Maruti Suzuki Nexa Discounts December 2025: సాధారణంగా, సంవత్సరం చివరలో కార్‌ కంపెనీలు భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తాయి. 2025 డిసెంబర్‌లోకి చేరుకున్న ఈ సమయంలో, Maruti Suzuki కూడా తన ప్రీమియం NEXA పోర్ట్‌ఫోలియోపై భారీ డిస్కౌంట్లతో కస్టమర్లను ఆకర్షిస్తోంది. Ignis, Baleno, Jimny, Fronx, Grand Vitara, Invicto వంటి పాపులర్‌ కార్లపై కంపెనీ రూ.2.15 లక్షల వరకు తగ్గింపులు ఇస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణ రాష్ట్రాల్లోని Nexa షోరూమ్‌లలో ఈ ఆఫర్లు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి.

Continues below advertisement

డిసెంబర్ 2025లో అత్యధిక డిస్కౌంట్లు ఉన్న 6 Nexa కార్లు:

1. Maruti Suzuki Invicto – మొత్తం రూ.2.15 లక్షల వరకు ఆఫర్

Continues below advertisement

Nexa లైనప్‌లో అత్యధిక డిస్కౌంట్‌ ఇన్విక్టో MPVకే లభిస్తోంది.

– ఎక్స్చేంజ్‌ బోనస్‌: రూ.1 లక్ష

– స్క్రాపేజ్‌ బోనస్‌: రూ.1.15 లక్ష

– కన్స్యూమబుల్‌ ఆఫర్: రూ.1 లక్ష

– మొత్తం కలిపితే రూ.2.15 లక్షలు వరకు తగ్గింపు

ఇన్విక్టో 2.0L పెట్రోల్ స్ట్రాంగ్ హైబ్రిడ్‌ ఇంజిన్‌ (112bhp, 206Nm)తో వస్తుంది. ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ స్టాండర్డ్‌గా ఉంటుంది. ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ.24.97 లక్షలు నుంచి ప్రారంభం.

2. Maruti Suzuki Grand Vitara – వేరియంట్‌ను బట్టి విభిన్న డిస్కౌంట్లు

గ్రాండ్ విటారాలో వేరియంట్‌ను బట్టి డిస్కౌంట్ మారుతుంది.

FWD (Front-Wheel Drive) వేరియంట్:

– క్యాష్ డిస్కౌంట్: రూ.60,000

– ఎక్స్చేంజ్ బోనస్: రూ.30,000

AWD (All-Wheel Drive) వేరియంట్:

– క్యాష్ డిస్కౌంట్: రూ.1.15 లక్ష

– ఎక్స్చేంజ్ బోనస్: రూ.30,000

Strong Hybrid వేరియంట్:

– క్యాష్ డిస్కౌంట్: రూ.90,000

– ఎక్స్చేంజ్ బోనస్: రూ.50,000

పెట్రోల్‌ 1.5L ఇంజిన్‌ (101bhp, 136.8Nm), ఆటో & మాన్యువల్‌ ఆప్షన్లు. హైబ్రిడ్‌ వేరియంట్‌ ఎలక్ట్రిక్ మోటర్‌తో కలిసి 79bhp + పెట్రోల్ మోటర్‌ పవర్ ఇస్తుంది.

3. Maruti Suzuki Jimny – రూ.1 లక్ష ఎక్స్చేంజ్ బోనస్

– జిమ్నీ కొనేవారికి మారుతి కంపెనీ రూ.1 లక్ష ఎక్స్చేంజ్‌ బోనస్ ఇస్తోంది.

– K15B ఇంజిన్‌ (103.39 bhp, 134.2Nm)తో వచ్చే ఈ SUV 5-స్పీడ్ మాన్యువల్‌ & 4-స్పీడ్ ఆటోమేటిక్‌లో లభిస్తుంది.

– ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ.13.38 లక్షలు నుంచి.

– ఏ వేరియంట్‌కి ఆఫర్ వర్తిస్తుందో మాత్రం అధికారికంగా వెల్లడించలేదు.

4. Maruti Suzuki Ignis – రూ.30,000 వరకు క్యాష్ డిస్కౌంట్ + బోనస్

– సిటీ డ్రైవింగ్‌కు చాలామంది ఇష్టపడే కాంపాక్ట్‌ SUV.

– బేస్ Sigma వేరియంట్‌కు: రూ.50,000 క్యాష్ డిస్కౌంట్

– ఇతర వేరియంట్స్: రూ.30,000 కాష్ డిస్కౌంట్

అదనంగా:

– ఎక్స్చేంజ్‌ బోనస్: రూ.15,000

– లేదా స్క్రాపేజ్‌ బోనస్: రూ.30,000

K12M 1.2L ఇంజిన్‌ (81.86bhp, 113Nm) – మాన్యువల్ & AGS ఆప్షన్లు.

5. Maruti Suzuki Fronx – ఇంజిన్‌ ఆధారంగా వేర్వేరు తగ్గింపులు

ఫ్రాంక్స్‌ రెండు ఇంజిన్‌ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

1.2L K12N ఇంజిన్‌ (88.5bhp, 113Nm):

– క్యాష్ డిస్కౌంట్: రూ.15,000

– ఎక్స్చేంజ్ బోనస్: రూ.10,000

– లేదా స్క్రాపేజ్ బోనస్: రూ.15,000

1.0L BoosterJet టర్బో (97.6bhp, 147.6Nm):

– క్యాష్ డిస్కౌంట్: రూ.50,000

– యాక్సెసరీ కిట్

– ఎక్స్చేంజ్ బోనస్: రూ.10,000

– లేదా స్క్రాపేజ్ బోనస్: రూ.15,000

6. Maruti Suzuki Baleno – రూ.55,000 నుంచి రూ.60,000 వరకు ఆఫర్లు

– మాన్యువల్‌ వేరియంట్: రూ.55,000 క్యాష్ డిస్కౌంట్

– AGS వేరియంట్: రూ.60,000 క్యాష్ డిస్కౌంట్

అదనంగా:

– ఎక్స్చేంజ్ బోనస్: రూ.15,000

– లేదా స్క్రాపేజ్ బోనస్: రూ.25,000

1.2L K12N ఇంజిన్‌ (88.5bhp, 113Nm), మాన్యువల్‌ & AGS ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

డిసెంబర్ 2025లో Nexa కార్లు కొనాలనుకునే వారికి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్‌. ఇన్విక్టో నుంచి బాలెనో వరకు - ప్రతి మోడల్‌లో మంచి తగ్గింపులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణలో కొత్త కార్‌ కొనాలని చూస్తున్న వారికి ఇవి నిజంగా ఉపయోగపడే ఆఫర్లు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.