Maruti Victoris vs Toyota Hyryder SUV Comparison: ఈ మధ్య SUV మార్కెట్‌లో రెండు కొత్త పేర్లు బాగా హైలైట్ అవుతున్నాయి, అవి - మారుతి విక్టోరిస్, టయోటా హైరైడర్. ఈ రెండు కాంపాక్ట్ SUVలు జాయింట్‌గా డెవలప్ చేసిన మోడల్స్ అయినా, మార్కెట్లో కస్టమర్లను ఆకర్షించే విధానం వేరు. మరి, ఈ రెండు సరికొత్త SUVల్లో ఏది మీ బడ్జెట్, స్టైల్, అవసరాలకు సరిపోతుందో తెలుసుకుందాం.
ధరలు
మొదట ధరల విషయానికి వస్తే, విక్టోరిస్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు ₹9.75 లక్షల నుంచి మొదలై ₹20 లక్షల వరకు ఉంటుంది. హైరైడర్ మాత్రం ₹12.65 లక్షల ఎక్స్-షోరూమ్ వద్ద స్టార్ట్ అవుతుంది, ₹20.19 లక్షల వరకు ఉంటుంది. ఈ రెండు మోడల్స్‌లోనూ పలు వేరియంట్లు అందుబాటులో ఉండటంతో, బడ్జెట్ ఆధారంగా ఎంపిక చేసుకోవచ్చు.
డైమెన్షన్స్ & స్పేస్
విక్టోరిస్ పొడవు 4,360 mm, వెడల్పు 1,795 mm, ఎత్తు 1,655 mm, వీల్‌బేస్ 2,600 mm. హైరైడర్ డైమెన్షన్స్ కూడా దాదాపు దీనికి అతి దగ్గరగానే ఉన్నాయి. కానీ, హైరైడర్‌లో బూట్ స్పేస్ కాస్త ఎక్కువగా ఉండటంతో, లాంగ్ ట్రిప్స్‌కి ఉపయోగపడుతుంది. ఫ్యామిలీ యూజ్ కోసం చూసే వారికి స్పేస్ ఇంపార్టెంట్ పాయింట్.
ఇంజిన్ & పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్
విక్టోరిస్ & హైరైడర్ రెండింటిలోనూ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ వస్తుంది. విక్టోరిస్‌లో మైల్డ్ హైబ్రిడ్, CNG వేరియంట్‌లు కూడా ఉన్నాయి. హైరైడర్‌లో మాత్రం స్ట్రాంగ్ హైబ్రిడ్ ఆప్షన్ కూడా ఉంది, ఇది మంచి మైలేజ్‌తో పాటు ఫ్యూచర్ ప్రూఫ్ టెక్నాలజీ అనిపిస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ రెండింట్లోనూ అందుబాటులో ఉన్నాయి.
మైలేజ్
మైలేజ్ విషయానికి వస్తే, ARAI సర్టిఫై చేసిన ప్రకారం, హైరైడర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్ లీటరకు 27+ km వరకు ఇస్తుంది. విక్టోరిస్ మైల్డ్ హైబ్రిడ్ లీటరుకు 20+ km ఇస్తే, CNG వేరియంట్ కిలోగ్రాముకు 26+ km మైలేజ్ ఇస్తుంది. ఎక్కువ డ్రైవ్ చేసే వారికి ఫ్యూయల్ ఎఫిషియన్సీ పెద్ద ప్లస్.
ఫీచర్లు & టెక్నాలజీ
విక్టోరిస్ & హైరైడర్ రెండింటిలోనూ పానోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా, వెంట్‌లేటెడ్ సీట్స్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, కనెక్టెడ్ కార్ టెక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే హైరైడర్‌లో స్ట్రాంగ్ హైబ్రిడ్, ఆల్‌వీల్ డ్రైవ్ ఆప్షన్ ఉండటం వల్ల కాస్త ప్రీమియం ఫీలింగ్ ఇస్తుంది. విక్టోరిస్ మాత్రం అందుబాటు ధరపై దృష్టి పెట్టింది.
సేఫ్టీ
ఈ రెండు SUVల్లోనూ 6 ఎయిర్‌బ్యాగ్స్, ABS, EBD, ESP, హిల్ అసిస్ట్, టయర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ లాంటివి అందించారు. GNCAP రేటింగ్స్ ఇంకా ఫైనల్ కాలేదు కానీ, సేఫ్టీ ఫీచర్లు బలంగా ఉన్నాయి.
తుది మాట
మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ SUV కావాలనుకుంటే, విభిన్న ఆప్షన్స్ (CNG, మైల్డ్ హైబ్రిడ్) ఉన్న మారుతీ విక్టోరిస్ బెస్ట్ ఆప్షన్. నూతన టెక్నాలజీ, స్ట్రాంగ్ హైబ్రిడ్, ఆల్‌వీల్ డ్రైవ్ అనుకుంటే టయోటా హైరైడర్ మీకు సరిపోతుంది.