Upcoming SUVs In India In 2025: భారతదేశంలో అతి పెద్ద కార్ల కంపెనీ మారుతి సుజుకీ, టఫ్‌ మోడళ్లను లాంచ్‌ చేసే టయోటా, మరికొన్నాళ్లలో కొత్త SUVలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పటికీ, ఈ వాహనాలను ఇండియన్‌ రోడ్ల మీద టెస్ట్‌ చేస్తున్నారు. మారుతి, టయోటా నుంచి రాబోయే SUVలలో ఎలాంటి ఫీచర్లు ఉండవచ్చు & కస్టమర్ల కోసం ఏయే ప్రత్యేకతలు తీసుకురాబోతున్నారన్న విషయాలపై ప్రజలు చాలా ఆసక్తిగా ఉన్నారు.

1. మారుతి సుజుకి ఇ విటారా ‍‌(Maruti Suzuki e Vitara)మారుతి సుజుకి, త్వరలో, తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ SUV 'E Vitara'ను భారతీయ మార్కెట్లో విడుదల చేయబోతోంది. ఈ ఎలక్ట్రిక్‌ వెహికల్‌ (EV)ను మొదటిసారిగా '2025 ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో'లో ఈ కంపెనీ ప్రదర్శించబడింది. అప్పటి నుండి ఈ కారుపై జనాల్లో ఆసక్తి మొదలైంది. ఈ SUV సింగిల్‌ ఫుల్‌ ఛార్జ్‌తో 500 కి.మీ. కంటే ఎక్కువ రేంజ్‌ ఇస్తుందని భావిస్తున్నారు. ఈ EV కోసం రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఇవ్వవచ్చు - ఒకటి స్టాండర్డ్ & మరొకటి ఎక్స్‌టెండెడ్ రేంజ్. ఈ వాహనం ప్రీమియం లుక్‌తో పాటు అడ్వాన్స్‌డ్‌ కనెక్టివిటీ ఫీచర్లు & లెవల్-2 ADAS వంటి సేఫ్టీ ఫీచర్లతో ఫుల్లీ ఫీచర్‌ ప్యాక్‌డ్‌ కార్‌లా ఉండవచ్చు. లాంగ్‌ డ్రైవ్‌లకు వెళ్లేవాళ్లను, ప్రతిరోజూ ఎక్కువ దూరం ప్రయాణించేవారిని దృష్టిలో పెట్టుకుని ఈ SUVని ప్రత్యేకంగా రూపొందించారు.

2. మారుతి ఎస్కుడో (Maruti Suzuki Escudo)మారుతి ఎస్కుడో ఒక కొత్త మిడ్-సైజ్ SUV. ఇది.. ధర & ఫీచర్ల పరంగా బ్రెజ్జా - గ్రాండ్ విటారాకు మధ్యలో ఉంటుంది. ఈ వెహికల్‌ రోడ్ టెస్టింగ్ టైమ్‌లో చాలాసార్లు కనిపించింది. మరో 2, 3 నెలల్లో మారుతి ఎస్కుడో లాంచ్‌ ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఫోర్‌వీలర్‌కు 1.5 లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఇచ్చారు, దీనిని మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో లింక్‌ చేశారు. ఈ టెక్నాలజీ వల్ల మైలేజీ మెరుగుపరుడుతుంది. డిజైన్‌ విషయానికి వస్తే... మారుతి ఎస్కుడో కొత్త అల్లాయ్ వీల్స్ & షార్ప్ LED DRL వంటి స్పోర్టీ లుక్స్‌ ఇశ్తుంది. ఇంటీరియర్‌లో... కొత్త డాష్‌బోర్డ్ & అప్‌డేటెడ్‌ టెక్నాలజీ ఎలిమెంట్స్‌ ఉండవచ్చు. కాస్త తక్కువ ధరలో SUV కొనాలనుకునే కస్టమర్లకు మారుతి ఎస్కుడో మిడ్-సైజ్ SUV అనుకూలంగా ఉంటుంది.

3. టయోటా అర్బన్ క్రూయిజర్ BEV ‍‌(Toyota Urban Cruiser BEV)టయోటా అర్బన్ క్రూయిజర్ BEV, ఈ కంపెనీ నుంచి రాబోతున్న కొత్త ఎలక్ట్రిక్ SUV. మారుతి సుజుకి eVX ఫ్లాట్‌ఫామ్‌పై దీనిని నిర్మించారు. అంటే, మారుతి e Vitara ప్లాట్‌ఫామ్ & టెక్నాలజీని టయోటా అర్బన్ క్రూయిజర్ BEV ‍లోనూ చూడవచ్చు. ఈ కారును మొదట బ్రస్సెల్స్‌లో ప్రదర్శించారు & ఆ తరువాత భారతదేశంలో '2025 గ్లోబల్ ఎక్స్‌పో'లో పరిచయం చేశారు. ఈ SUV సింగిల్‌ ఫుల్‌ ఛార్జ్‌తో 500 km పైగా డ్రైవింగ్‌ రేంజ్ ఇవ్వగలదని సమాచారం. దీని ఎక్స్‌టర్నల్‌ డిజైన్ e Vitara కంటే కొద్దిగా భిన్నంగా ఉంటుంది, ముందు వైపు ఫాసియా & టెయిల్ లాంప్‌లకు కొన్ని కాస్మెటిక్ మార్పులు ఉంటాయి. టయోటా ఈ వాహనాన్ని ప్రీమియం ఎలక్ట్రిక్ SUVగా లాంచ్‌ చేయవచ్చు. 

ఏ కారు ధర ఎంత, ఎప్పుడు లాంచ్‌ అవుతాయి?మారుతి ఇ విటారా 2025 మధ్యలో (అతి త్వరలో) లాంచ్‌ కావచ్చని & ధర రూ. 22 లక్షల నుంచి రూ. 28 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా. మారుతి ఎస్కుడో ఈ ఏడాది ఆగస్టు - సెప్టెంబర్ కాలంలో విడుదల కావచ్చని, దీని ధర రూ. 12 నుంచి రూ. 15 లక్షల మధ్య ఉండవచ్చని భావిస్తున్నారు. టయోటా అర్బన్ క్రూయిజర్ BEV, 2025 చివరి నాటికి లేదా 2026 ప్రారంభంలో మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది & దీని అంచనా ధర రూ. 24 లక్షల నుంచి రూ. 30 లక్షల మధ్య ఉంటుంది.