Maruti Fronx on Road Price Hyderabad: భారత్‌ మార్కెట్‌లో ఈ మధ్య కాలంలో అమితంగా ఆకట్టుకుంటున్న సరికొత్త కూపే ఎస్‌యూవీ. సాధారణ హ్యాచ్‌బ్యాక్‌ కార్ల కంటే బోల్డ్‌ లుక్‌, కాంపాక్ట్‌ ఎస్‌యూవీల కంటే స్టైలిష్‌ ప్రోఫైల్‌ కోరుకునే కార్ లవర్స్‌ కోసం మారుతి సుజుకి ఫ్రాంక్స్‌ ఒక పర్ఫెక్ట్‌ ఐకాన్‌గా మారింది. గ్రాండ్ విటారా ఇన్స్‌పిరేన్‌తో వచ్చిన ఈ కారు విజువల్‌ స్వాగ్, అదిరిపోయే రోడ్‌ ప్రెజెన్స్‌ కారణంగా మిడిల్ క్లాస్ నుంచి టెక్ గ్రూప్స్ వరకు అందరి హాట్ ఛాయిస్‌గా నిలుస్తోంది. 

Continues below advertisement

అయితే , కొత్త కారు కొనేటప్పుడు కేవలం ఎక్స్‌షోరూమ్‌ ధర చూస్తే సరిపోదు. తెలంగాణ ప్రాంతీయ రవాణా శాఖ టాక్స్‌లు, గ్రీన్‌సెస్‌, ఇన్సూరెన్స్, ఇత లీగల్‌ ఛార్జీలన్నీ కలుపుకొని హైదరాబాద్‌లో ఈ కారు ఆన్‌రోడ్‌ ప్రైస్‌ ఎంత అవుతుంది? అసలు బేస్ మోడల్ సిగ్మా నుంచి టాప్ -ఎండ్‌ టర్బో మోడల్‌ ఆల్ఫా వరకు విషయాలన్నింటినీ ఇక్కడ చూద్దాం.

రోడ్డు ప్రెజెన్స్‌లో నెక్ట్స్‌ లెవెల్ స్వాగ్

మారుతి ఫ్రాంక్స్‌ డిజైన్ లాంగ్వేజ్‌ చూస్తే ఎవరైనా సరే ప్లాట్ అవ్వాల్సిందే. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ బలెనో ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి రూపొందించారు. దీని లుక్స్‌ మాత్రం కంప్లీట్‌గా డిఫరెంట్‌. ముందు వైపు ఉండే ప్రెసిషన్ కట్‌ నెక్స్‌వేవ్‌ గ్రిల్‌, క్రోమ్‌ ఫినిషింగ్, ట్రిపుల్‌- ఎలిమెంట్‌ ఎల్‌ఈడీ డిజైన్ దీనికి ఒక అగ్రెసివ్ మోడరన్ ఫేస్‌ను ఇస్తాయి. 

Continues below advertisement

పక్క నుంచి చూసినప్పుడు స్లోపింగ్‌ రూఫ్‌ లైన్, 16 ఇంచ్‌ డ్యూయల్‌-టోన్ అలాయ్ వీల్స్‌ కారుకు స్పోర్టీ క్రాస్‌ ఓవర్ స్టైల్‌ జోడిస్తాయి. వెనుక  వైపు ఉన్న కనెక్టెడ్‌ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్‌, రాత్రి వేళల్లో హైవేలపై ప్రయాణిస్తున్నప్పుడు అద్భుతమైన విజువల్ అప్పీల్‌న ఇస్తాయి. 190మిమీ హై గ్రౌండ్ క్లియరెన్స్‌ ఉండటం వల్ల స్పీడ్ బ్రేకర్లు, గుంత రోడ్లపై కూడా కారు ఎక్కడా కింద తగలకుండా స్మూత్‌గా దూసుకెళ్తోంది. 

ఇంజన్ ఆప్షన్లు-పర్ఫార్మెన్స్‌

ఈ కారులో మారుతి సుజుకి రెండు రకాల పెట్రోల్‌ ఇంజన్ ఆప్షన్‌లను అందిస్తోంది. 1.2లీటర్‌ అడ్వాన్స్‌డ్‌ కే-సిరీస్‌ డ్యూయల్‌ జెట్‌ ఇంజన్ 89 బీహెచ్‌పీ పవర్‌ను, 113Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇది సిటీ డ్రైవింగ్‌కు ఎంతో లీనియర్‌, స్మూత్‌ పర్ఫార్మెన్స్‌ ఇస్తుంది. ఇందులో 5 స్పీడ్‌ మాన్యుల్‌, ఏజీఎస్ ఆటోమేటిక్‌ గేర్ బాక్స్  అందుబాటులో ఉన్నాయి. 1.0లీటర్‌ టర్బో బూస్టర్‌ జెట్‌ ఇంజన్ అద్భుతమైన ఆప్షన్. ఇది ఏకంగా 99 బీహెచ్‌పీ పవ్‌, 147.6ఎన్‌ఎమ్‌ పీక్ టార్క్‌ను అందిస్తుంది. దీని పిక్‌అప్‌, పవర్‌ డెలివరీ చాలా పంచీగా ఉంటాయి. ఇందులో 5 స్పీడ్ మాన్యువ్‌తోపాటు 6-స్పీడ్‌ టార్క్ కన్వర్టర్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్ కూడా లభిస్తుంది. ఇది పాడి్‌ షిఫ్ట్స్‌తో వస్తుంది. 

మైలేజీ రంగా చూస్తే 1. 2 లీటర్‌ పెట్రోల్‌ వేరియంట్‌ లీటరుకు 21.79 కిలోమీటర్‌ నుంచి 22. 89కి.మి. వరకు మైలేజీ ఇస్తుంది. ఇక మైలేజీ పరమావధి అనుకునే వారి కోసం ఫ్రాంక్స్‌ సీఎన్జీ మోడల్ కూడా అందుబాటులో ఉంది. ఇది కేజీ సీఎన్జీకి 28.51కి.మి మైలేజ్‌ ఇస్తూ ఇంధన ఖర్చులు భారీగా తగ్గిస్తుంది. 

హైదరాబాద్‌ ఆన్‌రోడ్‌ ప్రైస్ బ్రేకప్‌

హైదరాబాద్‌లో మారుతి ఫ్రాంక్స్‌ ఎక్స్ షోరూమ్‌ ధర 6.85లక్షల రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. టాప్ ఎండ్‌ మోడల్‌కు 12.88 లక్షల వరకు ఉంటుంది. తెలంగా ఆర్టీవో రిజిస్ట్రేషన్ ఛార్జీలు కారు ధరను బట్టి 9 శాతం నుంచి 14శాతం వరకు మారుతుంటాయి. వీటికి తోడు లైఫ్‌ ట్యాక్స్‌, థర్డ్‌ పార్టీ+ ఓన్ డ్యామేజ్‌ ఇన్సూరెన్స్‌, ఫాస్టాగ్‌, లాజిస్టిక్స్‌ ఛార్జీలు అదనంగా ఉంటాయి. 

బేస్ వేరియంట్‌ సిగ్మా 1.2L MT ధర 6,84,900. దీనిపై తెలంగాణ ఆర్టీవో ట్యాక్స్ దాదాపు 1, 00,886, ఇన్సూరెన్స్‌ సుమారు 35, 534 కలుపుకుని, ఆన్‌రోడ్‌ ప్రైస్‌ 8.16 లక్షల నుంచి 8.52 లక్షల మధ్య ఉంటుంది. మోస్ట్ వాల్యు ఫర్‌ మనీగా నిలిచే మిడ్ వేరియంట్‌ డెల్టా ప్లస్‌ 1.2L MT ఆన్‌రోడ్‌ ధర హైదరాబాద్‌లో సుమారు9.69 లక్షల నుంచి 10.02లక్షలుగా ఉంది. టాప్‌ వేరియంట్‌ ఆల్ఫా టర్బో 1.0L ఎట్ డ్యూయల్ టోన్ అన్ని ప్రీమియం ఫీచర్స్‌, టర్బో ఇంజన్,ఆటోమేటిక్‌ గేర్ బాక్స్‌తో వచ్చే ఈ ఫ్లాగ్‌షిప్‌ మోడల్ ఆన్‌రోడ్‌ ధర హైదరాబాద్‌లో సుమారు 14. 73 లక్షల నుంచి 15. 04 లక్షల బడ్జెట్‌ తాకుతుంది.