Maruti Victoris Price, Down Payment, Car Loan and EMI Details: మారుతి సుజుకి, తన కొత్త హైబ్రిడ్ SUV - మారుతి విక్టోరిస్‌ను మన మార్కెట్లో విడుదల చేసింది. ఇది పెట్రోల్, CNG & హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌లతో వచ్చింది. మారుతి విక్టోరిస్‌ ప్రారంభ ధర రూ. 10.50 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించారు. ఈ కారు కోసం బుకింగ్స్‌ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. తక్కువ ధర & అధిక మైలేజ్ కారణంగా ఈ SUV బాగా ప్రాచుర్యం పొందుతోంది, బుకింగ్స్‌ బాగానే వస్తున్నాయి. విక్టోరిస్‌ కోసం ఒకేసారి మొత్తం డబ్బు చెల్లించాల్సిన అవసరం లేకుండా, కార్‌ లోన్‌ మీద కూడా ఈ కారును కొనవచ్చు. దీనికోసం EMI లెక్కను ముందుగానే అర్ధం చేసుకోవడం మంచిది.

మారుతి విక్టోరిస్ ఆన్-రోడ్ ధరతెలుగు రాష్ట్రాల్లో మారుతి విక్టోరిస్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.50 లక్షల నుండి ప్రారంభమై టాప్ వేరియంట్‌కు రూ. 19.99 లక్షల వరకు ఉంటుంది. ఇది LXi, VXi, ZXi, ZXi(O), ZXi+ & ZXi+(O) వంటి ఆరు వేరియంట్లలో లభిస్తుంది. మీరు హైదరాబాద్‌లో విక్టోరిస్ బేస్ మోడల్ (LXi)ని కొనుగోలు చేస్తే, ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 13.11 లక్షల వరకు ఉంటుంది. ఇందులో RTO ఛార్జీలు దాదాపు రూ. 1.97 లక్షలు, బీమా దాదాపు రూ. 53,000 & ఇతర పన్నులు ఉంటాయి.విజయవాడలో ఇదే వేరియంట్‌ను కొనుగోలు చేయాలంటే RTO ఛార్జీలు దాదాపు రూ. 1.87 లక్షలు, బీమా దాదాపు రూ. 52,000 & ఇతర పన్నులు కలుపుకుని, ఆన్‌-రోడ్‌ ధర దాదాపు రూ. 12.99 లక్షలు అవుతుంది.

ఎంత డౌన్ పేమెంట్ అవసరం అవుతుంది?తెలుగు రాష్ట్రాల్లో మీరు మారుతి విక్టోరిస్ కొనాలనుకుంటే కనీసం రూ. 2.50 లక్షల డౌన్ పేమెంట్ చెల్లించాలి. ఉదాహరణకు, విజయవాడలో కొనాలనుకుంటే, రూ. 2.50 లక్షల డౌన్ పేమెంట్‌ తర్వాత దాదాపు రూ. 10.49 లక్షల కార్‌ లోన్‌ తీసుకోవాలి. బ్యాంక్‌ ఈ రుణాన్ని 9% వార్షిక వడ్డీ రేటుతో ఇచ్చిందని అనుకుందాం, ఇప్పుడు, బ్యాంక్‌ లోన్‌ తిరిగి చెల్లించడానికి వివిధ EMI ఆప్షన్స్‌ ఉన్నాయి.

నెలకు రూ. 16,876 EMI చొప్పున చెల్లిస్తే, మీ కార్‌ లోన్‌ మొత్తం 7 సంవత్సరాల్లో తీరిపోతుంది.

నెలకు రూ. 18,908 EMI చొప్పున కడితే మీ రుణం మొత్తం 6 సంవత్సరాల్లో పూర్తిగా చెల్లిపోతుంది.

నెలకు రూ. 21,774 EMI చొప్పున జమ చేస్తే, మీ లోన్‌ 5 సంవత్సరాల్లో క్లియర్‌ అవుతుంది.

నెలకు రూ. 26,103 EMI చొప్పున చెల్లిస్తే, కారు కోసం తీసుకున్న అప్పు మొత్తం 4 సంవత్సరాల్లో మాఫీ అవుతుంది.

మీకు కార్‌ లోన్‌ మంజూరు కావడం, కాకపోవడం & వడ్డీ రేటు అనేవి మీ క్రెడిట్ స్కోర్, క్రెడిట్‌ హిస్టరీ మీద ఆధారపడి ఉంటుంది.

మారుతి విక్టోరిస్: ఇంజిన్ & మైలేజ్మారుతి విక్టోరిస్‌లో 1.5-లీటర్ మైల్డ్‌ హైబ్రిడ్‌ పెట్రోల్ ఇంజిన్, 1.5-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్ & 1.5 లీటర్ పెట్రోల్ + CNG ఇంజిన్ అనే మూడు ఇంజన్ ఎంపికలు ఉన్నాయి. ఈ SUVలో 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ & eCVT గేర్‌బాక్స్ ఆప్షన్ కూడా ఉంది. మైలేజ్ పరంగా, విక్టోరిస్ తన విభాగంలో అత్యంత ఇంధన సామర్థ్యం కలిగిన SUV. పెట్రోల్ వేరియంట్ 18.50 kmpl మైలేజీని ఇస్తుంది, హైబ్రిడ్ వేరియంట్ 28.65 kmpl వరకు మైలేజీ ఇస్తుంది.

మారుతి విక్టోరిస్ ఫీచర్లు & భద్రతమైలేజ్ & ధరలోనే కాకుండా ఫీచర్లు & భద్రత పరంగా కూడా మారుతి విక్టోరిస్ అద్భుతమైన కారు. పనోరమిక్ సన్‌రూఫ్, లెవల్-2 ADAS, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, ఆటో క్లైమేట్ కంట్రోల్, 10.54-అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, క్రూయిజ్ కంట్రోల్ & HUD డిస్‌ప్లే వంటి అధునాతన లక్షణాలు ఈ కారులో ఉన్నాయి. ఈ SUV భారత్‌ NCAP & గ్లోబల్‌ NCAP రెండింటి నుంచి 5-స్టార్ రేటింగ్‌ను పొందింది, ప్రయాణీకుల భద్రత పరంగా టాప్‌ క్లాస్‌లో ఉంది.