల‌కు డిమాండ్ చాలా ఉంది. అయితే డిమాండ్ కు త‌గిన‌ట్లుగా స‌ప్లై లేక పోవ‌డంతో కార్ ల‌వ‌ర్స్ డెలీవ‌రీ కోసం కొంత‌కాలం వెయిట్ చేస్తున్నారు.  ఎలక్ట్రిక్ కార్లు లేదా వాహనాలు (EVs) ప్రస్తుతం కొత్తగా కార్లు కొనుగోలు చేస్తున్నవారికి ,మళ్లీ కొనుగోలు చేసే వినియోగదారులకు ప్రాధాన్యతగా మారుతున్నాయి. ఇటీవల సంవత్సరాలలో EVలు కేవలం బ్యాటరీతో నడిచే వాహనాలుగా కాకుండా, టాటా , మహీంద్రా వంటి పలు బ్రాండ్ల వాహనాలు నయా టెక్నాలజీ ఉన్న వాహనాలుగా రూపాంతరం చెందాయి. సెప్టెంబర్ 2025లో మహీంద్రా కంపెనీకి చెందిన మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఒకదాన్ని కొనుగోలు చేయాలనుకుంటే, దానికోసం ఎంతసేపు వేచి ఉండాలో వివిధ న‌గరాల వారిగా ప‌రిశీలించిన‌ట్ల‌యితే, ఆశ్చ‌ర్య‌క‌ర విశేషాలు తెలుస్తాయి.  మహీంద్రా BE 6, Mahindra XEV 9e,  Mahindra XUV400 కి సంబంధించి వేరియంట్ ను బ‌ట్టి, కార్ల డెలీవ‌రి ఆధార‌ప‌డి ఉంది.  డిల్లీలో 2-3 నెలలు, బెంగళూరులో 2-3 నెలలు  2 నెలలు, ముంబైలో 4-5 నెలలు , 2 నెలలు, హైదరాబాద్‌లో 2-3 నెలలు , 1-1.5 నెలలు వెయిట్ చేయాల్సి ఉంది. 

Continues below advertisement


వివిధ న‌గ‌రాల్లో..
ఇక మిగ‌తా న‌గ‌రాల‌ను ప‌రిశీలించిన‌ట్ల‌యితే ఇక్క‌డ కూడా వేరియంట్ ను బ‌ట్టి డెలీవ‌రి టైమ్ అనేది మారుతూ ఉంది.  పుణెలో 2-3 నెలలు  1-2 నెలలు, చెన్నైలో 2-3 నెలలు , 2.5 నెలలు, జైపూర్, అహ్మదాబాద్, గురుగ్రాం, లక్నో, కోల్‌కతా, థానే, ఇండోర్, నోయిడా వంటి నగరాల్లో BE 6 మరియు XEV 9eకి 2-3 నెలల వెయిటింగ్ ఉండగా, XUV400కి సగటున 1.5 నుండి 2 నెలల మధ్యలో వెయిటింగ్ టైం ఉంది. ప్రత్యేకంగా ముంబైలో BE 6 , XEV 9e వాహనాల కోసం గరిష్ఠంగా 4-5 నెలల పాటు వేచి ఉండాల్సి ఉంటుంది. అదే సమయంలో, Mahindra XUV400 వాహనం కోసం చెన్నై, గురుగ్రామ్, కోయంబత్తూరు వంటి నగరాల్లో గరిష్ఠంగా 2.5 నెలల పాటు వేచి ఉండాల్సి ఉంటుందని తెలుస్తోంది.


కొన్ని చోట్ల త‌క్కువే..
అయితే కొన్ని న‌గ‌రాల్లో వెయిటింగ్ టైం అనేది కాస్త త‌క్కువ‌గా ఉంది. డిమాండ్, స‌ప్లై అనే సూత్రాన్ని బట్టి ఈ వెయిటింగ్ టైం అనేది మారుతోంది.  కనీస వెయిటింగ్ టైం డిల్లీ, హైదరాబాద్, పుణె, పాట్నా వంటి నగరాల్లో కేవలం 1 నెల మాత్రమే ఉంది. అయితే, వెయిటింగ్ టైం అనేది ఎంపిక చేసిన వేరియంట్ , కలర్‌పై ఆధారపడి మారవచ్చని కంపెనీ తెలుపుతోది. . అందువల్ల, మీరు ఎంచుకున్న మోడల్‌కు సంబంధించి ఖచ్చితమైన సమాచారం కోసం దగ్గరలో ఉన్న మహీంద్రా డీలర్‌షిప్‌ను సంప్రదించడం ఉత్తమం అనేది నిపుణులు సూచిస్తున్నారు. ఏదేమైనా పెట్రో ధ‌ర‌ల పెరుగుద‌ల‌, ఈ20 ర‌గ‌డతో ఈవీ వాహ‌నాల‌కు కాస్త డిమాండ్ పెరిగింద‌నేది ఈ రంగ నిపుణులు చెబుతున్నారు.