Maruti Suzuki YMC EV: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఫ్యామిలీ కార్లు అనగానే అందరికీ మొదట గుర్తొచ్చే బ్రాండ్‌ మారుతి సుజుకి. ముఖ్యంగా మల్టీ-పర్పస్‌ వెహికల్‌ సెగ్మెంట్‌లో ఎర్టిగా, XL6, ఇన్విక్టో మోడళ్లతో దశాబ్దాలుగా తిరుగులేని సామ్రాజ్యాన్ని ప్లాన్‌తో ఈవీ మార్కెట్‌ను పూర్తిగా క్లీన్‌ స్వీప్‌ చేయడానికి సిద్ధమైంది. తాజాగా ఇండియన్ రోడ్లపై అత్యంత రహస్యంగా రోడ్‌ టెస్టింగ్‌ జరుపుకుంటూ కెమెరాకు చిక్కింది. 

Continues below advertisement

పెట్రోల్, డీజిల్ ధరల భారం లేకుండా, పెద్ద ఫ్యామిలీలకు లాంగ్ జర్నీలను అత్యంత లగ్జరీగా, బడ్జెట్‌ దరలోనే ఎంజాయ్‌ చేసేలా ఈ సరికొత్త ఈవీని డిజైన్ చేశారు. గ్లోబల్ మార్కెట్‌లో ఇటీవల లాంచ్ అయిన ఇ-విటారా ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ సక్సెస్ ఫార్ములాను బేస్ చేసుకొని, అదే వర్‌ఫుల్‌ ఈవీ ప్లాట్‌ఫామ్‌పై ఈ మల్టీ సీటర్‌ ఫ్యామిలీ రోల్‌ను మారుతి సుజుకి డెవలప్‌ చేస్తోంది. 

క్యాబిన్ స్పేస్‌లో సరికొత్త సంచలనం 

మారుతి సుజుకి YMC ఎలక్ట్రిక్‌ ఎంపీవీ సాధారణ ఐసీఈ ఇంజిన్ కార్లను ఈవీగా మార్చిన మోడల్‌ కాదు. ఇది ప్రత్యేకంగా ఎలక్ట్రిక్‌ వాహనాల కోసమే టయోటా భాగస్వామ్యంతో తయారు చేసిన హార్టెక్ట్‌-ఇ ప్లాట్‌ఫామ్‌పై నిర్మితమవుతోంది. సంప్రదాయ కార్లలాగా మధ్యలో ఎలాంటి బంప్స్‌ లేకుండా, ఈ స్కేట్‌బోర్డ్‌ ప్లాట్‌ఫామ్‌ వల్ల కారు లోపల భాగం పూర్తిగా ప్లాట్‌ ఫ్లోర్‌ లాగా ఉంటుంది. దీని వల్ల బ్యాటరీ ప్యాక్ మొత్తం కారు కింది భాగంలోనే అమర్చారు. ఫ్లాట్‌ఫ్లోర్‌ డిజైన్ కారణంగా కారులోని మూడు వరుసల ప్రయాణికులకు అద్భుతమైన లెగ్‌రూమ్‌, హెడ్‌రూమ‌ లభిస్తుంది. మూడో వరసులో కూర్చునే వారికి కూడా కౌచ్‌ లాంటి సౌకర్యం అందించడమే మారుతి ప్రధాన లక్ష్యం. ఈ ప్లాట్‌ఫామ్‌ వల్ల కారు వీల్‌బేస్‌ గణనీయంగా పెరుగుతుంది. దీని వల్ల హైవేలపై హైస్పీడ్‌లో వెళ్తున్నప్పుడు కారు అసలు ఊగకుండా, స్టెబిలిటీ ఇస్తుంది. 

Continues below advertisement

ఒకసారి ఛార్జ్ చేస్తే 500+ కిలోమీటర్లు 

మారుతి సుజుకి YMC లాంగ్ డిస్టెన్స్ ఫ్యామిలీ ట్రావెలింగ్‌ను దృష్టిలో ఉంచుకొని పవర్‌ఫుల్‌ బ్యాటరీ ప్యాక్స్‌తో రంగంలోకి దిగుతోంది. ఈ కారులో కస్టమర్‌ల అవసరాలకు అనుగుణంగా రెండు రకాల ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీ ఆప్షన్లు అందించనున్నారు. సిటీ డ్రైవింగ్‌, మీడియం రేంజ్ ప్రయాణాల కోసం ఈ వెరియంట్ ఉపయోగపడుతుంది. ఇది 142hp పవర్‌ను, 193Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. దీని సర్టిఫైడ్‌ రేంజ్‌ దాదాపు 400కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది. లాంగ్‌ హైవే రైడ్స్‌ కోసం వచ్చే ఈ లాంగ్‌- రేంజ్‌ వేరియంట్‌ ఏకంగా 172hp పవర్‌ను ప్రొడ్యూస్‌ చేస్తుంది. ఒకే ఒక్క పూర్తి ఛార్జింగ్‌తో ఇది 500కిలోమీటర్ల నుంచి 543కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని అంచనా. 

ఆల్ట్రా- ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్

ఈ కారు అధునాతన హైస్పీడ్‌ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. దీని సహాయంతో కేవలం 45నిమిషాల కంటే తక్కువ సమయంలో పది శాతం నుంచి 80శాతం వరకు బ్యాటరీని రీఛార్జ్‌ చేసుకోవచ్చు. అంటే హైవేలపై ఉన్న ఫుడ్ కోర్టుల్లో కాసేపు టీ బ్రేక్ తీసుకునే లోపే మీ కారు మళ్లీ ప్రయాణానికి రెడీ అయిపోతుంది. 

ఎర్టిగా కంటే పెద్దది, మోడరన్ లుక్‌!

స్పై షాట్స్‌ ఆధారంగా మారుతి సుజుకి YMC కారు ప్రస్తుత ఎర్టిగా మోడల్‌ కంటే చాలా భిన్నంగా, మరింత ప్రీమియం లుక్‌తో రాబోతోంది. దీని పొడవు సుమారు 4.5 మీటర్లు ఉంటుంది. ఇది సాధారణ ఎంపీవీల కంటే పెద్ద రోడ్ ప్రెజెన్స్‌ను ఇస్తుంది. ఈవీ కావడం వల్ల దీనికి సాంప్రదాయ రేడియేటర్‌ గ్రిల్ ఉండదు. పూర్తిగా క్లోజ్డ్‌ బ్లాంక్డ్ గ్రిల్ ఉంటుంది. ఫ్రంట్‌ భాగంలో ఎల్‌ షేప్డ్‌ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్‌, స్ట్రైకింగ్‌ ప్రొజెక్టర్‌ హెడ్‌ల్యాంప్స్‌ కారుకు అగ్రెసివ్ ఎస్‌యూవీ లుక్‌ను ఇస్తాయి. కారు రేంజ్‌ పెంచడం కోసం గాలి ఘర్షణను తగ్గించే 18-ఇంచ్‌ ఏరో ఆప్టిమైజ్డ్‌ అయాల్‌ వీల్స్‌ను ఇందులో అమర్చారు. వెనుకవైపు ఎర్టిగా పోలికలు ఉన్నప్పటికీ , ఆధునిక ట్రెండ్‌కు అనుగుణంగా గేట్ వ్యాప్తంగా సాగే ఫుల్‌ విడ్త్‌ కనెక్టెడ్‌ టెయిలైట్‌ సిగ్నేచర్‌ దీని సొంతం. ఎగ్జాస్ట్‌ పైప్‌ లేకపోవడం దీని ప్యూర్‌ ఈవీ క్యారెక్టర్‌ను స్పష్టం చేస్తోంది. 

లగ్జరీ ఇంటీరియర్స్‌

కారు లోపలికి అడుగుపెడితే, ఇదొక మారుతి కారేనా అని ఆశ్చర్యపోయేలా సరికొత్త డ్యూయల్‌ స్క్రీన్ కాక్‌పిట్‌ సెటప్‌ స్వాగతం పలుకుతుంది. ఇన్ఫోటైన్‌మెంట్‌, డ్రైవర్‌ డిస్‌ప్లై కోసం విడి విడిగా పెద్ద స్క్రీన్‌లు కేటాయించారు. డ్యాష్‌బోర్డు మధ్యలో 10.1 ఇంచ్‌ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్‌ సిస్టమ్‌ ఉంటుంది. ఇది వైరలెస్‌ ఆపిల్‌ కార్‌ ప్లే, ఆడ్రాయిడ్‌ ఆటోను సపోర్ట్ చేస్తుంది. డ్రైవర్‌ ముందు 10.25 ఇంచ్‌ పుల్లీ డిజిటల్‌ ఇన్స్ర్టమెంట్‌ క్లస్టర్ ఉంటుంది. ఇది రియల్‌ టైమ్‌ రేంజ్‌ అప్‌డేట్స్‌, నావిగేషన్‌ను చూపిస్తుంది. 

వేసవి కాలంలో చల్లదనాన్ని ఇచ్చే వెంటిలేటెడ్‌ ఫ్రంట్‌ సీట్స్‌తోపాటు, క్యాబిన్ లోపల మరింత వెలుతురు, ప్రీమియం ఫీల్‌ కోసం భారీ పనోరమిక్‌ సన్‌రూఫ్‌ను కూడా అందించారు. స్మార్ట్‌ ఫోన్‌ యాప్‌ ద్వారా కారును  ట్రాక్ చేయడం, ఏసీని ముందే ఆన్ చేసుకోవడం, జియో- ఫెన్సింగ్‌, ఓవర్‌ ది ఎయిర్‌ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్‌ వంటి లేటెస్ట్‌ ఫీచర్లు ఇందులో ఇన్‌బిల్ట్‌గా వస్తున్నాయి. 

లాంచ్ ఎప్పుడు చేస్తున్నారు?

మారుతి సుజుకి YMC 7-సీటర్‌ ఎలక్ట్రిక్‌ MPVని గుజరాత్‌లోని సుజుకి అడ్వాన్స్‌డ్‌ ప్లాంట్‌లో పూర్తి దేశీయ విడిభాగాలో భారీ స్థాయిలో ఉత్పత్తి చేయనున్నారు. దీని వల్ల ధరను అత్యంత పోటీతత్వంతో  మార్కెట్‌లోకి తెచ్చే అవకాశం ఉంది. ఇండియన్ మార్కెట్‌లో ఈ కారు ధర వేరియంట్లు, బ్యాటరీ సైజును బట్టి 18 లక్షల నుంచి 25 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. ఈ ప్రైస్ రేంజ్‌లో ఇది మార్కెట్‌లోకి వస్తే కియా క్యారెన్స్‌ ఈవీ, టాటా సఫారీ ఈవీలకు గట్టి పోటీ ఇస్తుందని అంచనా ఉంది. ప్రస్తుతం రోడ్ టెస్టింగ్‌ జరుపుకుంటున్న ఈ ఫ్యామిలీ ఈవీ, 2026 చివరి నాటికి గ్లోబల్ డెబ్యూ అయి, 2027 ప్రారంభంలో కమర్షియల్‌గా లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదే ప్లాట్‌ఫామ్‌పై టయోటా బ్రాండ్ నుంచి కూడా ఒక వెర్షన్ రి-బ్యాడ్జ్‌ అయి మార్కెట్‌లోకి రానుంది.