Maruti Swift down payment Rs 50000 emi calculator loan details here
భారత్‌లో కస్టమర్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్న కంపెనీలలో మారుతి సుజుకి కంపెనీ ఒకటి. అందుకే కంపెనీకి చెందిన అన్ని కార్లూ సూపర్ హిట్ అయ్యాయి. మారుతి కంపెనీకి చెందిన ఒక హ్యాచ్‌బ్యాక్ కారు గురించి ఇక్కడ తెలుసుకోండి. మారుతి సుజుకి స్విఫ్ట్ కారు కస్టమర్లకు ఫస్ట్ ప్రియారిటీగా చూసే హ్యాచ్‌బ్యాక్ కారు. తన స్పోర్టీ లుక్, అద్భుతమైన డ్రైవింగ్ పెర్ఫార్మెన్స్, మైలేజ్ కారణంగా ఈ కారు ఏళ్ల తరబడి విక్రయాల్లో దూసుకెళ్తోంది. మీరు మీ కుటుంబం కోసం ఒక కొత్త కారు కొనాలని ఆలోచిస్తుంటే ఈ విషయాలపై ఓ లుక్కేయండి.
మీరు స్విఫ్ట్ కారు కొనడానికి ఒకేసారి మొత్తం అమౌంట్ ఒకేసారి చెల్లించకపోయినా కొనవచ్చు. ఫైనాన్స్ ప్లాన్ ద్వారా మొదట కొంత మొత్తం చెల్లించి కారు సొంతం చేసుకోవచ్చు. బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు కేవలం 50,000 డౌన్ పేమెంట్ చేసి కొత్త కారును ఇంటికి తీసుకెళ్లవచ్చు. స్విఫ్ట్ బేస్ మోడల్ LXi ఎక్స్-షోరూమ్ ధర సుమారు ₹5.80 లక్షలు. పన్నులు, ఇన్సూరెన్స్ కలిపి హైదరాబాద్‌లో ఆన్-రోడ్ ధర సుమారు ₹7.06 లక్షల వరకు ఉంటుంది. కేవలం 50 వేల డౌన్ పేమెంట్ చేసhso.. లోన్ ద్వారా తీసుకున్న మొత్తానికి నెలవారీ EMI ఎంత అవుతుంది తెలుసుకోవాలి.
₹50,000 డౌన్ పేమెంట్‌తో కొనుగోలు
మారుతి స్విఫ్ట్ బేస్ వేరియంట్ LXiని కొనేందుకు ₹50,000 డౌన్ పేమెంట్ చేస్తే, మిగిలిన ఆన్-రోడ్ మొత్తం అంటే సుమారు రూ.6 లక్షల వరకు మీరు కార్ లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా బ్యాంకులు కార్ లోన్లపై ఏడాదికి 9 నుండచి 9.5% వరకు వడ్డీ రేటును వసూలు చేస్తాయి. ఈ వడ్డీ రేటు మీ క్రెడిట్ స్కోర్, ప్రొఫైల్‌పై ఆధారపడి ఉంటుంది.
రూ.6 లక్షల లోన్‌పై నెలవారీ EMI వివరాలు
మీరు తీసుకున్న 6 లక్షల లోన్‌కు వడ్డీ రేటు ఏడాదికి 9% ఉంటే, మీరు ప్రతి నెల EMI వివరాలు ఇక్కడ అందిస్తున్నాం.
4 ఏళ్లు (48 నెలలు) అయితే ప్రతి నెలా EMI ₹14,931 చెల్లించాలి. చెల్లించే మొత్తం వడ్డీ: సుమారు ₹1.16 లక్షలు
5 ఏళ్లు (60 నెలలు) అయితే ప్రతి నెలా EMI ₹12,455 కట్టాలి. చెల్లించే మొత్తం వడ్డీ: సుమారు ₹1.47 లక్షలు అవుతుంది.
6 ఏళ్లు (72 నెలలు): ప్రతి నెలా EMI ₹10,816 చెల్లించాల్సి ఉంటుంది. కస్టమర్ సుమారు 1.78 లక్షలు వరకు వడ్డీ చెల్లిస్తారు.
అయితే, లోన్ కాలపరిమితి పెరగడం ఎక్కువ కాలం వడ్డీ చెల్లిస్తారు. మీ నెలవారీ EMI తగ్గి, లోన్ మొత్తాన్ని నెమ్మదిగా సులభంగా తీర్చవచ్చు.
బేస్ మోడల్‌లో లభించే ఫీచర్లు, మైలేజ్
మారుతి స్విఫ్ట్ LXi లో పలు ముఖ్యమైన ఫీచర్లు, సేఫ్టీ లభిస్తాయి. ఇందులో 1.2 లీటర్ Z-సిరీస్ పెట్రోల్ ఇంజిన్ ఇచ్చారు. ఇది లీటరుకు సుమారు 24.8 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇక సేఫ్టీ విషయానికొస్తే బేస్ మోడల్‌లోనూ 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి ఫీచర్లు స్టాండర్డ్‌గా ఇచ్చారు.
