Maruti Victoris Waiting Period: మారుతి సుజుకి విక్టోరిస్ డెలివరీలు ఈ రోజు (సెప్టెంబర్‌ 22, 2025) నుంచి ప్రారంభమయ్యాయి. ARENA డీలర్‌షిప్‌ల ద్వారా కస్టమర్లు ఈ డ్రీమ్‌ కారు డెలివరీలను తీసుకుంటున్నారు. ఈ SUV ఎక్స్‌-షోరూమ్‌ ధర ₹10.50 లక్షల నుంచి ప్రారంభమై ₹19.99 లక్షల వరకు ఉంటుంది. ఇది పెట్రోల్, మైల్డ్ హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్ & CNG వేరియంట్లలో లభిస్తుంది. వాస్తవానికి, ఈ SUV లాంచ్‌ సమయంలోనే బుకింగ్స్‌ కూడా ప్రారంభమయ్యాయి. ఇప్పుడు కూడా, నేరుగా డీలర్‌షిప్‌నకు వెళ్లి గానీ, ఆన్‌లైన్‌లో గానీ బుక్‌ చేసుకోవచ్చు. దీనికోసం, ముందస్తుగా రూ. 11,000 చెల్లించాలి.

విక్టోరిస్‌ వేరియంట్‌లు & ధరలు

విక్టోరిస్‌ మొత్తం 6 వేరియంట్‌లలో లభిస్తుంది: 

  • LXi
  • VXi
  • ZXi
  • ZXi (O)
  • ZXi+
  • ZXi+ (O)

ఇవి వివిధ ఇంజిన్‌ & ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్లతో అందుబాటులో ఉన్నాయి:

1.5L NA Smart Hybrid (పెట్రోల్) - 5MT: LXi ₹10.50 లక్షల నుంచి ZXi+ (O) ₹15.81 లక్షల వరకు

1.5L NA Smart Hybrid (పెట్రోల్) - 6AT: VXi ₹13.35 లక్షల నుంచి ZXi+ (O) ₹17.76 లక్షల వరకు

1.5L NA Smart Hybrid (పెట్రోల్) - AllGrip Select (6AT): VXi ₹14.85 లక్షల నుంచి ZXi+ (O) ₹19.98 లక్షల వరకు

1.5L Strong Hybrid (e-CVT): ZXi ₹16.37 లక్షల నుంచి ZXi+ (O) ₹19.98 లక్షల వరకు

1.5L CNG: VXi ₹12.99 లక్షల నుంచి ZXi+ (O) ₹17.76 లక్షల వరకు

ఈ ధరలు ఎక్స్‌షోరూమ్‌ ధరలు. వేరియంట్‌ ఆధారంగా ధరలు మారవచ్చు.

ఇంజిన్‌ ఆప్షన్లు 

1.5 లీటర్‌ మైల్డ్‌ హైబ్రిడ్‌, స్ట్రాంగ్‌ హైబ్రిడ్‌ & CNG

ఫ్యూయల్‌ ఎఫిషియెన్సీ

మైల్డ్‌ హైబ్రిడ్‌ - 21.18 km/l (MT) & 21.06 km/l (AT) 

స్ట్రాంగ్‌ హైబ్రిడ్‌ - 28.65 km/l 

CNG వేరియంట్‌ - 27.02 km/kg

ఫీచర్లు:

  • ADAS లెవెల్‌ 2 సూట్‌
  • పనోరమిక్‌ సన్‌రూఫ్‌
  • 360 డిగ్రీల కెమెరా
  • డిజిటల్‌ డ్రైవర్‌ డిస్‌ప్లే
  • డ్యూయల్-టోన్ డాష్‌బోర్డ్ 
  • పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్
  • డాల్బీ అట్మాస్‌తో ఇన్ఫినిటీ స్పీకర్స్‌ 
  • వెంటిలేటెడ్‌ ఫ్రంట్‌ సీట్లు
  • స్మార్ట్‌ పవర్డ్‌ టెయిల్‌గేట్‌
  • 64-కలర్‌ అంబియంట్‌ లైటింగ్‌
  • PM 2.5 ఎయిర్‌ ఫిల్టర్‌
  • వైర్‌లెస్‌ ఛార్జింగ్‌

5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌

విక్టోరిస్, 5-స్టార్ Global NCAP రేటింగ్ పొందిన మారుతి సుజుకీ మొట్టమొదటి SUV గా అవతరించింది.

AWD లేదా AllGrip ఆప్షన్లు కొన్ని వేరియంట్లలో లభించవచ్చు.

డెలివరీ వివరాలు

ARENA నెట్‌వర్క్‌లో మాత్రమే విక్టోరిస్ విక్రయం జరుగుతుంది. డీలర్‌ డిస్పాచ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి & కస్టమర్‌కు కారు అప్పగించే ప్రాసెస్‌ (డెలివరీ) సెప్టెంబర్‌ 22, 2025 నుంచి ప్రారంభమైంది. వినియోగదారులు తమ దగ్గరలోని మారుతి సుజుకి అరేనా షోరూమ్‌కు వెళ్లి, విక్టోరిస్‌ను ప్రత్యక్షంగా చూడవచ్చు & మరిన్ని వివరాలు చూడవచ్చు. మీరు తీసుకునే వేరియంట్‌, రంగు, & డీలర్‌ స్టాక్‌ ఆధారంగా డెలివరీ సమయం మారవచ్చు. కాబట్టి, ఖచ్చితమైన డెలివరీ సమయానికి సంబంధించి మీ సమీప డీలర్‌ను సంప్రదించడం మంచిది.