Maruti Suzuki Fronx Discount Offers: మారుతి సుజుకి డీలర్‌షిప్‌లు ఈ నెలలో అరేనా, నెక్సా రేంజ్‌లోని ఎంపిక చేసిన మోడల్స్‌పై భారీ తగ్గింపులను అందిస్తున్నాయి. ఈ తగ్గింపు ప్రయోజనాల కింద కస్టమర్‌లు నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్‌లను పొందవచ్చు.


డిస్కౌంట్ ఎంత?
ఈ డిస్కౌంట్ ఆఫర్ కింద మారుతి సుజుకి స్విఫ్ట్, దాని టర్బో పెట్రోల్ ఇంజిన్ మోడల్‌పై రూ. 60,000 వరకు నగదు తగ్గింపు, రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌తో అందుబాటులో ఉంది. 2024 ఫిబ్రవరిలో నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తున్న దాని వేరియంట్‌లతో ఎటువంటి తగ్గింపు అందుబాటులో లేదు. ఈ ఆఫర్ లిమిటెడ్ టైమ్ పీరియడ్ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.


ఇంజిన్ ఇలా...
మారుతి సుజుకి ఫ్రాంక్స్ అనేది కంపెనీ బలెనో ద్వారా రూపొందించిన కూపే ఎస్‌యూవీ. ఇందులో 1.2 లీటర్ నాలుగు సిలిండర్, నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, 1.0 లీటర్, మూడు సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉన్నాయి. ఈ ఇంజన్ 89 బీహెచ్‌పీ పవర్, 113 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే టర్బో ఇంజన్ 99 బీహెచ్‌పీ పవర్, 148 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 5 స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ, సిక్స్ స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ఉన్నాయి.


ఫీచర్లు ఇలా...
వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లేతో కూడిన 9 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హెడ్ అప్ డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, ఆటో క్లైమేట్ కంట్రోల్ దీని ముఖ్య ఫీచర్లు. ఇది కాకుండా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్ హోల్డ్ అసిస్ట్, 360 డిగ్రీ కెమెరా, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్ వంటి సెక్యూరిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి.


వేటితో పోటీ పడతారు?
ఈ కారు టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్‌టర్ వంటి కార్లతో పోటీపడుతుంది. ఇవి రెండూ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ని కలిగి ఉన్నాయి. రెండూ మాన్యువల్‌తో పాటు ఏఎంటీ ఆప్షన్‌ను కూడా కలిగి ఉన్నాయి. ఈ రెండు కార్లు కూడా సీఎన్‌జీ ఆప్షన్‌తో మార్కెట్లోకి వచ్చాయి. హ్యుందాయ్ ఎక్స్‌టర్, టాటా పంచ్ రెండు కార్ల ఎక్స్ షోరూమ్ ధరలు రూ.6 లక్షల నుంచి ప్రారంభమవుతాయి.


మరోవైపు మహీంద్రా తన ఎక్స్‌యూవీ300 ఫేస్‌లిఫ్ట్‌ను మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఇది మరి కొన్ని వారాల్లో మార్కెట్లోకి రానుంది. ఈ ప్రధాన అప్‌డేటెడ్ మోడల్‌ను లాంచ్ చేయడానికి ముందు, కంపెనీ ఇప్పటికే ఉన్న ఎక్స్‌యూవీ300 లైనప్‌ను "ర్యాంప్ డౌన్" చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న ఎక్స్‌యూవీ300 లైనప్ డిమాండ్‌కు అనుగుణంగా సర్దుబాటు చేయనుంది. ఎక్స్‌యూవీ300 ఎస్‌యూవీలో ప్రస్తుతం 16 పెట్రోల్, తొమ్మిది డీజిల్ వేరియంట్‌లు ఉండటం విశేషం. ఫేస్‌లిఫ్టెడ్ మోడల్ వేరియంట్లు, ఇంజిన్ లైనప్ గురించి సమాచారం ఇంకా అందుబాటులో లేదు.



Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!