Maruti Suzuki Hybrid Cars: మారుతి సుజుకి ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు (EVలు) మాత్రమే కాకుండా హైబ్రిడ్ కార్లపై కూడా దృష్టి పెట్టింది. ఇంధన సామర్థ్యం & బడ్జెట్‌కు అతి పెద్ద ప్రాధాన్యం ఇచ్చే భారత్ వంటి మార్కెట్‌లో, చీప్ అండ్ బెస్ట్ హైబ్రిడ్ కార్లు గేమ్ ఛేంజర్‌గా మారతాయని కంపెనీ విశ్వసిస్తోంది. ఇప్పటివరకు గ్రాండ్ విటారా & ఇన్విక్టో వంటి ప్రీమియం హైబ్రిడ్ కార్లకే పరిమితమైన ఈ టెక్నాలజీని, రాబోయే కాలంలో, ఫ్రాంక్స్ వంటి కాంపాక్ట్ & బడ్జెట్ ఫ్రెండ్లీ SUVలలో కూడా చూడవచ్చు. దీని అర్ధం.. భవిష్యత్‌లో, మారుతి సుజుకీ హైబ్రిడ్ కార్లు కూడా కామన్ మ్యాన్ బడ్జెట్ దాటవు.
లిథియం-అయాన్ కణాలు & ఎలక్ట్రోడ్ల స్థానిక ఉత్పత్తిప్రస్తుతం, హైబ్రిడ్ కార్ల ఖరీదు ఎక్కువ కావడానికి అతి పెద్ద కారణం వాటి విడిభాగాలు & బ్యాటరీ ప్యాక్‌లు. మారుతి సుజుకి, స్థానికీకరణ ద్వారా ఈ ధరను గణనీయంగా తగ్గించవచ్చని నమ్ముతోంది. అంటే, ఆ టెక్నాలజీని ఇండియాలోనే తయారు చేసి, ఆకాశంలోని రేట్లను భూమ్మీదకు దించాలని ప్రయత్నిస్తోంది. భారతదేశంలో లిథియం-అయాన్ సెల్ & ఎలక్ట్రోడ్ ఉత్పత్తిని ప్రారంభించాలని కంపెనీ ప్రకటించడానికి ఇదే కారణం. లిథియం-అయాన్ సెల్ & ఎలక్ట్రోడ్ ఉత్పత్తిని ప్రారంభించిన మారుతి, తొలుత వీటిని గ్రాండ్ విటారా హైబ్రిడ్ కోసం ఉపయోగిస్తుంది. తర్వాత, రాబోయే కొత్త SUVలలోనూ వాటిని వాడుతుంది. అంటే, కామన్ మ్యాన్ కోరుకునే రేటులోనే మంచి హైబ్రిడ్ కార్లను ప్రవేశపెట్టే అవకాశం ఇప్పుడు మారుతి చేతిలో ఉంది.
బడ్జెట్-ఫ్రెండ్లీ హైబ్రిడ్ కార్ల భవిష్యత్తుభవిష్యత్తులో హైబ్రిడ్ టెక్నాలజీని ఖరీదైన కార్లకు మాత్రమే పరిమితం చేయబోమని మారుతి సుజుకి ఇప్పటికే చెప్పింది. ఈ ప్రకటన ప్రకారం, ఇండియన్ కస్టమర్లు త్వరలో బలమైన హైబ్రిడ్ టెక్నాలజీతో బడ్జెట్-ఫ్రెండ్లీ SUVలను చూడగలరు. సెప్టెంబర్ 3, 2025న విడుదల కానున్న ఫోర్డ్స్ & కొత్త మారుతి SUV దీనికి ప్రారంభ ఉదాహరణలు కావచ్చు. స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లు మైల్డ్ హైబ్రిడ్ మోడళ్ల కంటే భిన్నంగా ఉంటాయి. వాటికి EV మోడ్ కూడా ఉంటుంది. వాటి మైలేజ్ డీజిల్ కార్ల కంటే ఎక్కువగా ఉంటుంది. డీజిల్ కార్లకు ప్రత్యామ్నాయంగా మారుతి దీనిని పరిగణించడానికి ఇదే కారణం.
పెట్టుబడులు & భవిష్యత్తు ప్రణాళికలుమారుతి సుజుకి, 2031 నాటికి భారతదేశంలో రూ. 70,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఈ పెట్టుబడి బ్యాటరీలు, సెల్స్, హైబ్రిడ్ టెక్నాలజీ & ఎలక్ట్రిక్ వాహనాల స్థానికీకరణ కోసం ఉపయోగిస్తుంది. రాబోయే సంవత్సరాల్లో, ఈ కంపెనీ, ప్రీమియం కార్లతో పాటు బడ్జెట్-ఫ్రెండ్లీ హైబ్రిడ్ కార్లను కూడా ఇండియన్ రోడ్లపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోందనడానికి ఇది ప్రత్యక్ష సూచన.