మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ (Maruti Suzuki Wagon R) భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఒకటి. గత కొన్నేళ్లుగా ఈ కారు మధ్యతరగతి కుటుంబాలకు మరియు ఆఫీసులకు వెళ్లేవారికి మొదటి ఎంపికగా నిలుస్తోంది. కంపెనీ దీని భద్రతను పెంచుతూ ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌ల స్టాండర్డ్ ఫీచర్‌ను కూడా అప్‌డేట్ చేసింది, దీనితో ఇది మునుపటి కంటే మరింత సురక్షితంగా మారింది.

Continues below advertisement

ఢిల్లీలో Wagon R బేస్ LXI పెట్రోల్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర 4.98 లక్షల రూపాయల నుండి ప్రారంభమవుతుంది. RTO, ఇన్సూరెన్స్, ఇతర ఖర్చులను కలిపిన తర్వాత దీని ఆన్-రోడ్ ధర సుమారు 5.63 లక్షల రూపాయలు అవుతుంది. హైదరాబాద్‌లో R బేస్ LXI ఎక్స్ షోరూమ్ ధర రూ. 4,98,900. కాగా ఆన్ రోడ్ ధర రూ. 5,94,256 అవుతుంది. వేర్వేరు నగరాలు, వేరియంట్‌లను బట్టి ధరలో స్వల్ప తేడాలు ఉంటాయి. మీ క్రెడిట్ స్కోర్ బాగుంటే, మీరు ఈ కారును కేవలం రూ. 50,000 డౌన్ పేమెంట్ చెల్లించి కూడా కొనుగోలు చేయవచ్చు.

ప్రతి నెలా EMI ఎంత ఉంటుంది?ఒకవేళ మీరు 50 వేల రూపాయల డౌన్ పేమెంట్ చెల్లించి మారుతి వాగన్ ఆర్ కారును కొనుగోలు చేస్తే, ఆ తర్వాత సుమారు రూ. 5.13 లక్షల కార్ లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు 9 శాతం వడ్డీ రేటుతో 5 ఏళ్ల కాలపరిమితికి లోన్ తీసుకున్నారని అనుకుంటే, ప్రతి నెలా మీ EMI సుమారు 10,664 అవుతుంది. మొదటిసారి కారు కొనేవారికి ఇది సరైన ఎంపికగా చెప్పవచ్చు. 

Continues below advertisement

Wagon Rలో 1.0 లీటర్ పెట్రోల్, 1.2 లీటర్ పెట్రోల్, 1.0 లీటర్ పెట్రోల్+CNG ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్ వెర్షన్ లీటరుకు మైలేజీ సుమారు 25.19 కి.మీ ఇస్తుంది. CNG వెర్షన్ ఒక కిలోకు సుమారు 34.05 కి.మీ వరకు మైలేజీని ఇస్తుందని కంపెనీ తెలిపింది. ఇందులో మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు రెండూ ఉన్నాయి. దీనివల్ల సిటీస్, హైవేలలో వాగర్ ఆర్ సులభంగా నడపవచ్చు.

మారుతి వ్యాగన్ ఆర్ (Maruti WagonR) ఫీచర్లు ఎలా ఉన్నాయి?ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో 7 అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్ ఇచ్చారు. ఇది Android Auto, Apple CarPlayని సపోర్ట్ చేస్తుంది. ఇది కాకుండా కీలెస్ ఎంట్రీ, పవర్ విండోస్,  341 లీటర్ల పెద్ద బూట్ స్పేస్ కూడా ఇచ్చారు. సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు ABS, EBD, ESP, రియర్ పార్కింగ్ సెన్సార్లు, రియర్ కెమెరా వంటి సౌకర్యాలు కూడా లభిస్తాయి.