Maruti Suzuki Victorious Price, Mileage And Features In Telugu: మారుతి సుజుకి, తన కొత్త SUV విక్టోరిస్‌ను గ్రాండ్‌గా పరిచయం చేసింది. కంపెనీ దాని డిజైన్, ఫీచర్లు & వేరియంట్ల గురించి సమాచారం ఇచ్చింది గానీ ధరను ఇంకా వెల్లడించలేదు. విక్టోరిస్ ప్రారంభ ధర (Maruti Victorious Price Hyderabad Vijayawada) దాదాపు రూ. 11 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుందని భావిస్తున్నారు. ఇది నిజమైతే, మారుతి గ్రాండ్ విటారాకు (Maruti Grand Vitara) & కాంపాక్ట్ SUV విభాగంలోని ఇతర బ్రాండ్ల కార్ల కంటే చౌకగా ఉంటుంది.
ఇంజన్ & వేరియంట్లు
మారుతి సుజుకీ, విక్టోరిస్‌ను 1.5-లీటర్ స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్‌తో అందిస్తోంది. దీని బేస్ వేరియంట్‌లో మాన్యువల్ గేర్‌బాక్స్ ఉంటుంది. దీంతో పాటు, 1.5 లీటర్ ఇంజిన్‌తో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపిక కూడా అందుబాటులో ఉంటుంది. మారుతి కంపెనీ, విక్టోరిస్‌ను AWD వేరియంట్‌లోనూ తీసుకువచ్చిం, ఇది ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉంటుంది. అంతేకాదు, విక్టోరిస్ CNG వెర్షన్ కూడా వినియోగదారుల కోసం లాంచ్ అవుతుంది. విక్టోరిస్‌ను టాప్ వేరియంట్ బలమైన హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో వస్తుంది & ఆ వేరియంట్‌లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ప్రామాణికంగా అందుబాటులో ఉంటుంది. ఫ్లాగ్‌షిప్ హైబ్రిడ్ వేరియంట్ ధర దాదాపు రూ. 20 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉండవచ్చని మార్కెట్‌లో అంచనాలు ఉన్నాయి.
విక్టోరిస్‌లో ప్రీమియం ఫీచర్లు & లగ్జరియస్ ఎక్స్‌పీరియన్స్
విక్టోరిస్ ప్రత్యేకత - గ్రాండ్ విటారా కంటే ఎక్కువ మోడ్రన్ ఫీచర్లను ఇది కలిగి ఉంటుంది, కానీ ధర దాని కంటే తక్కువగా ఉంటుంది. ఈ SUV ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవింగ్ అసిస్ట్ సిస్టమ్), డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్, పవర్డ్ హ్యాండ్‌బ్రేక్ సహా ఇప్పటివరకు ఏ మారుతి సుజుకి SUV లోనూ కనిపించని అనేక హై-టెక్ లక్షణాలతో వస్తుంది. కంపెనీ ఈ SUV ని అరీనా (Arena) సేల్స్ అవుట్‌లెట్‌ల ద్వారా విక్రయిస్తుంది. గ్రాండ్ విటారాను నెక్సా షోరూమ్‌ల నుంచి విక్రయిస్తుంది. SUV మార్కెట్‌లో పెద్ద వాటాను సొంతం చేసుకోవాలన్న మారుతి వ్యూహంలో ఈ మార్పు ఒక భాగం.
విక్టోరిస్‌తో విక్టరీ ప్లాన్!
రూ. 11 లక్షల ప్రారంభ ధరతో, బడ్జెట్ SUVగా విక్టోరిస్ నిలదొక్కుకునే అవకాశం ఉంది. మారుతి సుజుకి, అందుబాటు ధర బేస్ వేరియంట్లు & హై-టెక్ ఫీచర్లతో కూడిన టాప్ వేరియంట్ల ద్వారా SUVల అమ్మకాలను రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా మిడ్ రేంజ్ & టాప్ రేంజ్ సెగ్మెంట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని కంపెనీ ఈ SUVని తీసుకువచ్చింది.