Maruti Suzuki Victoris : మారుతి సుజుకి కంపెనీ నుంచి త్వరలో రాబోతున్న విక్టోరిస్ సెక్యూరిటీ రేటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యింది. ఈ కారు క్రాష్ టెస్టులో BNCAP నుంచి ఫైవ్ స్టార్ రేటింగ్ పొందింది. క్రాస్ ఓవర్ ఫ్రంట్ క్రాష్ ప్రొటెక్షన్, సైడ్ క్రాష్ ప్రొటెక్షన్, చైల్డ్ ప్రొటెక్షన్, సేఫ్టీ అసిస్ట్ టెక్నాలజీ అన్ని విభాగాల్లో కారు సామర్థ్యాన్ని పరీక్షించారు. అన్నింటిలో కూడా మెరుగైన ప్రదర్శన ఇచ్చిన మారుతి విక్టోరిస్‌కు ఫైవ్‌స్టార్ రేటింగ్ ఇచ్చారు.
అన్ని వేరియెంట్స్‌కు వర్తించేలా ఈ టెస్టు జరిగింది. BNCAP పరీక్షలో పాల్గొన్న వేరియంట్ 1,549 కిలోల క్రాష్ టెస్ట్ బరువుతో అత్యంత ఖరీదైన ZXI+ స్ట్రాంగ్ హైబ్రిడ్ eCVT. పెట్రోల్ మాన్యువల్, ఆటోమేటిక్, అలాగే స్ట్రాంగ్-హైబ్రిడ్ వేరియంట్‌లను కూడా ఈ మోడల్ కవర్ చేస్తుంది. ఇప్పుడు అందుతున్న సమాచారం మేరకు విక్టోరిస్ బేస్ వేరియంట్‌కి కూడా ఫైవ్-స్టార్ రేటింగ్ వర్తిస్తుంది. అంటే బేసిక్ వేరియంట్ తీసుకున్న వాళ్లకి కూడా భద్రత విషయంలో ఎలాంటి డోకా లేదని చెప్పవచ్చు.
1.5-లీటర్ మాన్యువల్ (LXI నుంచి ZXI+ (O)), ఫ్రంట్-వీల్ ,ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో 1.5-లీటర్ ఆటోమేటిక్ లేదా 1.5-లీటర్ eCVT స్ట్రాంగ్ హైబ్రిడ్ ఏ వేరియెంట్ ఎంచుకున్నా సరే ఈ ఫైవ్‌స్టార్ రేటింగ్ భద్రత వర్తిస్తుంది. ఇప్పుడు ఇచ్చిన సర్టిఫికెట్ బేస్ మోడల్ నుంచి హై ఎండ్ వరకు అన్నింటికీ వర్తిస్తుంది. మారుతి విక్టోరిస్ ఫీచర్స్ విషయంలో కూడా ముందంజలో ఉంది. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు కలిగి ఉంది. ABS, ESP, లెవల్ 2 ADAS వంటి సెక్యూరిటీ ఫీచర్స్ అన్ని వేరియెంట్స్‌లో ఉన్నాయి. ఇలా లెవల్ -2 ADAS అందివ్వడం ఇదే తొలిసారి.
గాట్ ఇట్ ఆల్ అనే ట్యాగ్‌లైన్‌తో మారుతి విక్టోరిస్‌ను భారత్ మార్కెట్‌లోకి మారుతి సుజుకి తీసుకొస్తోంది. ఈ ఎస్‌యూవీ మోడల్ కారు ఆర్డర్‌లు స్వీకరించడం త్వరలోనే ప్రారంభించబోతోంది. ఇందులో ADAS సూట్‌ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేక్, కర్వ్‌స్పీడ్ రిడక్షన్‌తో కూడిన అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, హై బీమ్ అసిస్ట్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, లేన్ ఛేంజ్ అల్ట్‌తో బ్లైండ్ స్పాట్ మానిటర్ ఫీచర్స్ కూడా లభిస్తున్నాయి. డిస్క్‌బ్రేక్‌లతోపాటు ఆటో హోల్డ్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్‌లు కలిగి ఉంది.
విక్టోరిస్ డిజైన్ కలర్స్
మారుతి విక్టోరిస్ ఎక్కువ డిజైన్‌తో హడావుడి చేయకుండా సింపుల్‌గా మార్కెట్‌లోకి తీసుకొస్తోంది. సింపుల్ అండ్ స్టైలిష్ లుక్‌తోనే వినియోగదారులను ఆకట్టుకోవాలని చూస్తోంది. ముందు భాగం ఈ విటారాను పోలి ఉంటుంది. సన్నని ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, మధ్యలో సన్నని క్రోమ్ రిబన్స్‌తో కలిపి ఉంటాయి. బంపర్‌లో ఫాగ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. ఇవి ఈ కారు లుక్‌ను మరింతగా పెంచుతాయి.
మారుతి విక్టోరిస్ టర్బైన్ లాంటి డిజైన్‌తో 17 అంగుళాల ఏరో-కట్ అల్లాయ్ వీల్స్ కలిగి ఉంది. వెనుకవైపు ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్‌లు ఉన్నాయి. ఇవి ఇప్పటికే మారుతి కార్లో ఇచ్చినట్టు కాకుండా కాస్త భిన్నంగా డిజైన్ చేశారు. ఈ కారు పొడవు 4,360mm, 1655 mm వెడల్పు, 1795 mm ఎత్తుతో వస్తోంది. వీల్ బేస్ 2600mm ఉంది.
మారుతి విక్టోరిస్ పది రంగుల్లో వస్తోంది. మూడు డ్యూయల్ టోన్ లో ఉంటే ఏడు మోనోటోన్ ఆప్షన్‌లో వస్తున్నాయి. వీటితోపాటు మిస్టిక్ గ్రీన్, ఎటర్నల్ బ్లూ కలర్‌తో కూడా కార్లు లభిస్తాయి. కారు ఇంటీరియల్ విషయానికి వస్తే బ్లాక్ అండ్ ఐవరీ డ్యూయల్ టోన్‌తో 3 లేయర్ డ్యాష్‌బోర్డు సాఫ్ట్ టచ్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ కలిగి ఉంటుంది. టెక్చర్డ్ సీటు అప్‌హోల్‌స్టరీ, పియానో బ్లాక్ యాక్సెంట్‌లు ప్రీమియం ఇన్- క్యాబిన్ అనుభవాన్ని ఇస్తాయి. సీఎన్‌జీ సిలిండర్ అమరికలో మార్పులు చేసినందున ఈ మోడల్‌లో కూడా బూట్ స్పేస్ ఎక్కువగానే ఉంటుంది.
విక్టోరిస్ 10.1 అంగుళాల స్మార్ట్ ప్లే ప్రో-ఎక్స్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్‌తో వస్తుంది. ఇది 5.1 ఛానల్ డాల్బీ అట్మోస్ సరౌండ్ సౌండ్‌తో 8-స్పీకర్ ఇన్ఫినిటీ సౌండ్ సిస్టమ్ ఇస్తున్నారు. డ్యాష్‌బోర్డ్‌లోని మరో డిస్‌ప్లే 10.5 అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్- ఇప్పటి వరకు ఏ మారుతి వాహనాల్లో కనిపించదు. ఈ మోడల్‌తోనే తొలిసారిగా దీన్ని తీసుకొస్తున్నారు.