తిపెద్ద  ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి  'గ్రాండ్ విటారా'ను త్వరలో భారత మార్కెట్లోకి విడుదల చేయబోతుంది.  మిడ్-సైజ్ ఎస్‌యూవీ  విభాగంలో వస్తున్న ఈ కారు..  హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, టాటా హారియర్, MG హెక్టర్ వంటి కార్లకు పోటీగా రాబోతున్నది.


ఈ కొత్త ఎస్‌యూవీకి సంబంధించి ఇప్పటికే అనేక ఫీచర్లు, వివరాలు వెల్లడయ్యాయి. దీని ధరకు సంబంధించిన విషయాలను మాత్రం కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఇప్పటికే మారుతీ సుజుకి తన కొత్త కాంపాక్ట్ SUV గ్రాండ్ విటారాను విదేశీ మార్కెట్లకు  పరిచయం చేసింది. ఇటీవల దక్షిణాఫ్రికాలో అధికారికంగా విడుదల చేయడానికి ముందు ప్రదర్శించింది. కాంపాక్ట్ SUV విభాగంలో ఫ్లాగ్‌షిప్ ఆఫర్‌గా S-క్రాస్ SUV స్థానంలో రానున్నది. మరికొద్ది రోజుల్లోనే ఈ కారుకు సంబంధించిన ధరను ప్రకటించే అవకాశం ఉంది.


ఆకట్టుకున్నపెరల్ వైట్ ఎక్ట్సీరియర్ కలర్‌


దక్షిణాఫ్రికా మార్కెట్ లో ప్రదర్శించబడుతున్న మారుతి సుజుకి గ్రాండ్ విటారా పెరల్ వైట్ ఎక్ట్సీరియర్ కలర్‌ తో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. తొలిసారిగా వచ్చిన వేరియంట్‌లో గ్రాండ్ విటారా.. టాప్-స్పెక్ ఆల్-గ్రిప్ మోడల్. ఇది ఆల్-వీల్ డ్రైవ్‌ను అందిస్తుంది. పూర్తిగా ఇండియాలోనే తయారు చేసిన మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తి.. గ్రాండ్ విటారా. ముందుగా దీన్ని ఇండియాలో విడుదల చేసి, ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో సహా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు.


రెండు ఇంజిన్ వేరియంట్లు


గ్రాండ్ విటారా..  త్వరలో రాబోయే టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ SUV యొక్క టెక్నికల్ కజిన్ గా చెప్పుకోవచ్చు. ఈ రెండు కార్లు సంయుక్తంగా అభివృద్ధి చేయబడ్డాయి. కర్నాటకలోని టయోటా బిడాడి ప్లాంట్ నుంచి తయారు వీటిని చేస్తున్నారు. మారుతి సుజుకి గ్రాండ్ విటారాను రెండు ఇంజన్ ఎంపికలలో అందజేస్తున్నారు. 1.5-లీటర్ మైల్డ్ హైబ్రిడ్ ఇంజన్ తో పాటు  కొత్త 1.5-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్‌తో ఈ కార్లు అందుబాటులోకి రానున్నాయి. 


మైల్డ్ హైబ్రిడ్ ఇంజన్ గరిష్టంగా 100 PS పవర్, 135 Nm పీల్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్,  6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. మైల్డ్-హైబ్రిడ్ వేరియంట్ 21.11 kmpl ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంది. బలమైన హైబ్రిడ్ ఇంజన్  కావడం మూలంగా గరిష్టంగా 115 PS శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కేవలం e-CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేసి ఉంటాయి. మారుతీ సుజుకి టొయోటాలోని హైరైడర్ మాదిరిగానే 27.97 kmpl బెస్ట్-ఇన్-క్లాస్ ఫ్యూయెల్ ఎఫిషియెన్సీ ఫిగర్ ను సూచిస్తుంది.   


ఫీచర్లు ఇవే..


గ్రాండ్ విటారా అనేది మారుతి సుజుకి యొక్క మొదటి పనోరమిక్ సన్‌రూఫ్‌ వాహనం. గ్రాండ్ విటారా హెడ్-అప్ డిస్ప్లే (HuD), వైర్‌లెస్ ఛార్జర్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 360-డిగ్రీ కెమెరా, యాంబియంట్ లైటింగ్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, కీలెస్ ఎంట్రీ, వెనుక AC వెంట్‌లు, USB పోర్ట్‌లు కలిగి ఉంటుంది.  ఆండ్రాయిడ్ ఆటో,  యాపిల్ కార్‌ప్లేకి మద్దతు ఇచ్చే 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఉంటుంది.


భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత


భద్రత కోసం 6  ఎయిర్‌ బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, హిల్ డిసెంట్ కంట్రోల్, రియర్ డిస్క్ బ్రేక్‌లు, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్‌లు ఉన్నాయి.