Maruti Victoris Price, Mileage And Features Telugu: మారుతి సుజుకి, ఇటీవలే, కొత్త విక్టోరిస్ SUV ని లాంచ్‌ చేసింది. భారత్‌ ఎన్‌క్యాప్‌ (BNCAP) &  గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌ GNCAP రెండింటి నుంచి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన మారుతి మొట్టమొదటి SUV ఇది. ఈ కారు బలమైన భద్రతలతో పాటు ప్రీమియం ఫీచర్లను అందిస్తుంది. అయితే, ఆశ్చర్యకరంగా, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) అన్ని వేరియంట్లలో అందుబాటులో లేదు. ఏ వేరియంట్లలో ఈ ఫీచర్ లభిస్తుందో తెలుసుకుందాం.

మారుతి విక్టోరిస్ ADAS లక్షణాలుమారుతి విక్టోరిస్‌ టాప్ వేరియంట్‌లు మాత్రమే లెవల్ 2 ADAS ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫీచర్లు డ్రైవింగ్‌ను సురక్షితంగా & సులభంగా చేస్తాయి.  లెవల్ 2 ADAS ఫీచర్లలో - లేన్ కీప్ అసిస్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ & లేన్ డిపార్చర్ వార్నింగ్ వంటి ఆధునిక భద్రత సాంకేతికతలు ఉన్నాయి. ఇవన్నీ, హైవేలపై & సుదూర ప్రయాణాల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రత్యేకంగా సహాయపడతాయి.

Maruti Victoris Hybrid vs CNG: ఏది బెటర్‌?

విక్టోరిస్ మూడు ఇంజిన్ ఎంపికలలో లాంచ్‌ అయింది, అవి - 1.5 లీటర్‌ పెట్రోల్, 1.5 లీటర్‌ స్ట్రాంగ్ హైబ్రిడ్, & 1.5 పెట్రోల్-CNG. 

హైబ్రిడ్ వేరియంట్ అత్యధిక మైలేజీని అందిస్తుంది, 28.65 kmpl (ARAI సర్టిఫైడ్) చేరుకుంటుంది. ఇది లాంగ్‌ రేంజ్‌  & ఇంధన పొదుపు సామర్థ్యాన్ని కోరుకునే వారికి అనువైనది. కానీ, దీనికి ADAS సూట్‌ లేదు & ధర ఎక్కువ. 

CNG వేరియంట్ తక్కువ ధరలో వస్తుంది & తక్కువ రన్నింగ్ ఖర్చులు సరిపోతాయి. బడ్జెట్-ఫ్రెండ్లీ & అధిక-మైలేజ్ SUV కోసం చూస్తున్న కొనుగోలుదారులకు ఇది అనువైనది. పె

ట్రోల్ ఆటోమేటిక్ ZXI ప్లస్ వేరియంట్ ADAS తో వస్తుంది. అడ్వాన్స్‌డ్‌ సేఫ్టీ ఫీచర్లను మీరు కోరుకుంటే, ఈ వేరియంట్ మీ డబ్బుకు తగిన ఎంపిక.

తెలుగు రాష్ట్రాల్లో విక్టోరిస్ ధరలు & బుకింగ్‌ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణలో విక్టోరిస్ ధరలు రూ. 10.50 లక్షల నుంచి ప్రారంభమై రూ. 19.99 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటాయి. ఈ SUV మారుతి బ్రెజ్జా & గ్రాండ్ విటారా మధ్య స్థాయిలో ఉంటుంది. విక్టోరిస్ కోసం బుకింగ్స్‌ ఇప్పటికే ప్రారంభమయ్యాయి & డెలివరీలు సెప్టెంబర్ 22, 2025 తర్వాత మొదలవుతాయి.

హ్యుందాయ్ క్రెటాతో పోటీమారుతి సుజుకి విక్టోరిస్, నేరుగా Hyundai Creta కు పోటీగా మార్కెట్‌లోకి వచ్చింది. క్రెటా పెట్రోల్ వేరియంట్ రూ. 11.11 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. దాని ఆటోమేటిక్ (IVT) వేరియంట్ రూ. 15.99 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. క్రెటా రెండు వేరియంట్లలో లభిస్తుంది: SX(O) & SX(O) DT. ఇవి రెండూ 1.5-లీటర్ టర్బోచార్జ్‌డ్‌ పెట్రోల్ ఇంజిన్ & 7-స్పీడ్ DCT గేర్‌బాక్స్‌తో ఉంటాయి. వాటి ధరలు వరుసగా రూ. 20.19 లక్షలు & రూ. 20.34 లక్షలు.