మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (ఎంఎస్ఐఎస్) మనదేశంలో మూడు ఎస్‌యూవీలు లాంచ్ చేయడానికి సిద్ధం అవుతోంది. రానున్న నెలల్లో ఈ కార్లు భారత మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనున్నాయి. వీటన్నిటినీ జనవరిలో జరిగిన 2023 ఆటో ఎక్స్‌పోలో మొదట పరిచయం చేశారు. ఇప్పుడు వీటి గురించి తెలుసుకుందాం.


1. మారుతి సుజుకి ఫ్రాంక్స్
మారుతి సుజుకి ఫ్రాంక్స్ మనదేశంలో వచ్చే నెలలో లాంచ్ కానుందని తెలుస్తోంది. ప్రత్యేకంగా నెక్సా డీలర్ షిప్స్ ద్వారా ఈ కారును విక్రయించనున్నారు. బలెనో ప్రీమియం హ్యాచ్ బ్యాక్ బేస్డ్‌గా దీన్ని రూపొందించారు. హార్టెక్ట్ ప్లాట్‌ఫాంను ఇది షేర్ చేసుకోనుంది. దీని ఫ్రంట్ ఫేసియా గ్రాండ్ విటారా తరహాలో ఉంది. దీని స్టాన్స్ కూడా చాలా వైడ్‌గా ఉండనుంది.


2. మారుతి సుజుకి జిమ్నీ
ఐదు డోర్ల మారుతి సుజుకి జిమ్నీ ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉంది. దీనికి సంబంధించిన ప్రొడక్షన్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. 2023 మే లేదా జూన్‌లో దీని ధరను అధికారికంగా ప్రకటించనున్నారు. ఐదు డోర్ల మహీంద్రా థార్, ఫోర్స్ గుర్ఖా తప్ప దీనికి పెద్ద పోటీ కూడా లేదు.


ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మూడు డోర్ల కంటే ఈ ఐదు డోర్ల మారుతి సుజుకి జిమ్నీ పెద్దగా ఉండనుంది. ఇది మరింత విశాలంగా కూడా ఉండనుంది. ఇందులో 1.5 లీటర్ల ఫోర్ సిలిండర్ కే15బీ పెట్రోల్ ఇంజిన్ అందించనున్నారు.


3. మారుతి సుజుకి బ్రెజా సీఎన్‌జీ
మారుతి సుజుకి బ్రెజా సీఎన్‌జీ వెర్షన్ కూడా త్వరలో లాంచ్ కానుంది. ఈ విభాగంలో బై ఫ్యూయల్‌తో రానుెన్న మొదటి మోడల్ ఇదే కానుంది. హై మైలేజ్ ఫోకస్‌గా దీన్ని తీసుకున్నారు. మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ఇందులో మల్టీపుల్ వేరియంట్లను తీసుకురానుంది. 1.5 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్‌ను ఇందులో కూడా అందించనున్నారు. కానీ పవర్, టార్క్ తక్కువగా ఉండనున్నాయి.


మారుతి సుజుకి మనదేశంలో కొత్త మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. హరియాణాలో ఈ కొత్త ప్లాంట్‌ను కంపెనీ ఏర్పాటు చేయనుంది. ఇది హరియాణాలో మూడో మారుతి సుజుకి ప్లాంట్ కానుంది. ఇది హరియాణాలో కంపెనీకి అతి పెద్ద ఇన్వెస్ట్‌మెంట్. దాదాపు రూ.20 వేలకు పైగా పెట్టుబడులను కంపెనీ పెట్టనుందని అంచనా. దీనికి సంబంధించిన ఒప్పందం కూడా పూర్తయింది. దీంతో ఖర్కొండాలో 900 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం మారుతి సుజుకికి అందించనుంది.


ఖర్కొండాలోని సోనిపట్‌లో మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్, సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఇక్కడ ప్లాంట్లు పెట్టడానికి ఈ స్థలాన్ని ఉపయోగించుకోవచ్చు. దాదాపు 13 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇందులో ల్యాండ్ కొనుగోలుకు రూ.2,400 కోట్లు ఖర్చు పెట్టనున్నారు. మరో రూ.20 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నారు.


2025 నాటికి ప్రతి యేటా 2.5 లక్షల కార్లను రూపొందించాలనే లక్ష్యంతో మారుతి సుజుకి ఈ ప్లాంట్‌ను నిర్మిస్తుంది. ఎనిమిది సంవత్సరాలు గడిచేసరికి ప్రతి యేటా 10 లక్షల యూనిట్లను తయారు చేస్తామని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ అన్నారు.