Maruti Grand Vitara Recalled 39,506 Units: మారుతి సుజుకి గ్రాండ్ విటారా యజమానులు, డ్రైవర్లకు బిగ్ అలెర్ట్. భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న ఈ మిడ్‌సైజ్ SUVలో ఫ్యూయల్ లెవల్ ఇండికేటర్ వ్యవస్థలో లోపం బయటపడింది. దీంతో, కంపెనీ భారీగా 39,506 యూనిట్స్‌ను (కార్లను) రీకాల్ చేస్తోంది. డిసెంబర్ 9, 2024 నుంచి ఏప్రిల్ 29, 2025 మధ్యలో తయారైన గ్రాండ్ విటారా మోడల్స్ ఈ రీకాల్‌లో ఉన్నాయి.
ఏంటి సమస్య?కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, గ్రాండ్ విటారా స్పీడోమీటర్ అసెంబ్లీలో ఉన్న ఫ్యూయల్ లెవల్ ఇండికేటర్ & లో ఫ్యూయల్ వార్నింగ్ లైట్ సరిగ్గా పని చేయకపోవచ్చు. అంటే ట్యాంకులో ఎంత పెట్రోల్ ఉందో డ్రైవర్‌కు నిజమైన సమాచారం అందకపోవచ్చు. ఈ పరిస్థితిలో, కార్ అకస్మాత్తుగా ఇంధనం అయిపోయే అవకాశం ఉంది. హైవే ప్రయాణాల్లో లేదా దూర ప్రాంతాల్లో ఇది చాలా సమస్యలను తెచ్చి పెడుతుంది, ఒక్కోసారి ప్రమాదకరంగా కూడా మారుతుంది.
కారు యజమానులు ఏమి చేయాలి?మారుతి సుజుకి ఇండియా ఈ సమస్య కనిపించిన కార్ల యజమానులకు వ్యక్తిగతంగా మెసేజ్ లేదా కాల్ చేస్తుంది. అఫెక్ట్ అయిన కారు ఉన్న యజమానులు తమ సమీపంలోని అథరైజ్డ్ మారుతి వర్క్‌షాప్‌ను సందర్శించాలి. వర్క్‌షాప్‌లో ఫ్యూయల్ సూచిక భాగాన్ని పూర్తిగా చెక్ చేసి, లోపం కనపడితే ఉచితంగా రీప్లేస్ చేస్తారు. అదే విధంగా, యజమానులు తమ కార్ VIN నంబర్‌ను మారుతి అధికారిక వెబ్‌సైట్‌లో ఎంటర్ చేసి, తమ వాహనం రీకాల్‌లో ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు.
గ్రాండ్ విటారా ధరలు (ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ)హైదరాబాద్, విజయవాడ షోరూమ్‌లలో గ్రాండ్ విటారా ధరలు ₹10.77 లక్షల నుంచి ₹19.72 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి. ఆన్-రోడ్ ధర సుమారు రూ. 13.43 లక్షల నుంచి రూ. 24.46 లక్షల వరకు ఉంటుంది. మిడ్‌సైజ్ SUV సెగ్మెంట్‌లో ఇవి ప్రస్తుతం అత్యంత అందుబాటు ధరలు.
ఇంజిన్ ఆప్షన్లు - Mild Hybrid & Strong Hybrid
గ్రాండ్ విటారాలో రెండు ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి:
1. 1.5 లీటర్ K15C పెట్రోల్ మైల్డ్ హైబ్రిడ్
పవర్: 103hp
గేర్ బాక్స్: 5-స్పీడ్ మాన్యువల్ / 6-స్పీడ్ ఆటోమేటిక్
ఆల్‌గ్రిప్ AWD ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది
2. 1.5 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ (Toyota-sourced)
ఇంజిన్ పవర్: 92hp
ఎలక్ట్రిక్ మోటార్ పవర్: 79bhp / 141Nm
కంబైన్డ్ అవుట్‌పుట్: 109hp
ట్రాన్స్‌మిషన్: e-CVT
ఈ వెర్షన్ ఎక్కువ కంఫర్ట్, మంచి రెస్పాన్స్ & అద్భుతమైన మైలేజ్‌కు పాపులర్.
మైలేజ్ వివరాలు
మారుతి తెలిపిన ప్రకారం:
స్ట్రాంగ్ హైబ్రిడ్: 27.97 kmpl
మైల్డ్ హైబ్రిడ్ మాన్యువల్: 21.1 kmpl,
AWD వర్షన్: 19.38 kmpl
ఆటోమేటిక్: 20.58 kmpl
తెలుగు రాష్ట్రాల్లో దీర్ఘ ప్రయాణాలు చేసే కుటుంబాలు, డైలీ ఆఫీస్ కమ్యూట్ చేసే వారు ఈ మైలేజ్‌లను బట్టి తమ అవసరాలకు సరిపోయే వేరియంట్‌ను ఎంపిక చేసుకోవచ్చు.
మారుతి సుజుకి, రీకాల్ ప్రకటించడం ద్వారా తమ కస్టమర్ల భద్రతపైన దృష్టి పెట్టినట్లు మరోసారి స్పష్టమైంది. ఫ్యూయల్ ఇండికేటర్ లోపం చిన్న సమస్యలా కనిపించినా, డ్రైవింగ్ సమయంలో ఇది పెద్ద ఇబ్బందులకు దారి తీసే అవకాశం ఉంది.గ్రాండ్ విటారా యజమానులు తప్పకుండా తమ కార్ VIN చెక్ చేసి, అవసరమైతే వెంటనే మారుతి వర్క్‌షాప్‌ను సంప్రదించడం మంచిది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.