Maruti Suzuki Fronx Hybrid SUV Launch Soon In India: మారుతి సుజుకి, త్వరలో భారతీయ మార్కెట్లో కొత్త హైబ్రిడ్ SUVని ప్రవేశపెట్టడానికి రెడీ అవుతోంది. ఈ కొత్త కారు Maruti Suzuki Fronx Hybrid SUV. దీని ఫ్రంట్ ఫేసియాను Maruti Grand Vitara నుంచి ప్రేరణతో డిజైన్‌ చేస్తున్నారు, కాబట్టి దీనిని మినీ గ్రాండ్‌ విటారా అనవచ్చు. ఈ కొత్త ఫ్రాంక్స్ హైబ్రిడ్ SUV ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10 లక్షల కన్నా తక్కువగా ఉంటుంది. 

ఎక్స్‌టీరియర్‌లో మార్పులుమారుతి సుజుకి ఫ్రాంక్స్ హైబ్రిడ్ డిజైన్ ప్రస్తుత మోడల్ లాగానే ఆకర్షణీయంగా ఉండబోతోంది, అదనంగా దీనికి కొత్త అప్‌డేట్స్‌ ఇస్తారని భావిస్తున్నారు. ఈ కారుకు అమర్చిన స్లిమ్ LED DRLs, బంపర్‌ మీద హెడ్‌ల్యాంప్‌లు & పెద్ద క్రోమ్-యాక్సెంటెడ్ NEXwave గ్రిల్‌ వంటివి కస్టమర్లకు థ్రిల్‌ ఫీల్‌ ఇవ్వనున్నాయి.

ఇంకా.. కూపే లాంటి వాలుగా ఉండే రూఫ్‌లైన్, 16-అంగుళాల మెషిన్-ఫినిష్డ్ అల్లాయ్ వీల్స్ & 190 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఈ కారుకు ఉంటుంది, ఇవి దీనికి కాంపాక్ట్ SUV లుక్ ఇస్తాయి. వెనుక భాగంలో, కనెక్టెడ్‌ LED టెయిల్‌లైట్లు, షార్క్-ఫిన్ యాంటెన్నా & రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్ వంటివి కార్‌ డిజైన్‌కు ఆధునిక హంగులు అద్దుతాయి. కొత్త డ్యూయల్-టోన్ కలర్ ఎంపికలు కూడా మార్పులలో భాగంగా ఉంటాయి.          

అడ్వాన్స్‌డ్‌ ఇంటీయరియర్‌అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో మారుతి సుజుకి ఫ్రాంక్స్ హైబ్రిడ్‌ క్యాబిన్‌ను అమర్చారు. దీనిలో... 9-అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో + టచ్‌స్క్రీన్ ఉంటుంది, ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ ప్లేలకు మద్దతు ఇస్తుంది. ఇతర ఫీచర్లలో.. 360 డిగ్రీల కెమెరా, హెడ్స్-అప్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జర్, పుష్-బటన్ స్టార్ట్ & సుజుకి కనెక్ట్‌ నుంచి 40కి పైగా కనెక్టెడ్ ఫీచర్లు ఉంటాయి. 

మారుతి సుజుకి ఫ్రాంక్స్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ మారుతి సుజుకి ఫ్రాంక్స్ హైబ్రిడ్‌లో.. 1.2-లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌, ఎలక్ట్రిక్ మోటార్ & బ్యాటరీ ప్యాక్‌తో కూడిన బలమైన హైబ్రిడ్ సెటప్‌ ఉంటుంది. ఇది మెరుగైన ఇంధన సామర్థ్యం & పనితీరును అందిస్తుంది. ముఖ్యంగా సిటీ డ్రైవింగ్‌లో ఇది మంచి మైలేజీ & సులభమైన డ్రైవింగ్‌ను అందించగలదు.

మారుతి సుజుకి ఫ్రాంక్స్ హైబ్రిడ్ మైలేజీకొత్త మారుతి సుజుకి ఫ్రాంక్స్ హైబ్రిడ్ 35 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజీని ఇవ్వగలదని ఆటో ఎక్స్‌పర్ట్స్‌ అంచనా వేస్తున్నారు. ఇదే నిజమైతే, ఈ కారు భారతదేశంలో అత్యంత పొదుపైన కాంపాక్ట్ SUVగా పాపులర్‌ అవుతుంది.

మారుతి ఫ్రాంక్స్ ప్రస్తుత మోడల్ 1.2-లీటర్ పెట్రోల్ & 1.0-లీటర్ టర్బో బూస్టర్‌జెట్ ఇంజిన్‌తో పని చేస్తుంది, దీనికి 5-స్పీడ్ AMT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను యాడ్‌ చేశారు. కంపెనీ లెక్క ప్రకారం, ఈ కారు లీటరు పెట్రోల్‌కు 22.89 కిలోమీటర్ల మైలేజ్‌ ఇస్తుంది.