Maruti Suzuki Electric SUV e-Vitara: మారుతి సుజుకి తమ మొదటి ఎలక్ట్రిక్ SUV Maruti Suzuki e Vitara ని భారతదేశంలో అధికారికంగా ప్రవేశపెట్టింది. ఇది జనవరి 2026లో విడుదల కానుంది. ఈ SUVని మొదట ఆటో ఎక్స్‌పో 2023లో eVX కాన్సెప్ట్‌గా చూపించారు. 2025 ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో దీని తుది మోడల్‌ను ప్రదర్శించారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇది మారుతి మొదటి ఎలక్ట్రిక్ కారు, దీనికి భారతదేశం NCAP నుంచి 5-స్టార్ భద్రతా రేటింగ్ లభించింది. దాని ఫీచర్లను చూద్దాం.

Continues below advertisement

కొత్త EV ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించిన ఈ ఎలక్ట్రిక్ కారు

e Vitara అనేది మారుతి మొదటి ఎలక్ట్రిక్ కారు, ఇది ప్రత్యేకమైన HEARTECT-e EV ప్లాట్‌ఫారమ్‌పై తయారైంది. ఈ ప్లాట్‌ఫారమ్ ఎలక్ట్రిక్ కార్ల కోసం తయారు చేశారు. ఇందులో ఫ్లాట్ ఫ్లోర్, తేలికైన, బలమైన నిర్మాణం, హై-వోల్టేజ్ సిస్టమ్ వంటి ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. ఈ ప్లాట్‌ఫారమ్ కారును సురక్షితంగా, స్థిరంగా, నడపడానికి సులభతరం చేస్తుంది.

బ్యాటరీ, పరిధి ,పనితీరు

e Vitara రెండు వెర్షన్లలో (2WD -4WD) ప్రవేశపెట్టనుంది. టాప్ మోడల్ ARAI పరిధి 543 కిలోమీటర్ల వరకు ఉంటుందని చెబుతున్నారు, ఇది ఈ విభాగంలో చాలా ఎక్కువ. WLTP ప్రమాణాల ప్రకారం, ఈ కారు దాదాపు 142 bhpని, 189 Nm టార్క్‌ను ఇస్తుంది. అదే సమయంలో, WLTP పరిధి దాదాపు 344 కిలోమీటర్లు, ఇది నగరం, హైవే రెండింటికీ మంచిది.

Continues below advertisement

4WD ALLGRIP-e సిస్టమ్

మారుతి ఈ ఎలక్ట్రిక్ SUV 4WD మోడల్‌లో తన కొత్త ALLGRIP-e ఎలక్ట్రిక్ సిస్టమ్‌ను అందించింది. ఇందులో ముందు,  వెనుక యాక్సిల్స్‌పై మోటార్లు అమర్చారు, ఇది కారుకు మెరుగైన గ్రిప్, బ్యాలెన్స్ ఇస్తుంది. ట్రైల్ మోడ్ సహాయంతో, ఇది గతుకుల రోడ్లపై కూడా సులభంగా నడవగలదు.

డిజైన్, రంగు -శైలి

e Vitara డిజైన్ ఫ్యూచరిస్టిక్‌గా తీర్చిదిద్దారు. ఇందులో షార్ప్ LED హెడ్‌లైట్లు, కనెక్టెడ్ టైల్‌లైట్లు, 3D స్టైల్ బాడీ ఉన్నాయి, ఇది చాలా ఆధునిక రూపాన్ని ఇస్తుంది. కారు 10 రంగులలో వస్తుంది, వీటిలో నాలుగు డ్యూయల్-టోన్ ఎంపికలు కూడా ఉంటాయి.

విడుదల -ధర

మారుతి e Vitara ని కంపెనీ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUV మార్కెట్‌లో విడుదల చేస్తుంది. ఇది Tata Curvv EV, MG ZS EV, Mahindra BE.6 వంటి ఎలక్ట్రిక్ SUVలతో నేరుగా పోటీపడుతుంది. భారతదేశంలో ఇది జనవరి 2026లో విడుదల కానుంది. ధర 18 నుండి 25 లక్షల రూపాయల మధ్య ఉంటుందని భావిస్తున్నారు.

బుకింగ్ -డెలివరీ

Maruti Suzuki e-Vitara అమ్మకాలు భారతదేశంలో జనవరి 2026 నుంచి ప్రారంభమవుతాయి. అదే సమయంలో, ఇది జపాన్‌లో కూడా విడుదల కానుంది. అక్కడ బుకింగ్ త్వరలో ప్రారంభమవుతుంది, అయితే కంపెనీ ఇంకా తేదీని ప్రకటించలేదు. ఈ ఎలక్ట్రిక్ SUV బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) మోడల్‌తో కూడా వస్తుంది. ఈ మోడల్‌లో, కస్టమర్‌లు బ్యాటరీ లేకుండా కారును కొనుగోలు చేయవచ్చ. బ్యాటరీని అద్దెకు ఉపయోగించవచ్చు. దీనితోపాటు, కంపెనీ బైబ్యాక్ ప్రోగ్రామ్‌ను కూడా అందిస్తుంది, ఇది కస్టమర్‌లకు దీన్ని కొనుగోలు చేయడం సులభం చేస్తుంది.

దేశవ్యాప్తంగా ఛార్జింగ్ నెట్‌వర్క్

మారుతి సుజుకి భారతదేశంలో EV ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరించేందుకు సిద్ధమవుతోంది. e-Vitara ప్రారంభించిన రోజునే, కంపెనీ 2000 ఛార్జర్లను యాక్టివేట్ చేస్తుంది. దీని తరువాత, 2030 నాటికి దేశవ్యాప్తంగా 1 లక్ష ఛార్జర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.